సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక ఉండాలని నాబార్డు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులకు దిశానిర్దేశం చేస్తూ బుధవారం ‘స్టేట్ ఫోకస్ పేపర్–2019–20’ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో విడుదల చేసిన ఈ పత్రంలో మొత్తం 70 శాతం పంట రుణాలకే కేటాయించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ మేరకు కేటాయింపులు పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రంగాలకు రుణ కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి ఈ ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగానే రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) త్వరలో విడుదల చేయనుంది.
పంట రుణాలకు రూ. 49,785 కోట్లు...
క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వేసిన అంచనా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,01,378 కోట్ల రుణం లక్ష్యంగా ముందుకు వెళ్లాలంది. 2018–19 ఫోకస్ పేపర్‌లో రాష్ట్ర రుణ పరిమితి రూ. 83,388 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ. 17,990 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రూ. 70,965 కోట్లు ఇచ్చి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలంది. అందులో రూ. 46,344 కోట్లు పంట రుణాలకు , అంటే 2018–19 లక్ష్య పత్రంతో పోలిస్తే అదనంగా రూ. 3,441 కోట్లు కేటాయించాలంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 2,833 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ. 1401 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ. 5,834 కోట్లు, విద్యా రుణాలకు రూ. 2,009 కోట్లు కేటాయించింది.
2019–20 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ప్రకారం రుణ ప్రణాళిక అంచనా
అంశం కేటాయింపు (రూ. కోట్లల్లో)
1) పంట రుణాలు 49,785.59
2) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 21,179.58
3) సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు 21,065.98
4) విద్య రుణాలు 2,009.41
5) గృహ రుణాలు 5,834.94
6) రెన్యువబుల్ ఎనర్జీ 317.38
7) సామాజిక మౌలిక సదుపాయాలు 1008.92
8) ఇతరాలు 176.80
మొత్తం 1,01,378.60
రాష్ట్ర రుణ ప్రణాళిక...లక్ష్యం రూ.లక్షకోట్లు
Published Thu, Jan 31 2019 1:31 AM | Last Updated on Thu, Jan 31 2019 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment