రైతు ఉత్పత్తిదారుల సంఘాల పటిష్టతకు కృషి
Published Sun, Sep 18 2016 12:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు(అగ్రికల్చర్): రైతు ఉత్పత్తిదారుల సంఘాల పటిష్టతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాబార్డు డీడీఎం నాగేష్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా సహకార కేంద్రబ్యాంకు సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఇఓలు, డైరెక్టర్లకు సంఘాలను ఏ విధంగా అభివద్ధి చేసుకోవాలనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నాబార్డు ఆధ్వర్యంలో తొమ్మిది సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఏసీ ఆధ్వర్యంలో మూడు సంఘాలు ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఏసీ రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివద్ధి కోసం మూడు పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈక్విటి గ్రాంట్ కింద రూ.10 లక్షల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పేరుతో మరో పథకాన్ని అమలు చేస్తుందని ఇందులో ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. కోటి వరకు రుణ సదుపాయం ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement