Micro-irrigation
-
సూక్ష్మ సేద్యం.. విస్తరణే లక్ష్యం
సాక్షి, అమరావతి: సూక్ష్మసేద్యాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2022–23లో లక్ష్యానికి మించి తుంపర, బిందు సేద్య పరికరాలు అందించగా.. 2023–24లో రూ.902 కోట్లను వెచ్చించి కనీసం 2.5 లక్షల ఎకరాల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరికరాల పంపిణీ ప్రారంభించింది. లక్ష్యానికి మించి పంపిణీ సూక్ష్మ సేద్యంలో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా.. టాప్–20 జిల్లాల్లో ఐదు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇటీవలే నూరు శాతం బోర్ల కింద బిందు, తుంపర పరికరాలు అమర్చిన గ్రామంగా వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామానికి జాతీయ పురస్కారం దక్కించుకుంది. రాష్ట్రంలో 12.62 లక్షల మంది రైతులు 35.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేస్తుండగా, ఏటా 2.50 లక్షల ఎకరాల చొప్పున మరో 18.65 లక్షల ఎకరాల్లో విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.936 కోట్ల బకాయిలు చెల్లించడంతో రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరణ వేగం పుంజుకుంది రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాల్లో 5–12.5ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. 2022–23లో 1.87 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యం కాగా.. రికార్డు స్థాయిలో 82,289 మంది రైతులకు చెందిన 2.26 లక్షల ఎకరాల్లో విస్తరించారు. వీటికోసం రైతులు తమ వాటాగా రూ.174 కోట్లు చెల్లించగా, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.465 కోట్లు భరించింది. 2023–24లో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరణ 2023–24లో రూ.902 కోట్ల అంచనా వ్యయంతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. అంచనా మొత్తంలో రైతుల వాటా రూ.145 కోట్లు కాగా, సబ్సిడీ రూపంలో రూ.757 కోట్లు ప్రభుత్వం భరించనుంది. ఏప్రిల్ నుంచి ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు 5.07లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాల అమరిక కోసం 1.72 లక్షల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అవసరం ఉన్న వారికి అర్హత ఉంటే చాలు ఎలాంటి సిఫార్సులు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల ఎంపిక చేపట్టారు. ప్రాథమిక పరిశీలనలో ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో సర్వే చేయగా.. 1.45 లక్షల ఎకరాల్లో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. పండగ వాతావరణంలో పరికరాల పంపిణీ 45,255 ఎకరాల్లో ఏర్పాటు కోసం 16,630 మంది రైతులు తమ వాటా సొమ్మును చెల్లించారు. 10,556 మంది రైతులకు చెందిన 29,070 ఎకరాల్లో అమర్చేందుకు అవసరమైన బిందు, తుంపర పరికరాల పంపిణీకి శనివారం శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిందు, తుంపర పరికరాల వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పరికరాల పంపిణీ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. -
3 పంటలకు నూరు శాతం సూక్ష్మసేద్యం
- పామాయిల్, పసుపు, చెరకు భూములన్నింటికీ ఇవ్వాలని ఉద్యానశాఖ నిర్ణయం - ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో పథకం అమలు - అక్రమాలు జరగకుండా దేశంలోనే మొదటిసారిగా జియోఫెన్సింగ్ సాక్షి, హైదరాబాద్: పామాయిల్, పసుపు, చెరకు సాగు చేసే భూములన్నింటినీ సూక్ష్మసేద్యం పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున సూక్ష్మసేద్యం పథకాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ముతో ఈ ఏడాది 2 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యాన్ని అందుబాటులోకి తేవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిప్రకారం అన్ని పంటలకు పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యం అందజేయడం అసాధ్యమైనందున తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్న పంటలపై దృష్టి పెట్టి వాటికి పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అలా ఏటా కొన్ని పంటలను లక్ష్యంగా పెట్టుకొని సూక్ష్మసేద్యాన్ని పూర్తిస్థాయిలో విస్తరించడం ద్వారా అన్ని పంట భూములనూ కవర్ చేయాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. అయితే మిగిలిన పంటలు సాగు చేసే రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు ఇవ్వకూడదన్న నిబంధన ఏమీ పెట్టుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పసుపు సాగు చేసే రైతులు అనేకమంది సూక్ష్మసేద్యం కలిగివున్నారు. చెరకు, పామాయిల్ భూములకూ అధికంగా ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రచించారు. జియోఫెన్సింగ్ ద్వారా వివరాలు నిక్షిప్తం... సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తారు. బీసీలు, ఇతర పేదలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. దేశంలో ఇంత సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. ఈసారి ఉద్యానశాఖ సూక్ష్మసేద్యంపైనే దృష్టిసారించనుంది. ఇప్పటి కే సూక్ష్మసేద్యం కోసం 38 వేల మంది రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డు, పాస్‌బుక్ వివరాలతోపాటు బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎట్టి పరిస్థితు ల్లోనూ పథకం దుర్వినియోగం కాదని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసేందుకు 25 కంపెనీలకు అవకాశం కల్పించారు. వాటిల్లో రైతులు వారికి ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. సూక్ష్మసేద్యం పొందిన రైతు పొలంలో ఆయా పరికరాలను బిగించాక సమయం, తేదీ తెలిపేలా డిజిటల్ ఫొటోలు తీయడంతోపాటు దేశంలోనే తొలిసారిగా భూమిని జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనివల్ల గూగుల్ మ్యాప్‌లో సూక్ష్మసేద్యం పొందిన రైతు భూమి, సర్వే నంబర్ సహా పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అలాగే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇందుకోసం ఉద్యానశాఖ వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేసింది. మన రాష్ట్రంలోనే ఈ తరహా విధానం... దేశంలో ఎక్కడా ఇటువంటి పద్ధతిలో సూక్ష్మ సేద్యాన్ని అమర్చలేదని ఉద్యానశాఖ కమిష నర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు కంపెనీలు ఇచ్చే సూక్ష్మసేద్యం పైపులను గతంలో కొందరు అమ్ముకునే వారు. అయితే ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పైపులను నిర్ణీత కొలమానం ప్రకారం కోసి వాటిని బిగిస్తామన్నారు. అలాగే నాస్కామ్ ద్వారా పూర్తిస్థాయిలో తనిఖీలూ ఉంటాయన్నారు. తాము చేపట్టిన ఈ పారదర్శక పద్ధతిని గుర్తించిన కేంద్రం సూక్ష్మసేద్యం అమలు కోసం రూ.300 కోట్లు ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయిం చిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం!
నాబార్డు నుంచి నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు 3లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటు లోకి తేవాలని, జూన్ నాటికల్లా ఈ కార్యక్ర మాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాబార్డు నుంచి రూ.874 కోట్లు మంజూరు కాగా, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 2015–16 బడ్జెట్లోనూ 1.03లక్షల ఎకరాలకు రూ.308కోట్లు కేటా యించగా.. 2.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ 1.03 లక్షలమంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. 2016–17లో 3.37లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం రూ.290 కోట్లు కేటాయించింది. అయితే లక్ష్యం చేరు కునేందుకు ఈ సొమ్ము సరిపోదు. దీంతో నాబార్డు నుంచి రూ.874 కోట్లు అప్పు తీసు కుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖా స్తుల న్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం పరికరాలు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం! సూక్ష్మ సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా (100 శాతం సబ్సిడీ తో) అందజేస్తోంది. బీసీలకు, ఇతర సన్న చిన్నకారు రైతులకు ప్రస్తుతం 90శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న చిన్నకారు రైతులకు కేటాయిస్తారు. వర్షాభావ ప్రాంతా ల్లో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసేందుకు.. నీరు వృథా కాకుండా ఉండేం దుకు సూక్ష్మ సేద్యం ఉపకరిస్తుంది. -
3.62 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం
• కేంద్రం నుంచి రూ. 250 కోట్లు వచ్చే అవకాశం • మరోవైపు నాబార్డు నిధులు రూ. 874 కోట్లు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్లలో 3.62 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్యం కిందికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదిగాకుండా ఇప్పటికే నాబార్డు నుంచి ఉద్యానశాఖకు సూక్ష్మసేద్యం కోసం రూ. 874 కోట్లు మంజూరైన సంగతి విదితమే. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ. 150 కోట్లు ఉంటుంది. వీటితో 2016–17, 2017–18 సంవత్సరాల్లో పెద్దఎత్తున సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వచ్చే బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిం చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రం నుంచి, నాబార్డు నుంచి నిధులు వస్తున్నందున కేటాయించే అవకా శాలు లేవని అంటున్నారు. వాస్తవంగా సూక్ష్మసేద్యానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కానీ ఆ మేరకు నిధులు లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. 2015–16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ. 308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో 2.63 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం కావాలని 1.03 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.60 లక్షల ఎకరాలకు చెందిన రైతుల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మసేద్యం అందించాలంటే బడ్జెట్ కేటాయింపులకు తోడు అదనంగా రూ. 337.30 కోట్లు కేటాయించాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016–17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం కోసం రూ. 290 కోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. ఇది ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం మంజూరు చేస్తారు. -
సూక్ష్మ సేద్యానికి రూ.874 కోట్ల రుణం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం నాబార్డు నుంచి రూ.874 కోట్ల రుణం మంజూరైందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్లతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిందు, తుంపర సేద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.126 కోట్లు ఇస్తుందని, లబ్ధిదారుల వాటాగా మరో రూ.92 కోట్లు మొత్తంగా రూ.1,092 కోట్లతో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 3.15 లక్షల ఎకరాలకు పైగా డ్రిప్ , స్పింక్లర్ సేద్యం కిందకు రావడం ఓ రికార్డని చెప్పారు. పాలి హౌస్ కింద సబ్సిడీ రుణాలు భారీగా పెంచామని, ఇటీవలే హరియాణా బృందం రాష్ట్రంలో పర్యటించి ఈ పథకాన్ని అభినందించిందని అన్నారు. వెయ్యి మందికి పాలి హౌస్ కింద రుణాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని, ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ వల్లే సాధ్యమైందన్నారు. -
ఎస్సీ, ఎస్టీల ఉచిత సూక్ష్మసేద్యం ఎత్తివేత
• తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం • 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం • బీసీలకు 90 శాతం సబ్సిడీ 80 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మ సేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి 90 శాతం సబ్సిడీతో అందజేయాలని నిర్ణరుుస్తూ ఉద్యానశాఖ సంచ లన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వా హక సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సూక్ష్మసేద్యం కోసం ఇస్తున్న రారుుతీని తగ్గిస్తూ సమావేశం సిఫార్సు చేసిం ది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, దాన్ని 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచినట్లు తెలి సింది. ఈ పథకం కోసం కేటారుుస్తున్న నిధు ల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న, చిన్నకారు రైతులకు కేటారుుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది ఈ వర్గాల రైతులే ఎక్కువగా ఉంటారు. నిధులు విడుదల చేయకపోవడం వల్లే... సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సంబంధిత పరికరాలు అందించాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకుంది. ఇతర రైతులకు కూడా కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కంటే ఎక్కువగా ఇస్తూ ఇప్పటివరకు అమలు చేసింది. కానీ ఆచరణలో ఆ మేరకు నిధులను విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2014-15లో 1.34 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయా లనేది ఉద్యానశాఖ లక్ష్యం. అందుకు ప్రభుత్వం రూ.350.08 కోట్లు బడ్జెట్లో కేటారుుంచి, 70,480 ఎకరాలకు రూ.191 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ.308 కోట్లు కేటారుుంచింది. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.6 లక్షల ఎకరాల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మ సేద్యం అందించాలంటే బడ్జెట్ కేటారుుంపు లకు తోడు అదనంగా రూ.337.3 కోట్లు కేటారుుం చాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రూ.290 కోట్లు కేటారుుంచింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరి పోదు. దీంతో నాబార్డు నుంచి రూ. వెరుు్య కోట్లు రుణానికి వెళ్లాలని నిర్ణరుుంచింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా భారీ సబ్సిడీ ఇస్తే తాము ఒప్పుకోబోమని నాబార్డు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాబార్డును ఒప్పించేందుకు ముంబై వెళ్లేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సిద్ధమయ్యారు. చివరకు నాబార్డు సబ్సిడీ నిర్ణయాన్ని ఇప్పుడు అమలులోకి తీసు కొచ్చినట్లు చెబుతున్నారు. -
ఏకమొత్తంగా రుణమాఫీకి నిధులు!
