రైతు ఉత్పిత్తిదారుల అభివద్ధే నాబార్డు ధ్యేయమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ సాయిగుచ్చారావు తెలిపారు.
లేపాక్షి : రైతు ఉత్పిత్తిదారుల అభివద్ధే నాబార్డు ధ్యేయమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ సాయిగుచ్చారావు తెలిపారు. సోమవారం లేపాక్షి వెలుగు కార్యాలయంలో ఎంపీపీ హనోక్ అధ్యక్షతన మహిళ సంఘం సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు సాయిగుచ్చారావుతోపాటు గోదావరి నాలెడ్జి సొసైటీ డైరెక్టర్లు సుధాకర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసి,అందులో ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, ఉత్పత్తి విలువ పెంచడం, ఉత్పత్తి మార్కెటింగ్‌ను ఎలా చేయాలన్న వివరాలను తెలియజేశారు. సమగ్ర పాడి అభివద్ధి కింద జిల్లా ఆరు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఒక గొర్రెలు, మేకలకు సంబంధించిన గ్రూపును ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం సురేఖ, మండల సమాఖ్య అధ్యక్షులు అరుణ, సభ్యులు నాగమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.