విద్యారుణాలకు ప్రాధాన్యం
విద్యారుణాలకు ప్రాధాన్యం
Published Thu, Aug 11 2016 9:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM
ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్
బాలాజీచెరువు (కాకినాడ) :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విద్యారుణాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్‌ప్రసాద్ పేర్కొన్నా రు. జేఎన్‌టీయూకే స్టూడెం ట్ ఎమినిటీస్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిదయాళ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌తో పాటు మెడిసిన్ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు సులభంగా విద్యారుణాలు అందజేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి వ్యాపార రుణాలతో పాటు వాహన, గృహ రుణాలు మరింత సులభతరం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ అశ్విన్ మెహతా, జనరల్ మేనేజర్ రవీంద్రపాండే, విజయవాడ సీఎం రాజీవ్‌కోహ్లి, ఆర్‌ఎం సాయిబాబా, జేఎన్‌టీయూకే బ్రాంచ్ మేనేజర్ కె.పి.శోభారాణి, కుప్పం శ్రీనివాస్, ముత్తా లక్ష్మణరావు పాల్గొన్నారు.
Advertisement