సాక్షి, అమరావతి : సున్నా వడ్డీ పధకం తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కష్టకఆలంలో కూడా తమకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తామంతా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని, రాష్ట్రానికి సీఎం మార్గనిర్దేశం కావాలని పేర్కొన్నారు. (వైఎస్సార్ సున్నా వడ్డీని ప్రారంభించిన సీఎం)
విశాఖపట్నం : సంక్షోభంలో బియ్యం, కందులు, శనగలు ఇచ్చారని, ఇళ్లపట్టాలు కూడా ఇస్తున్నారని మహిళలు వైఎస్ జగన్‌ను ప్రశంసించారు. తమపట్ల సొంత అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదని, రుణాలు, వాటి వడ్డీలు తడిచి మోపిడయ్యాయని వాపోయారు. పాదయాత్రలో నేను విన్నాను.. ఉన్నాను.. అని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం మమ్మల్ని ఆదుకుంటున్నారని ఆనందరం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ముఖ్యమంత్రి వెంటే ఉంటామని, వైఎస్ జగనేముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాస్క్‌ల తయారీ ఎలా ఉందని విశాఖ కలెక్టర్‌ను ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన తయారు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మాస్క్‌లను ముందు రెడ్‌జోన్లలో పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్‌కు వైఎస్ జగన్ సూచించారు. (గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !)
కర్నూలు: దివంగత వైఎస్సరా్ వడ్డీ భారం తగ్గించడానికి పావలా వడ్డీ ప్రారంభించారని మహిళలు తెలిపారు. తమ దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ, రుణమాఫీ లేదని వాపోయారు. పాదయాత్రలో తమ కష్ట సుఖాలను తెలుసుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా సున్నా వడ్డీ పథకం తీసుకు వచ్చారని హర్షం వ్యక్తంచేశారు. (
నెల్లూరు : గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారని డ్రాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని, కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంటున్న తీరు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ మార్గనిర్దేశం కొనసాగాలని, ఆయన
ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..! )
కడప జిల్లా : కరోనా వచ్చి, నానా కష్టాలు తెచ్చిందని, ఈ సమయంలో సున్నా వడ్డీ వస్తుందా? లేదా? అని సందేహించామని తెలిపారు. అయినా ఆర్థిక భారాన్ని భరిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేని సమయంలో కూడా తమకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయం తమను ఆర్థికంగా చాలా ఆదుకుందని అన్నారు.
ప్రకాశం జిల్లా : అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వేయి రూపాయలు, మూడుసార్లు రేషన్ ఇవ్వడం చాలా మంది నిర్ణయాలు. మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం హర్షణీయం. అలాగే అరటిలాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా చేయిస్తున్నారు. దీనివల్ల ఉపాధి పొందుతున్నాం అని ప్రకాశం జిల్లా డ్రాక్రా మహిళలు తమ సంతోషాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పంచుకున్నారు. (రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్య)
తూర్పుగోదావరి : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న యత్నాలు హర్షణీయం. కష్టకాలంలో కూడా మాకు అండగా ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా ఆదుకుంటున్నారు. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా సేవ చేయిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గొప్ప ఆలోచనను అమల్లోకి తీసుకు వస్తున్నారు. వాళ్లు దేవుళ్లులా సహాయం చేస్తున్నారు. గతంలో పెన్షన్‌కోసం అవ్వాతాతలు ఎంతో ఎదురుచూపులు చూసేవారు. ఉదయం 8గంటల్లోపే మీరు పెన్షన్ అందించేలా చూస్తున్నారు. ప్రతి విషయంలో మాకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.(ఆ సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది)
‘దిశ చట్టాన్ని తీసుకు వచ్చిమహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు. యావత్ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నవరత్నాలతో అందరికీ మంచి జరుగుతోంది. పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేశారు. అందరం రుణపడి ఉంటున్నాం. కుటుంబంలో పెద్ద దిక్కై కరోనా సమయంలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నారు. వేయి రూపాయలు కూడా ప్రతి కుటుంబానికీ ఇచ్చారు. గర్వపడేలా చేస్తున్నారు. అని తమ మనసులోని కృతజ్ఞతను తెలిపారు. రూ.100 కే పండ్లు కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. పూలరైతులను ఆదుకునేందుకు కార్యక్రమం చేపట్టామని, పండ్లతోపాటు పూలు కూడా ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..)
Comments
Please login to add a commentAdd a comment