రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం!
నాబార్డు నుంచి నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు 3లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటు లోకి తేవాలని, జూన్ నాటికల్లా ఈ కార్యక్ర మాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాబార్డు నుంచి రూ.874 కోట్లు మంజూరు కాగా, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
2015–16 బడ్జెట్‌లోనూ 1.03లక్షల ఎకరాలకు రూ.308కోట్లు కేటా యించగా.. 2.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ 1.03 లక్షలమంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. 2016–17లో 3.37లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం రూ.290 కోట్లు కేటాయించింది. అయితే లక్ష్యం చేరు కునేందుకు ఈ సొమ్ము సరిపోదు. దీంతో నాబార్డు నుంచి రూ.874 కోట్లు అప్పు తీసు కుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖా స్తుల న్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం పరికరాలు మంజూరు చేస్తారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితం!
సూక్ష్మ సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా (100 శాతం సబ్సిడీ తో) అందజేస్తోంది. బీసీలకు, ఇతర సన్న చిన్నకారు రైతులకు ప్రస్తుతం 90శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న చిన్నకారు రైతులకు కేటాయిస్తారు. వర్షాభావ ప్రాంతా ల్లో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసేందుకు.. నీరు వృథా కాకుండా ఉండేం దుకు సూక్ష్మ సేద్యం ఉపకరిస్తుంది.