
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆర్‌బీఐ సహాయం ద్వార దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కాగా నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, ఎస్‌ఐడీబీఐకి 15 వేల కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు కేటాయిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ సహాయం ద్వారం దేశంలో రైతులకు, గ్రామీణా ప్రాంత ప్రజలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా లాక్‌డౌన్ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.