ఎస్సీ, ఎస్టీల ఉచిత సూక్ష్మసేద్యం ఎత్తివేత
• తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
• 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం
• బీసీలకు 90 శాతం సబ్సిడీ 80 శాతానికి తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మ సేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి 90 శాతం సబ్సిడీతో అందజేయాలని నిర్ణరుుస్తూ ఉద్యానశాఖ సంచ లన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వా హక సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
సూక్ష్మసేద్యం కోసం ఇస్తున్న రారుుతీని తగ్గిస్తూ సమావేశం సిఫార్సు చేసిం ది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, దాన్ని 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచినట్లు తెలి సింది. ఈ పథకం కోసం కేటారుుస్తున్న నిధు ల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న, చిన్నకారు రైతులకు కేటారుుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది ఈ వర్గాల రైతులే ఎక్కువగా ఉంటారు.
నిధులు విడుదల చేయకపోవడం వల్లే...
సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సంబంధిత పరికరాలు అందించాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకుంది. ఇతర రైతులకు కూడా కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కంటే ఎక్కువగా ఇస్తూ ఇప్పటివరకు అమలు చేసింది. కానీ ఆచరణలో ఆ మేరకు నిధులను విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2014-15లో 1.34 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయా లనేది ఉద్యానశాఖ లక్ష్యం. అందుకు ప్రభుత్వం రూ.350.08 కోట్లు బడ్జెట్‌లో కేటారుుంచి, 70,480 ఎకరాలకు రూ.191 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. 2015-16 బడ్జెట్‌లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ.308 కోట్లు కేటారుుంచింది.
లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.6 లక్షల ఎకరాల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మ సేద్యం అందించాలంటే బడ్జెట్ కేటారుుంపు లకు తోడు అదనంగా రూ.337.3 కోట్లు కేటారుుం చాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రూ.290 కోట్లు కేటారుుంచింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరి పోదు. దీంతో నాబార్డు నుంచి రూ. వెరుు్య కోట్లు రుణానికి వెళ్లాలని నిర్ణరుుంచింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా భారీ సబ్సిడీ ఇస్తే తాము ఒప్పుకోబోమని నాబార్డు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాబార్డును ఒప్పించేందుకు ముంబై వెళ్లేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సిద్ధమయ్యారు. చివరకు నాబార్డు సబ్సిడీ నిర్ణయాన్ని ఇప్పుడు అమలులోకి తీసు కొచ్చినట్లు చెబుతున్నారు.