♦ వచ్చే బడ్జెట్లో కేటాయించేందుకు పరిశీలన: మంత్రి పోచారం ♦ సూక్ష్మ సేద్యానికి రూ. 2,500 కోట్ల నాబార్డు నిధులు ♦ ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో మెగా డెయిరీ ♦ పాల ప్రోత్సాహకానికి రూ. 100 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఏకమొత్తంగా రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు చెల్లించేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు రోజులుగా వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు, వాటి అనుబంధ రంగాల బడ్జెట్ రూపకల్పనపై మంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే రుణమాఫీని ఒకేసారి చెల్లించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. బడ్జెట్‌ను వాస్తవానికి తగ్గట్లు రూపకల్పన చేస్తామన్నారు. అనవసర పథకాలు, పద్దులను తొలగించి అవసరమైన వాటికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి 871 పద్దులున్నాయని... వాటిల్లో 50% పైగా నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించామన్నారు. ప్రణాళిక బడ్జెట్‌ను పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వ్యవసాయ ప్రణాళిక బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. 2016-17లో ఉద్యాన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వారంలోగా కార్పొరేషన్ విధివిధానాలు ఖరారు చేసి సీఎం వద్దకు ఫైలు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలో ఎన్ని కూరగాయలు, సుగంధద్రవ్యాలు అవసరమో నిర్ణయించి ఆ ప్రకారం పండిస్తామన్నారు. సూక్ష్మసేద్యం, పాలీహౌస్‌ల కోసం నాబార్డు నుంచి రూ.2,500 కోట్లు తీసుకుంటామన్నారు. పోలండ్, డెన్మార్క్‌ల్లో పర్యటన ప్రస్తుతం 6.65 లక్షల హెక్టార్లలో కూరగాయలు పండిస్తున్నామని... భవిష్యత్తులో మరో 4.40 లక్షల హెక్టార్లలో పండిస్తామని పోచారం తెలిపారు. ఉద్యాన కార్పొరేషన్ ద్వారా 200 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పోలండ్, డెన్మార్క్ దేశాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయని... ఉత్పత్తి అయిన ప్రతీ పంటను ప్రాసెస్ చేయడం ద్వారా రైతుకు అదనపు లాభం చేకూర్చుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ దేశాల్లో పర్యటించి అక్కడి నుంచి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేస్తామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహక పథకాన్ని రద్దు చేయబోమన్నారు. 25 లీటర్ల సీలింగ్ పెట్టామన్నారు. అయితే మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ తదితర డెయిరీలు కూడా ప్రోత్సాహకాన్ని కోరుతున్నాయని... దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్లో రూ.100 కోట్లకు పైగా పాల ప్రోత్సాహకానికి కేటాయిస్తామన్నారు. ప్రైవేటు డెయిరీల్లో కొన్నింటిలో యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారన్న ప్రచారం నేపథ్యంలో విజయ డెయిరీని బలోపేతం చేసి పాల సేకరణను పెంచుతామన్నారు. అందుకోసం ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న మెగా డెయిరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి రూ.400 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే జిల్లాల్లోనూ విజయ డెయిరీ యూనిట్లను బలోపేతం చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యానశాఖలో 600 పోస్టుల నియామకం చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ చేపడతామన్నారు. -
సూక్ష్మ సేద్యం
- బిందు, తుంపర్ల సాగుపై చిన్నచూపు - విస్తీర్ణం తగ్గించిన సర్కార్ - గత ఏడాది టార్గెట్‌లో 1,500 హెక్టార్ల కోత - పరికరాలకు 1200 మంది ఎదురుచూపు హన్మకొండ: తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగుచేసే సూక్ష్మ సేద్యంపై రాష్ర్ట సర్కార్ చిన్నచూపు చూస్తోంది. పోరుున ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని తగ్గించింది. ఈ ఏడాది లక్ష్యాన్ని మరింత కుదించింది. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు అధికంగా పండించడంతోపాటు ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో సూక్ష్మ సాగు సేద్యానికి డిమాండ్ బాగా ఉంది. ఈ క్రమంలో సూక్ష్మసాగు సేద్య విస్తీర్ణం తగ్గించడంతో రైతులకు మింగుడు పడడడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,230 హెక్టార్లలో బిందు సేద్యం, 1,023 హెక్టార్లలో తుంపర్ల సేద్యం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఇందులో 1,500 హెక్టార్లకు మాత్రమే నిధులు మంజూరు చేసింది. దీంతో 2,730 హెక్టార్ల బిందు సేద్య విస్తీర్ణం తగ్గింది. ఈ విస్తీర్ణాన్ని 2015-16లో అమలు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,653 హెక్టార్లలో బిందు సేద్యం, 684 హెక్టార్లలో తుంపర్ల సేద్యం చేపట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. గత ఏడాది మిగిలిపోయిన 2730 హెక్టార్లను ఈ ఆర్థిక సంవత్సరానికి పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలేది 923 హెక్టార్లు మాత్రమే. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 1,200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అరుుతే ఒక్కో రైతుకు రెండున్నర హెక్టార్ల చొప్పున డ్రిప్ కావాలని కోరితే 3 వేల హెక్టార్లవుతుంది. కానీ, ఇక్కడ అందుబాటులో ఉంది 923 హెక్టార్లు మాత్రమే. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం కేటాయిస్తారు. ఈ మేరకు కొత్తగా దరఖాస్తు చే సుకునే రైతులకు ఈ ఏడాది సూక్ష్మసేద్యం అందడం కష్టమే. జిల్లాకు మంజూరైన డ్రిప్ సేద్యంలో 80 శాతం పత్తి, మిర్చి, కూరగాయల పంటలకు అందిస్తారు. 20 శాతం మాత్రం పండ్ల తోటలకు ఇస్తారు. కొత్తగా తోటలు పెట్టుకునే రైతులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దీంతో పాటు పందిరి కూరగాయలు పండించే వారికి బిందు సేద్యం సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. సీనియారిటీ ప్రకారం రైతులకు మంజూరు : ఉద్యానశాఖ డీడీ సునీత రైతులు దరఖాస్తు చేసుకున్నప్పుడు రికార్డులో నమోదు చేస్తున్నాం. ఈ రికార్డులో నమోదైన ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా మంజూరు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీపై అందిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నాం. పెద్ద రైతులకు 80 శాతం రాయితీపై అందిస్తున్నాం. ఈ సారి అదనపు బడ్జెట్ వచ్చే అవకాశముంది. ప్రభుత్వం నాబార్డు సహాయం కోరింది. నాబార్డు సూక్ష్మ సాగుకు ముందుకొస్తే జిల్లాకు మరిన్ని నిధులు వస్తాయి. -
సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మోర్తాడ్ : వ్యవసాయానికి అండదండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి రూ. 450 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు సూక్ష్మ సేద్యానికి రూ. 150 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం పది జిల్లాలకు భారీగా నిధులను కేటాయించి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించిందన్నారు. శనివారం మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూక్ష్మ సేద్యంతో సాగునీటి కొరతను అధిగమించవచ్చన్నారు. వరి మినహా ఇతర వాణిజ్య, ఆహార పంటలకు సూక్ష్మ సేద్యం మేలైందన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి మన సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను సృష్టించడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.సహకార సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులను నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వసతులను కల్పించడానికి సహకార శాఖ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నప్పుడు తాళ్లరాంపూర్‌లో గిడ్డంగి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చానన్నారు. అప్పటి చైర్మన్ క్యాతం నర్సింలును వేదికపైకి పిలిపించిన మంత్రి పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులు స్థలం కేటాయిస్తే కోల్డ్ స్టోరేజీని నిర్మించి రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..మారుమూల గ్రామంలోని ఒక చిన్న సహకార సంఘం రైస్‌మిల్లును నిర్మించి కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఆసరా పింఛన్ గురించి అర్హులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పట్వారి గంగాధర్‌రావు, డెరైక్టర్ సోమచిన్న గంగారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అమిత, ఎంపీపీ కల్లెడ చిన్నయ్య పాల్గొన్నారు.