
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోందని, ఇందుకు కారణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజి పేర్కొన్నారు.
విజయవాడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడకి రావడానికి ముందు మచిలీపట్నం వెళ్లాను. ఆప్కాబ్ ఈ ఏడాదిలో మూడు రెట్లు పెంచుకోవడం అభినందనీయం. ఏపీ జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. సహకార రంగాల బలోపేతం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను డీడీటీ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది బ్యాంకింగ్ రంగానికి ఎంతో మేలు చేస్తోంది’ అని అన్నారు.
సీఎం జగన్‌ను కలిసిన నాబార్డ్ ప్రతినిధుల బృందం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజితో పాటు నాబార్డ్ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. సీఎం జగన్‌తో నాబార్డ్ బృందం సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నారు. నాబార్డ్ చైర్మన్ కీవీ షాజిని శాలువా కప్పి సత్కరించిన సీఎం జగన్.. వెంకటేశ్వరుని ప్రతిమను కూడా అందజేశారు.