సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దాదాపు రూ. 251 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను పక్కనబెట్టి, ఈ శాఖతో సంబంధమున్న ఓ ఐఏఎస్ అధికారిని తప్పుదోవ పట్టించి, ద్వితీయశ్రేణి అధికారులు ఈ ధాన్యాన్ని ఇష్టారాజ్యంగా మిల్లర్లకు కేటాయించారు. ఫలితంగా తమ బ్యాంకు బ్యాలెన్సులను పెంచుకున్నారన్న ఆరోపణలు సొంత శాఖలోనే వినిపిస్తున్నాయి. సర్కారు ఖజానాకు ఎసరు పెడుతున్న ‘కస్టమ్’ బాగోతం వెనుక ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఎందు కు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు.
మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి
ప్రతీ సీజన్‌లో ప్రభుత్వం స్వయం సహాయక సం ఘాలు, పౌరసరఫరాల శాఖ, ఎఫ్‌సీఐ తదితర సంస్థ ల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధా న్యం కొనుగోలు చేస్తుంది. సీఎంపీ మార్గదర్శకాల ప్ర కారం కొనుగోలు కేంద్రాల సమీపంలో ఉండే రైస్ మి ల్లులకు ఆ ధాన్యాన్ని తరలించాలి. వారు ఆ ధాన్యా న్ని మర పట్టించి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఇక్కడే అధికారులు తమ పలుకుబడి ని ఉపయోగించి ధాన్యాన్ని ఇష్టారాజ్యంగా ఇచ్చేసి ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్లు క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల చొప్పున బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మర పట్టినందు కు క్వింటాల్‌కు రూ.25 ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. పెద్దనూకలు, చిన్న నూకలు, తౌడు, ఊక మిల్లర్లకే అ దనపు లాభంగా ఉంటుంది. నూకలకు సైతం మా ర్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ. 20 వరకు ధర పలుకుతుండగా, తౌడు వంట నూనె, ఊక ఇటుక బట్టీలకు అమ్ముకుంటారు.
తిరిగిరాని బియ్యం
ధాన్యం కేటాయించిన 15 రోజులలో బియ్యాన్ని మి ల్లర్లు ప్రభుత్వానికి అందించాలి. దీనిపై పౌరసరఫరా ల శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. అయితే ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడమే కాకుం డా, మిల్లర్లతో కుమ్ముక్కై సర్కారు సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. ఫలితంగా కొందరు రైస్ మిల్లర్లు పైసా పెట్టుబడి లేకుండా, బియ్యాన్ని తిరిగి ఇవ్వకుం డా రూ.251 కోట్ల సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. ఈ బాగోతంలో మిల్లర్ల సంఘం నేత ఒ కరు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని, ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారి వారికే వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి.
98,355 క్వింటాళ్ల బియ్యం మిల్లర్ల వద్దే
జిల్లా పౌరసరఫరాల శాఖ సూచనల మేరకు 2013- 14 ఖరీఫ్, రబీలలో కలిపి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, 1,87,028 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని సేకరించాయి. ఖరీఫ్‌లో ఈ ధాన్యాన్ని 88 మిల్లులకు కేటాయించారు. వారు 1,27,179 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువులోపే జరగాలి. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పటి వరకు కేవలం 29,746 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. అంటే, ఇంకా 98,355 టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది.
‘లెవీ’ వారికే అనుకూలం
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘లెవీ’ ఉత్తర్వులు కూడా మిల్లర్లకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో స ర్కారుకు చెల్లించాల్సి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని కూడా కొందరు మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని ‘క్యాష్’ చేసుకున్నారన్న ప్రచారం ఉంది. కొందరు మిల్లర్లు మాత్రం నిజాయితీగా తమకు కేటాయించిన ధాన్నాన్ని టార్గెట్ ప్రకారం ప్రభుత్వానికి చేరవేశారు. వారు సొంత డబ్బుతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.
‘కస్టమ్’ వారికెంతో ఇష్టం
Published Tue, Sep 9 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement