Subsidies
-
ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్ కాన్ఫ రెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు, రిటైర్డ్ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.ఎంఎస్ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.విద్యావ్యవస్థలో సమూల మార్పులుసీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ రూ.5 వేలేనా?
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.‘ఫేమ్’లో భారీగా సబ్సిడీఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్‌పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది. -
Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించింది. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు అండగా ఉండటానికి గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500, పంట నష్టపరిహారం, రైతులకు ఉచిత విద్యుత్.. ఇలా ఒకటా రెండా దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు.. దేశవిదేశాల నుంచి ఏపీ వ్యవసాయ విధానాలపై ప్రశంసలు.. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా పచ్చకళ్ల కబోధి, ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. పట్టు రైతులు కష్టాలు పడుతున్నారని.. పథకాలకు ప్రభుత్వం పాతరేసిందని.. రైతులకు రాయితీలు నిలిపేసిందని అసత్యాలు, అబద్ధాలతో మంగళవారం జగనన్న మంకు‘పట్టు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవిగో.. ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గత ఐదేళ్లుగా పట్టుసాగు భారీగా విస్తరించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో పట్టు రైతులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు కళ్లజూస్తున్నారు. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇలా అడుగడుగునా చేయూతనిస్తుంటే ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఆరోపణ: గతమెంతో ఘనం.. నేడు దైన్యస్థితిలో పట్టు రైతులు వాస్తవం: 2014–15 నుంచి 2018–19 మధ్య కొత్తగా 39,433 ఎకరాల్లో 15,362 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. 25,632 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. 2019–20 నుంచి 2023–24 మధ్య కొత్తగా 40,362 ఎకరాల్లో 17,852 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. అదనంగా 30,272 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. ఇక గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తయ్యాయి. రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్క్‌రీలర్లు ఉత్పత్తి చేశారు. ఆరోపణ: రాయితీలకు కోత.. నిధుల విడుదలకు సతాయింపు వాస్తవం: ఈ ఐదేళ్లలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.19.41 కోట్ల బైవోల్టిన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.4.50 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. ఇక పట్టు రీలర్లకు 4 ఏళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్స్ ఇ చ్చింది. ఈ ఏడాది మరో రూ.2.75 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది పట్టు రైతులకు రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా పట్టు రైతులకు ఇన్సెంటివ్‌లు, రీలర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూంటే.. ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆరోపణ: 33 శాతం పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం వాస్తవం: కిలో పట్టు గూళ్లకు 2018–19లో మార్కెట్ ధర రూ.350లకు మించి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సరాసరి ధర రూ.480 నుంచి రూ.550 మధ్య పలుకుతోంది. అంటే 2018–19తో పోలిస్తే సరాసరి ఆదాయం కిలోకు అదనంగా రూ.200కు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఐదేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టు గూళ్లకు కిలోకి రూ.881కు పైగా లభించింది. పైగా రైతుల పట్టుగూళ్ల ఉత్పాదకత కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రతి వంద గుడ్లకు గతంలో 60 కిలోలొస్తే, ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తోన్న పట్టు సాగు బడుల ఫలితంగా ప్రస్తుతం 70–75 కిలోలు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారే తప్ప ఈనాడు ఆరోపించినట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడిన దాఖలాలు లేవు. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం శీతకన్ను వాస్తవం: చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్స్, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా పట్టు రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటికే 5,242 మంది రైతులు 7,720 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.3,462 కోట్ల విలువైన 66,593 టన్నుల నాణ్యమైన కకూన్స్, 13,246 టన్నుల బైవోల్టెన్ కకూన్స్‌ను ఉత్పత్తి చేశారు. రూ.3,560 కోట్ల విలువైన 9,150 టన్నుల రా సిల్క్ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పట్టు పరిశ్రమ కోసం రూ.99.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరపగా ఇప్పటికే రూ.28.80 కోట్లు విడుదల చేసింది. 2021–22లో పట్టు పరిశ్రమ స్థూలాదాయం రూ.11,638 కోట్లు ఉండగా 2022–23లో రూ.12,098 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరోపణ: యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత వాస్తవం: క్రిమిసంహారక మందుల కొనుగోలుకు 9,525 మంది రైతులకు రూ.2.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాల కోసం పట్టు పరిశ్రమ ద్వారా 1,524 మంది రైతులకు రూ.8.25 కోట్లు ఇచ్చింది. పట్టు రైతులు నిర్మించుకున్న షెడ్లతో పాటు మల్బరీ తోటల సాగు, రీలింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 111.61 కోట్లు విడుదల చేసింది. పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా యంత్ర పరికరాలకు మంగళం పాడేశారంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. -
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె.సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ నివేదికలు, ఎనర్జీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్లు ‘విద్యుత్ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్ సభ్యుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు. -
‘పామ్’ తోటల ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. గత పదిహేనేళ్లుగా పామ్ తోటలు సాగుచేసే రైతులు నెమ్మదిగా పెరుగుతున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పామాయిల్‌కు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఈ పంట సాగును ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మంలో 17,834 ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేయగా.. ప్రస్తుతం అది 73,938 ఎకరాలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు ఉండటంతో ఒక వైపు పంట సాగు విస్తరిస్తుండగా, పామాయిల్‌ను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు వరకు ఫ్యాక్టరీలు రానున్నాయి. సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వాల దృష్టి.. గ్లోబల్ ఈడిబుల్ ఆయిల్ మార్కెట్లో వ్యాపారం సాగే తొమ్మిది ప్రధాన నూనెల్లో పామాయిల్ ఒకటి. కాగా, ప్రపంచ మార్కెట్లో ఇండోనేసియా, మలేసియా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల నుంచి 90 శాతం వరకు వాటా ఉంది. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ పామాయిల్‌కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. 2020 వరకు తెలంగాణలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచిసోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉండగా, ప్రస్తుతం వీటితోపాటు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఫ్యాక్టరీ జోన్లలో నర్సరీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు ప్రాధాన్యం.. పామాయిల్ దీర్ఘకాల పంట కావడంతో దేశీయంగా నూనె లభ్యతను పెంపొందించే ప్రక్రియలో ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాయి. 2000 సంవత్సరంలో ఈ పంట 17,834 ఎకరాల్లో సాగవగా, 2020 నాటికి 42,899 ఎకరాలకు, ప్రస్తుతం 73,938 ఎకరాలకు చేరుకుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో టన్ను గెలల ధర రూ.సగటున రూ.5,136 ఉండగా 2022 నాటికి రూ.18,069కి చేరింది మొదట్లో రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి.. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తొలుత 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, పలు దఫాలుగా సామర్థ్యం పెరుగుతూ, ప్రస్తుతం 60 టన్నులకు చేరింది. ఇక్కడ పామాయిల్ గెలలను 120 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు స్టీమ్ చేస్తారు. ఆ తర్వాత యంత్రాలతో గెలల నుంచి ముడి నూనెను తీసి, నేరుగా పైపులైన్ల ద్వారా పెద్ద ట్యాంకుల్లోకి పంపి నిల్వ ఉంచుతారు. ఇలా నిల్వ చేసిన క్రూడాయిల్‌ను లారీ ట్యాంకర్లలో ప్రాసెస్ యూనిట్లకు తరలిస్తారు. స్టీమ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను, నూనె గింజలను (నెట్) వేరు చేస్తారు. గెలల వ్యర్థాలను టన్నుల లెక్కన ఇతర అనుబంధ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. అశ్వరావుపేట తర్వాత దమ్మపేట మండలం అప్పారావుపేటలో 2017 ఏప్రిల్‌లో మరో ఫ్యాక్టరీ ప్రారంభమైంది. రూ.80 కోట్ల వ్యయం, మలేసియా టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. తొలుత ఇది 60 టన్నుల సామర్థ్యంతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 90 టన్నులకు పెరిగింది. ఈ ఫ్యాక్టరీకి 2018లో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగ విభాగంలో ఉత్తమ ఫ్యాక్టరీ అవార్డు దక్కింది. అదే ఏడాది కేంద్రం ద్వారా గ్లోబల్ అవార్డు వచ్చింది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3 ఫ్యాక్టరీలు ఉండగా.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అశ్వాపురం మండలం బి.జె.కొత్తూరు, ములకలపల్లి గ్రామాల్లో నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటల సాగు మరింతగా విస్తరించి దేశీయంగా నెలకొన్న కొరతను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈయనే సాగు మొదలు పెట్టింది.. 1991లో ప్రభుత్వ సబ్సిడీ ఏమీ లేకుండా.. అశ్వారావుపేటకు చెందిన పిన్నమనేని మురళి అనే రైతు ఆయిల్‌పామ్ పంట సాగును ప్రయోగాత్మకంగా మొదట ఐదు ఎకరాల్లో ప్రారంభించారు. మొదట్లో ఆయన మొక్క రూ.25 చొప్పున కొనుగోలు చేశారు. సమీపంలో గెలల కొనుగోలు, ఫ్యాక్టరీ లేనప్పటికీ.. ఆయన ఈ పంట సాగు చేయడంతో మిగిలిన రైతులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మురళి 100 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటం, ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండటంతో ఈ పంట ఆదాయం మెరుగ్గా మారిందని మురళి చెప్పారు. లాభదాయకమైన పంట.. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట సాగు చేసిన నాలుగేళ్లలో ఆదాయం ప్రారంభమవుతుంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పామాయిల్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీలు సైతం రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. –జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం ఎకరం ఆయిల్‌పామ్‌సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ.. మొక్కలకు(ఎకరానికి 57 మొక్కలు): రూ.11,600 ఎరువులు, అంతర పంటలకు ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు: రూ.16,800 బిందు సేద్యం: రూ.22,518 మొత్తం రూ. 50,918 -
Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు
సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది. 2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్ రీలర్ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది. పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏటా రికార్డు స్థాయి ధరలు.. గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ -
ముందుగానే ‘ఉపకార’ దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ముందస్తుగా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తే.. వేగంగా పరిశీలించి అర్హతలు నిర్ధారించవచ్చని, దీంతో నిధు లు సైతం త్వరగా అర్హుల ఖాతాల్లో జమ చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల నుంచే ప్రారంభించేందుకు సాంకేతిక అనుమతులను కోరింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసు కుని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. నాలుగు నెలలు గడువు.. 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నాలుగు నెలల పాటు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. గతేడాది మొదట మూడు నెలల పాటు అవకాశం కల్పించగా.. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో రెండు నెలలు, చివరగా నెలరోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ సారి విడతల వారీగా దరఖాస్తుల స్వీకరణకు బదులుగా ఒకేసారి నాలుగు నెలల పాటు అవకాశం కల్పించి తర్వాత నిలిపివేయాలని యోచిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే వాటి పరిశీలన, అర్హతల ఖరారు ప్రక్రియను కొనసాగించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ముందుగా ఉపకారవేతనాలను విడుదల చేసే అంశాన్ని సంక్షేమ శాఖలు పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటే వేగంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇతర పంటలకు కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలి
-
విద్యుత్ సబ్సిడీలపై రాష్ట్రాలకు కేంద్రం ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ చట్టసవరణ చేయనున్న కేంద్రం.. సబ్సిడీల విషయంగా రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. విద్యుత్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల ఖాతాల్లోనే వేయడం ఒకటికాగా.. వినియోగదారుల పేరిట విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్వహించే ఖాతాల్లో జమ చేయడం రెండోది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వాటి ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని కేటగిరీల వినియోగదారులకు ఉచితంగా, మరికొన్ని కేటగిరీల్లో రాయితీపై విద్యుత్ సరఫరా అవుతోంది. రాష్ట్రాల వ్యతిరేకతతో.. వాస్తవానికి విద్యుత్ సబ్సిడీల విషయంగా ‘నేరుగా నగదు బదిలీ (డీబీటీ)’ విధానాన్ని అనుసరించాలని కేంద్రం గత ఏడాది రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించింది. వినియోగదారులకు పూర్తి బిల్లులు వేయాలని, వారు ఆ బిల్లు చెల్లించాక.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్మును జమ చేయాలని పేర్కొంది. దీనిపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ విధానం అమలుచేస్తే ఒక్కసారిగా విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతాయని.. పేదలు చెల్లించడం కష్టంగా మారుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదా బిల్లులో మార్పులు చేయనుందని నిపుణులు చెప్తున్నారు. సబ్సిడీలను నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేయడం, లేదా వినియోగదారుల పేరుతో డిస్కంలు నిర్వహించే ఖాతాల్లో జమ చేయడం అనే రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ► డిస్కంల ఆధ్వర్యంలోని ఖాతాల్లో సబ్సిడీలను జమ చేస్తే.. విద్యుత్ బిల్లుల విధానం దాదాపుగా ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగే అవకాశం ఉంటుంది. ఉచిత, రాయితీ విద్యుత్ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ► వినియోగదారులు ముందుగా పూర్తి బిల్లు కట్టాక.. సబ్సిడీ సొమ్ము ఇచ్చే విధానంతో ఇబ్బంది ఎదురు కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి గా.. ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు.. ధోబీ ఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గృహ వినియోగదారులతోపాటు స్పిన్నింగ్ మిల్లులు, పౌల్ట్రీ ఫారాలకు రాయితీపై తక్కువ ధరలతో సరఫరా చేస్తోంది. వీరంతా ప్రస్తుతం సబ్సిడీ పోగా మిగతా బిల్లులు కడుతున్నారు. నగదు బదిలీ విధానం అమలు చేస్తే.. వీరంతా మొత్తం బిల్లులు కట్టాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు బదిలీ అవుతుంది. -
విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాలపై బంపర్ ఆఫర్....!
గాంధీనగర్: ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి పలు ప్రభుత్వాలు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఫేమ్-2 విధానానికి సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సీడిలను అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మెరుగుపర్చడం కోసం వ్యక్తిగత రాయితీలను ప్రకటించింది. జాయ్ ఈ-బైక్‌పై సబ్సిడీ కార్యక్రమానికి గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజేన్సీ (జీఈడీఏ) ఆమోదం తెలిపింది. జాయ్ ఈ-బైక్స్ ఎక్స్ షోరూమ్ ధరలపై సుమారు 12 వేల సబ్సిడీను గుజరాత్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ కేవలం గుజరాత్లో చదువుకునే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు వర్తించనుంది. జాయ్ ఈ-బైక్స్ శ్రేణిలోని జెన్ నెక్ట్స్, వోల్ఫ్, గ్లోబ్, మాన్స్టర్ వేరియంట్లకు ఈ సబ్సిడీ లభించనుంది. జాయ్ ఈ-బైక్ ఫీచర్స్ బ్యాటరీ టైప్- 74 V, 25Ah/30Ah, లిథియం అయాన్ బ్యాటరీ హబ్ మోటార్ ఆర్పీఎమ్- 100 - 375 ఆర్పీఎమ్ టాప్ స్పీడ్- 25 కి.మీ. పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు పట్టే సమయం- 4 నుంచి 4.5 గంటలు ఫుల్ ఛార్జింగ్‌తో సుమారు 75 కిలోమీటర్ల ప్రయాణం -
వ్యాపారాలపై ధీమా తగ్గింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి వ్యాపారాలపై కార్పొరేట్ల ధీమా సన్నగిల్లింది. 2008–09 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్య స్థాయికి పడిపోయింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ ఎకానమీ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి తిరిగొచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యాపారాలకు సహాయక ప్యాకేజీలు ఇవ్వాలని ఫిక్కీ పేర్కొంది. అలాగే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మరో 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) తగ్గించాలని కోరింది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దిశగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో భారత్ సహా పలు దేశాల వృద్ధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాపారవర్గాలపై ఫిక్కీ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వ్యాపార విశ్వాస సూచీ ప్రస్తుతం 42.9 పాయింట్లుగా ఉంది. గత సర్వేలో ఇది 59.0గా నమోదైంది‘ అని ఫిక్కీ పేర్కొంది. గతంలో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు 2008–09 రెండో త్రైమాసికంలో ఈ సూచీ అత్యంత కనిష్టమైన 37.8 స్థాయికి పడిపోయినట్లు వివరించింది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలపై వ్యాపార వర్గాల్లో ధీమా సడలటాన్ని ఇండెక్స్ సూచిస్తోందని తెలిపింది. వివిధ రంగాలకు చెందిన సుమారు 190 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటి టర్నోవరు రూ. 1 కోటి నుంచి రూ. 98,800 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంపై వ్యాపార వర్గాల అంచనాలను దీని ద్వారా సేకరించారు. సబ్సిడీలు.. ట్యాక్స్ హాలిడేలు కావాలి.. డిమాండ్, సరఫరా, నిధుల కొరత రూపంలో దేశ ఎకానమీ ప్రధానంగా మూడు సమస్యలు ఎదుర్కొంటోందని ఫిక్కీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమకు.. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు గట్టెక్కడానికి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. సబ్సిడీలు, విధానపరమైన మద్దతు, ట్యాక్స్ హాలిడేలు, కరోనా పూర్వ స్థాయిల్లో ఉద్యోగాలను కొనసాగించేందుకు ప్రత్యేకంగా నిధులపరమైన తోడ్పాటులాంటివి అందించాలని విజ్ఞప్తి చేసింది. కార్మిక మార్కెట్ సంస్కరణలను తక్షణమే ప్రాధాన్యత అంశంగా పరిశీలించాలని కోరింది. అలాగే, నేరుగా రిజర్వ్ బ్యాంక్ నేరుగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు చేపట్టాలని, రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో అత్యధికంగా 72 శాతం కంపెనీలు.. కరోనావైరస్ వ్యాప్తి తమ వ్యాపారాలను దెబ్బతీసిందని వెల్లడించాయి. -
కరెంటు బిల్లుపై సోలార్ అస్త్రం!
కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్ సోలార్ మంచి ఆప్షనే. విద్యుత్ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్షిప్ మోడల్. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి. రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్ విద్యుదుత్పత్తి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్డ్ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం. మరి ఖర్చెంతవుతుంది? ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్స్టలేషన్ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్ విద్యుత్ తయారీ ఎక్విప్మెంట్కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్ ప్యానెల్స్ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్స్టలేషన్ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్ మార్క్ ధరలను గమనిస్తే.. గ్రిడ్ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్ ఎక్విప్మెంట్కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు. గమనించాల్సిన కీలక అంశాలివే... ► రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్ సమయంలో విద్యుత్ నష్టం, డిశ్చార్జ్ అవడం కూడా విద్యుత్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి. ► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్ కనెక్టెడ్ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది. ► నెట్ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి. ► ఇన్స్టలేషన్ , సర్వీస్ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్స్టాల్ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది. -
భారత్‌లో వ్యవసాయ సబ్సిడీలు తక్కువే
న్యూఢిల్లీ: సంపన్న పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో రైతులకిచ్చే సబ్సిడీలు చాలా తక్కువేనని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ తెలిపారు. సంపన్న దేశాల్లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర రైతాంగానికి సబ్సిడీలు లభిస్తాయని చెప్పారు. భారత్‌లో ఏటా ఒకో రైతుకు సుమారు 250 డాలర్ల సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నా.. వ్యవస్థలో లోపాల కారణంగా ఈ కాస్త సబ్సిడీలు కూడా వివాదాలకు దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీల అమలు తీరుతెన్నుల గురించి ఇతర దేశాల నుంచి మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వాధ్వాన్ చెప్పారు. భారత ప్రభుత్వం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తోందంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లోని సంపన్న దేశాలు .. ఆరోపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవో నిర్దేశిత 10 శాతం పరిమితికి లోబడే సబ్సిడీలు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఎగుమతి సబ్సిడీల వివాదంపై భారత్ మీద అమెరికా.. డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే వాధ్వాన్ తాజా వివరణనిచ్చారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆవులకి సంబంధించి ఇచ్చే సబ్సిడీ నిధులతో.. ఓ ఆవు ఖరీదైన విమానం బిజినెస్ తరగతిలో ప్రపంచం మొత్తం రెండు సార్లు చుట్టేసి రావొచ్చన్న జోక్‌ను ఈ సందర్భంగా ఉదహరించారు. అమెరికా, ఈయూ భారీగా సబ్సిడీలు ఇస్తుంటాయని, కానీ వాటిని తెలివిగా డబ్ల్యూటీవో నిర్దేశిత వివిధ పథకాల కింద సర్దేసి చూపించేస్తుంటాయని వాధ్వాన్ చెప్పారు. -
పౌరసరఫరాలకు రూ.202 కోట్లు కోత
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖకు ఈ యేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది రూ.202 కోట్ల మేర బడ్జెట్లో కోత పెట్టారు. గతేడాది బడ్జెట్లో బియ్యం సబ్సిడీలు కలుపుకొని మొత్తంగా రూ.2,946 కోట్లు కేటాయించగా, ఈ యేడాది రూ.2,744 కోట్లు కేటాయించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సైతం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని గత ప్రభుత్వంలో ఆలోచనలు సాగినా.. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు, నిధులూ కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికిరూ.26,408 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికోసం కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2019–20లో రూ.26,408 కోట్లు చొప్పున కేటాయింపులు జరిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,581 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,827 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఎస్సీఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ.128.21 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్కు అదనంగా రూ. 133.89 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం మిగులు నిధులను క్యారీఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వార్షిక సంవత్సరం ఖర్చులు తేలిన తర్వాత నిధులను క్యారీఫార్వర్డ్ చేసే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
రాజధానిలో చదరపు మీటర్‌కు లీజు రూపాయే!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల జోన్లలో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మెగా కన్వెన్షన్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, వినోద (ఎంటర్టైన్మెంట్) సముదాయాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు శాశ్వత సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు సర్కారు ధనిక వర్గాలకు అవసరమైన లగ్జరీ నిర్మాణాలకు మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాజధానిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం డెవలపర్‌కు లీజు కింద అత్యంత చౌకగా భూమిని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి దశలో 20 ఎకరాలను లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకుగాను చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి చొప్పున లీజును నిర్ణయించింది. అంతేకాదు.. తర్వాత రెండో దశలో మరో 22 ఎకరాలను కట్టబెట్టేందుకు కూడా సమాయత్తమైంది. భారీ రాయితీలు.. మెగా కన్వెన్షన్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను కేవలం సింగిల్ స్టేజ్‌లో పూర్తి చేయడంతోపాటు భారీ రాయితీతో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెవలపర్‌కు 20 ఎకరాలను తొలిదశలో కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకు 20 ఎకరాలను తొలుత 33 ఏళ్లపాటు లీజుకిస్తుంది. ఇందుకోసం ఏడాదికి చదరపు మీటరుకు కేవలం రూపాయి చొప్పున లీజు చెల్లిస్తే చాలు. ఆ తరువాత మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగిస్తారు. ఇందుకోసం డెవలపర్ స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. లీజుపై ఇస్తున్నప్పటికీ ఫ్రీ హోల్డ్ (లీజుదారుకే సర్వహక్కులు) హక్కులను డెవలపర్‌కు కల్పిస్తారు. పీపీపీ విధానంలో డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. రాజధానిలో 20 ఎకరాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్‌తోపాటు ఎగ్జిబిషన్ సెంటర్, 5 స్టార్ హోటల్‌తోపాటు రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. తొలిదశలో కేటాయించే 20 ఎకరాల్లో కట్టే మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.535 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. ఇందులో కనీసం రెండు లక్షల చదరపు అడుగుల్లో వాణిజ్య నిర్మాణాలు వస్తాయని, దీని ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్డీఏకు ఇవ్వాలని నిబంధన విధించారు. డెవలపర్ ఒప్పందం చేసుకున్న 24 నెలల్లోగా తొలి దశ మెగా కన్వెన్షన్ కేంద్రం పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని సీఆర్డీఏ పేర్కొంది. రెండో దశలో మరో 22 ఎకరాలు... రెండో దశలో ఇదే డెవలపర్‌కు మరో 22 ఎకరాలను ఫ్రీ హోల్డ్ (లీజుదారుకే సర్వహక్కులు) విధానంలో ఇస్తారు. ఈ 22 ఎకరాల్లో రిటైల్, వాణిజ్యం, ఎంటర్టైన్మెంట్ రెసిడెన్షియల్‌తోపాటు 3 స్టార్ హోటల్ నిర్మాణాలను డెవలపర్ చేపట్టనున్నారు. ఇందులో తొలిదశలో పది ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో పది శాతం నిర్మాణ ప్రాంతాన్ని, రెండో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 20 శాతం నిర్మాణ ప్రాంతాన్ని, మూడో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 10 శాతం నిర్మాణ ప్రాంతాన్ని సీఆర్డీఏకు తిరిగి ఇచ్చేయాలనే నిబంధన విధించారు. మిగతా నిర్మాణ ప్రాంతం అంతా డెవలపర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈ విధానం వల్ల సీఆర్డీఏకు ఎటువంటి ఆర్థిక భారం పడదని, పైగా తొలిదశలోని 20 ఎకరాల్లో నిర్మాణాల ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్డీఏకు వస్తుందంటూ తాజా నిర్ణయాన్ని సమర్థించుకోవడం గమనార్హం. ఎకరానికి ఏడాదికి లీజు రూ.4046 మాత్రమే! తొలి దశలో కేటాయించే 20 ఎకరాల్ని చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి లీజు చొప్పున కేటాయిస్తారు. ఒక ఎకరానికి 4,046 చదరపు మీటర్లు. ఆ ప్రకారం.. ఎకరానికి ఏడాదికి కేవలం రూ.4,046 లీజు అవుతుంది. సీఆర్డీఏ పెట్టుబడి లేనందున చౌకగా భూమిని కేటాయించనున్నట్లు అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. భూమి ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పిస్తున్నందున డెవలపర్ ఇదే భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వీలుంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. -
భారత్‌కు రాయితీలు నిలిపేయాలి
షికాగో: అన్ని దేశాల కన్నా వేగంగా అమెరికా ఎదగాలంటే భారత్, చైనా వంటి వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు అందుతున్న రాయితీలు నిలిచిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాను ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తానన్నారు. చైనా గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సహకరిస్తోందని ఆరోపించారు. ‘కొన్ని దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం పరిగణిస్తున్నాం. అందుకే వాటికి రాయితీలిస్తున్నాం. ఇది వెర్రితనం. భారత్, చైనా వంటి ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతగానో వృద్ధి చెందుతున్నాయి. కానీ తమను తాము ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ రాయితీలను పొందుతున్నాయి. మేం ఆ రాయితీలను నిలిపేయబోతున్నాం. నిలిపేశాం. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే. నేను ఇదే నమ్ముతా’ అని ట్రంప్ అన్నారు. ‘నేను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు పెద్ద అభిమానిని. కానీ వ్యాపారంలో మనం సరసంగా వ్యవహరించాలి. ఏడాదికి 500 బిలియన్ల అమెరికా డాలర్లను చైనా తీసుకొని తన దేశ పునర్నిర్మాణానికి ఉపయోగించుకోవడాన్ని మేం అనుమతించం’ అని పేర్కొన్నారు. -
రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
-
రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి : ఉండవల్లిలోని ప్రజాదర్భార్ హాల్లో ఈ-ప్రగతి ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి రైతులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీలకు ప్రజలు బానిసలయ్యారన్నారు.ఇన్ పుడ్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీలకి జనం అలవాటు పడిపోయారు అంటూ మరోసారి రైతులను కించపరుస్తూ మాట్లాడారు. గతంలో చాలా సార్లు రైతులు, వ్యవసాయం పై చంద్రబాబు వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రైతులు పంట నష్టపోయేటప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తారు. దాన్ని కూడా తప్పు పట్టే దోరణిలో చంద్రబాబు మాట్లాడారు. తాను వ్యవసాయానికి సంబంధించి రకరకాల సంస్కరణలు చేపట్టానని చెప్పే క్రమంలో ప్రజలందరూ సబ్సిడీలకు అలవాటుపడ్డారని రైతులను తక్కువ చేస్తూ ప్రసంగించారు. ఇన్ పుట్ సబ్సిడీ అనేది విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు రైతులకు అందజేస్తాయి. నష్టాల్లో ఉన్న రైతుకు ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించడాన్ని తప్పుబడుతూ, రైతులు బానిసైపోయారు అంటూ చంద్రబాబు మాట్లాడటంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుకు సంబంధించినంత వరకు పంట చేతికొచ్చి, మంచి గిట్టు బాటు ధర వస్తే ఏ రైతు కూడా ఇన్ పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడరు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతు విపత్కర పరిస్థితుల్లో వేసిన పంట చేతికి రానప్పుడు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీల కోసం ఎదురు చూస్తారు. వ్యవసాయం అనేది ఇన్పుట్, క్రాప్ సబ్సిడీల కోసమే చేస్తున్నారు అని అర్థం వచ్చేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాలను దెబ్బెతీసేలా ఉన్నాయి. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. -
పరిశ్రమ
►రాయితీల కోసం పారిశ్రామికవేత్తల ఎదురు చూపులు ►జిల్లా పరిశ్రమల కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు ►అందని విద్యుత్, పావలా వడ్డీ ►పెండింగ్‌లో రూ.21 కోట్లు ►నేడు కలెక్టర్‌తో డీఐపీసీ సమావేశం ఒంగోలు టూటౌన్: పారిశ్రామికవేత్తల రాయితీ సొమ్ము విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు రాయితీల కోసం నెలల తరబడి జిల్లా పరిశ్రమల కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఔత్సాహికులు పరిశ్రమకు దరఖాస్తు చేసుకోవడం మొదలు అనుమతి పొందే వరకు వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోంది. పారిశ్రామిక విధానంలో భాగంగా న్యాయబద్ధంగా అందాల్సిన విద్యుత్, పావలావడ్డీ, పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, అమ్మకపు పన్ను రాయితీల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దాదాపు వెయ్యి యూనిట్ల నుంచి 1,150 యూనిట్ల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొంతమందికి రాయితీలు మంజూరైనా.. ఎక్కువమందికి పలు రాయితీలు అందాల్సి ఉంది. వీటిలో మూడేళ్ల దరఖాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకా 2015–16 ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న దరఖాస్తులు క్లియర్ కావాల్సి ఉంది. ఇలా జిల్లాకు మంజూరు కావాల్సిన పలు రాయితీల నగదు దాదాపు రూ.21 కోట్ల వరకు మంజూరు కావాల్సిన నిధులున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పరిశ్రమల యజమానులున్నారు. వీరంతా పరిశ్రమ పెట్టడం ఒక ఎత్తైతే .. రాయితీ నిధుల కోసం తిరగడం మరొక ఎత్తు అవుతోంది. పది నెలలుగా జరగని డీఐపీసీ మీటింగ్: జిల్లాలో డీఐపీసీసీ (జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి) మీటింగ్ జరిగి దాదాపు పది నెలలు అవుతోంది. గత కలెక్టర్ పి.సుజాత శర్మ బదిలీకి ముందు కూడా జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలిపై సమీక్ష సమావేశం జరగలేదు. వాస్తవంగా ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా అధ్యక్షతన ఈ డీఐపీసీ మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సారి చాలా జాప్యం జరగడంతో రాయితీల కోసం చేసుకున్న దరఖాస్తులు పేరుకుపోయాయి. పారిశ్రామిక విధానం మేరకు యూనిట్ ఏర్పాటు చేసి.. నిబంధనల మేరకు రాయితీలు పొందాలన్నా జిల్లా పరిశ్రమలశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా జిల్లా స్థాయిలో పరిశ్రమల దరఖాస్తులపై కలెక్టర్ అధ్యక్షతన పరిశీలన జరగాల్సి ఉంది. ఇక్కడ డీపీఐసీ మీటింగ్‌లో ఆమోదం పొందితేనే రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది. ఈ విధానం సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు వచ్చినా దరఖాస్తులను రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపడంలోనూ జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. గతంలో రాయితీల కోసం పంపిన దరఖాస్తులు ఎన్ని తిరిగి వచ్చాయో వాటిపైకూడా పునఃసమీక్షించి..కలెక్టర్ ఆమోదంతో మళ్లీ రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది. నేడు జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమీక్ష: జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా.. రాయితీ దరఖాస్తులు పరిశీలన చేయనున్నారు. దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై రెండు రోజుల క్రితం జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దరఖాస్తులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశీలించారు. వాటిపైనే శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే కమిటీలో మళ్లీ సమీక్షిస్తారు. అనంతరం వాటికి ఆమోదం లభిస్తే రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది. అక్కడ అధికారులు పరిశీలించి మన జిల్లాకు రావాల్సిన రూ.21 కోట్ల రాయితీ నిధులు మంజూరు చేస్తారు. దీనికోసం ఎంతో మంది రాయితీలు రావాల్సిన పరిశ్రమల యజమానులు ఎదురు చూస్తున్నారు. -
రాయితీలొస్తాయని ఎక్కడుంది?
హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్న ఉంటే నాకు చూపించండి.. పోరాడుతా? మీకంటే నాకు ఆత్మగౌరవం ఎక్కువుంది హోదాకు, రాయితీలకు సంబంధం లేదు డబ్బులిచ్చి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు ఆందోళనలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది సాక్షి, అమరావతి: ‘ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీఓలో ఉందో చూపించండి.. నేను పోరాడుతా. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యా నించారు. హోదాపై తప్పుడు ప్రచారం చేసి అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శిం చారు. ఆయన బుధవారం వెలగపూడి సచివాల యంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జల్లికట్టుకి, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మనవాళ్లు కోడి పందేలు ఆడేశారని, దానికి అనుమతి కూడా లేదని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు ఆర్డినెన్స్ జారీ చేయగా, కేంద్రం దానికి కన్సెంట్ ఇచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో కలపాలని, లేకపోతే ప్రమాణస్వీకారం కూడా చేయనని ప్రధానికి చెప్పానని, అందుకే మొదట ఆర్డినెన్స్ తెచ్చారని చెప్పుకొచ్చారు. విలేకరులు హద్దుల్లో ఉండాలి ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో తనను ఎడ్యుకేట్ చేయాలని చంద్రబాబు అన్నారు. ఏమన్నా అంటే ఆత్మ గౌరవం అంటున్నారని, ఆత్మగౌరవం అందరి కంటే తనకే ఎక్కువ ఉందని చెప్పారు. ఈ సమయంలో విలేకరులు గట్టిగా ప్రశ్నించడంతో అసహనం వ్యక్తం చేస్తూ లిమిట్స్(హద్దు)లో ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఆందోళనకు మద్దతు ప్రకటించడంపై స్పంది స్తూ... ఒక్కో వ్యక్తికి ఒక్కో ఆలోచన ఉంటుందని, రాజకీయ వ్యూహాలుంటాయని చెప్పారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం డబ్బు లిచ్చి యువకులను రెచ్చగొడుతున్నారని ఆరో పించారు. విశాఖలో జరిగే ఆందోళనలపై స్పందిస్తూ.. చట్టాన్ని అందరూ అనుసరించా లని, అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయకూడదన్నారు. తునిలో ఇలాగే చేశారని ఆయనను (ముద్రగడ పద్మనాభం) మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు కలుస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ తాను చూస్తూ ఊరుకో నని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టం దాని పని అది చేస్తుందన్నారు. కావాలంటే అనుమతి తీసుకుని సమావేశాలు పెట్టుకోవాలన్నారు. వీళ్లకు ప్రొసీజర్ తెలుసా? ఇంట్లో కూర్చొని ఇష్టాను సారంగా చేసి దొరికిపోయారని ప్రతిపక్ష నేతపై పరోక్ష విమర్శలు చేశారు. తాను నిబద్ధతతో పనిచేస్తున్నానన్నారు. తాను కష్డపడితే ఐదు కోట్ల మందికి వెసులుబాటు ఉంటుందన్నారు. తాను అందరిలో నమ్మకాన్ని సృష్టించానని, దాన్ని చెరగొట్టడానికి ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. తనపై నమ్మకం ఉంచాల ని కోరారు. -
మోదీ.. ఊరట ఏదీ!
-
మోదీ.. ఊరట ఏదీ!
► నోట్ల సమస్యపై మాటల మంత్రం.. ► ఓట్ల కోసం రాయితీల తంత్రం ► పెద్దగా వరాలు ప్రకటించని ప్రధాని ► ఎన్నికల రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి ► రైతులు, గృహ నిర్మాణానికి ‘వడ్డీ’ రాయితీ ► గర్భిణుల అకౌంట్లో రూ. 6 వేలు.. ► రైతులకు నాబార్డు సాయం పెంపు ► అక్రమార్కులకు తిప్పలు తప్పవు ► కష్టాలు ఎదుర్కొని సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు ► జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో భారీగా లాభం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయులను ప్రధాని మోదీ తుస్సుమనిపించారు. నోట్లరద్దు తర్వాత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం ప్రకటించిన 50 రోజుల గడువు పూర్తవడంతో దేశాన్ని ఉద్దేశించి శనివారం ప్రసంగించిన ప్రధాని మోదీ.. కొన్ని తాయిలాలు ప్రకటించడం మినహా ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చే ప్రకటనలేమీ చేయలేదు. రద్దు గాయంతో బాధపడుతున్న దేశ ప్రజలపై తాయిలాలతో పూత పూసే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాదికి తీపికబురు అందుతుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఉసూరుమనిపించారు. త్వరలో యూపీ సహా ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడి ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలను ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగాన్ని తలపించిన మోదీ ప్రకటనలో రైతులు, మహిళలు, చిరు వ్యాపారులపై వరాల జల్లు తప్ప.. నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం, విత్‌డ్రాయల్ పరిమితిని ఎప్పుడు ఎత్తేస్తారనే అంశాలపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. న్యూఢిల్లీ: దేశంలో అవినీతిపరులకు మున్ముందు మరిన్ని కష్టాలు ఎదురవనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ప్రకటించిన 50 రోజుల డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో శనివారం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతి పరులకు కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తూనే.. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు కష్టాలనెదుర్కొన్నా.. ప్రభుత్వానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని.. వారి మంచితనానికి సరైన ప్రతిఫలం అందిస్తుందని స్పష్టం చేశారు. పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు నోట్లరద్దును అవకాశంగా వినియోగించుకోవడంపై స్పందిస్తూ.. ‘ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేద’న్నారు. అందరికన్నా మేమే గొప్ప అనే దురభిప్రాయం నుంచి రాజకీయ పార్టీలు బయటకు రావాలన్న మోదీ.. రాజకీయాల ప్రక్షాళనకోసం అందరూ కలసి రావాలని కోరారు. రాజకీయాలను నల్లధనం, అవినీతి నుంచి విముక్తి చేసేందుకు సహకరించాలన్నారు. అవినీతిపై పోరాటంలో ఎంతమాత్రం వెనక్కు తగ్గేది లేదన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తామన్నారు. చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!) గ్రామీణ భారతంపైనే దృష్టి బడ్జెట్ ప్రసంగాన్ని తలపించిన ఈ ప్రకటనలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల రుణ పరిమితిని పెంచటం, గ్రామీణ, పట్టణాల్లో గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా వడ్డీ తగ్గింపులు, రైతుల రుణాలపై భారీగా వడ్డీ మాఫీ, వయోవృద్ధుల డిపాజిట్లపై వడ్డీ పెంపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. డబ్బులు ఎక్కువగా ఉన్న బ్యాంకులు పేదలు, అణగారిన వర్గాలకు రుణాలివ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా సాధారణస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెడుపై జరిగిన ఈ పోరాటంలో ప్రజలు, ప్రభుత్వం ఒకేవైపు నిలబడటం చారిత్రక పరిణామమన్నారు. ‘ఆర్థిక వ్యవస్థలో డబ్బులు తక్కువగా ఉంటే సమస్యలొస్తాయి. అదే డబ్బులు ఎక్కువైతే పరిస్థితి కఠినంగా మారుతుంది. అందుకే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నాం’అని మోదీ తెలిపారు. 125 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక సంపాదన రూ.10 లక్షలకు మించి ఉందని వెల్లడించారన్నారు. ‘ఇది నిజమేనా? మీ చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు, భారీ కార్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లక్షల మంది ఆదాయం 10 లక్షలకు మించి ఉంటుందనిపించటం లేదా? అందుకే ఈ ఉద్యమం నిజాయితీ పరులకోసం, వ్యవస్థను మరింత బలోపేతం చేయటం కోసం’అని మోదీ తెలిపారు. చెలామణిలో ఉన్న లక్షల కోట్ల ధనం బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావటమే ఈ మిషన్ విజయానికి కారణమన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 33 శాతం ఇళ్లను పేదలకోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ‘స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్నా.. లక్షల మంది పేదలకు ఇళ్లు లేవు. చాలా మంది మధ్యతరగతి వారికీ ఇల్లు కలగానే మిగిలింది. అలాంటి వారికోసమే ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తోంది’అని ప్రధాని అన్నారు. రైతులు.. మహిళలపై నోట్లరద్దు పథకం విజయవంతం కావటంలో సహకరించిన బ్యాంకు ఉద్యోగులను మోదీ ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నోట్లరద్దుతో వ్యవసాయం దారుణంగా నష్టపోయిందన్న విమర్శల్లో వాస్తవం లేదని.. ఈసారి రబీ సాగులో 6 శాతం వృద్ధి కనిపించిందన్నారు. సహకార బ్యాంకులు, సొసైటీలకు రుణాలివ్వటం ద్వారా నాబార్డుకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళలకు ప్రసవానికి ముందు, తర్వాత తమ, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వారి అకౌంట్లలో రూ.6వేల రూపాయలను నేరుగా బదిలీ చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. దీని ద్వారా శిశుమరణాలను గరిష్టంగా తగ్గించవచ్చన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోందని అయితే రూ.4వేలను లబ్ధిదారుల అకౌంట్లలో జమచేస్తున్నారని మోదీ వెల్లడించారు. నోట్లరద్దు కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా.. 125 కోట్ల మంది భారతీయులు ఓపికగా సహకరించారంటూ అభినందించారు. ‘దీపావళి తర్వాత శుద్ధి యజ్ఞంను ప్రారంభించాను. మెజారిటీ భారతీయులు అవినీతి నుంచి విముక్తి అయ్యేందుకే ఈ చారిత్రక ప్రక్షాళన కార్యక్రమానికి అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు’అని మోదీ తెలిపారు. రబీ కోసం రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేసిన 60 రోజుల వడ్డీని నేరుగా వారి అకౌంట్లలోనే జమజేస్తామన్నారు. భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా? మోదీ వరాలు ♦ వయోవృద్ధులు చేసే డిపాజిట్లపై (రూ.7.5 లక్షల వరకు) పదేళ్ల వరకు 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతరాళ్ల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం నేరుగా వారి అకౌంట్లలోకి రూ.6 వేలు జమచేయనున్నారు. ♦ రబీ పంటకోసం జిల్లా సహకార బ్యాంకులు, సొసైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు 60 రోజుల వరకు వడ్డీ మాఫీ. ♦ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల్లో రూ.2 లక్షల వరకు 3 శాతం వడ్డీ మాఫీ. ♦ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రెండు పథకాలు ప్రవేశపెట్టిన మోదీ..2017లో గృహ నిర్మాణానికి తీసుకునే 9 లక్షల వరకు రుణానికి 4 శాతం వడ్డీ, 12 లక్షల వరకు రుణానికి 3 శాతం వడ్డీ తగ్గించనున్నట్లు తెలిపారు. ♦ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణసామర్థ్యాన్ని రూ.కోటి నుంచి రెండు కోట్లకు పెంచారు. ♦ మూడు నెలల్లోపు 3 కోట్ల మంది రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్పు. ♦ నాబార్డు మూలనిధి రెట్టింపు (రూ.41వేల కోట్లకు పెంపు). ♦ ముద్ర యోజన లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు (3.5 కోట్ల నుంచి 7 కోట్లకు పెంపు). మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం. -
ఎస్సీ, ఎస్టీల ఉచిత సూక్ష్మసేద్యం ఎత్తివేత
• తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం • 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం • బీసీలకు 90 శాతం సబ్సిడీ 80 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచిత సూక్ష్మ సేద్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి 90 శాతం సబ్సిడీతో అందజేయాలని నిర్ణరుుస్తూ ఉద్యానశాఖ సంచ లన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, ఉద్యాన నర్సరీ సంస్థల కార్యనిర్వా హక సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. సూక్ష్మసేద్యం కోసం ఇస్తున్న రారుుతీని తగ్గిస్తూ సమావేశం సిఫార్సు చేసిం ది. బీసీలకు, ఇతర సన్నచిన్నకారు రైతులకు ప్రస్తుతం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, దాన్ని 80 శాతానికి తగ్గించాలని... పెద్ద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న 80 శాతం సబ్సిడీని 60 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచినట్లు తెలి సింది. ఈ పథకం కోసం కేటారుుస్తున్న నిధు ల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న, చిన్నకారు రైతులకు కేటారుుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా నష్టపోయేది ఈ వర్గాల రైతులే ఎక్కువగా ఉంటారు. నిధులు విడుదల చేయకపోవడం వల్లే... సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సంబంధిత పరికరాలు అందించాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయం తీసుకుంది. ఇతర రైతులకు కూడా కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కంటే ఎక్కువగా ఇస్తూ ఇప్పటివరకు అమలు చేసింది. కానీ ఆచరణలో ఆ మేరకు నిధులను విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2014-15లో 1.34 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయా లనేది ఉద్యానశాఖ లక్ష్యం. అందుకు ప్రభుత్వం రూ.350.08 కోట్లు బడ్జెట్లో కేటారుుంచి, 70,480 ఎకరాలకు రూ.191 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. 2015-16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ.308 కోట్లు కేటారుుంచింది. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.6 లక్షల ఎకరాల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మ సేద్యం అందించాలంటే బడ్జెట్ కేటారుుంపు లకు తోడు అదనంగా రూ.337.3 కోట్లు కేటారుుం చాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రూ.290 కోట్లు కేటారుుంచింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరి పోదు. దీంతో నాబార్డు నుంచి రూ. వెరుు్య కోట్లు రుణానికి వెళ్లాలని నిర్ణరుుంచింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా భారీ సబ్సిడీ ఇస్తే తాము ఒప్పుకోబోమని నాబార్డు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాబార్డును ఒప్పించేందుకు ముంబై వెళ్లేందుకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి సిద్ధమయ్యారు. చివరకు నాబార్డు సబ్సిడీ నిర్ణయాన్ని ఇప్పుడు అమలులోకి తీసు కొచ్చినట్లు చెబుతున్నారు. -
హోదాతో ఎక్కువ రాయితీలు రావు
* తప్పులు చేస్తే ఇప్పుడు జనం నోరు తెరవరు.. * ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇస్తారు: టీడీపీ వర్క్‌షాపులో చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు వస్తాయనే రీతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయోజనాన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలో 1.47 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లైందన్నారు. గురువారం మూడో రోజు నిర్వహించిన టీడీపీ నాయకత్వ-సాధికారత వర్క్‌షాపు ప్రారంభ ఉపన్యాసం చేసిన చంద్రబాబు.. సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులుగా తప్పులు చేస్తే జనం ఇప్పుడు నోరు తెరవరు.. కానీ ఎన్నికల్లో సెలైంట్‌గా జడ్జిమెంట్ ఇస్తారు జాగ్రత్త అంటూ పార్టీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన సేవలు అందకపోతే సహించరని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల్లో 80 శాతం సంతృప్తి, రాజకీయ ఏకీకరణ 80 శాతం, నాయకుల పనితీరు పట్ల 80 శాతం అనుకూలత రావాలన్నారు. పాలనలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించవద్దని కోరారు. రాజకీయనేత నైపుణ్యాలు, ఆర్థిక వేత్త నైపుణ్యాలు వేర్వేరు కాబట్టే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు పొలిటికల్ ఇమేజీ రాలేదన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచామన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వారికి చేసిన ప్రయోజనాలు వివరించి పార్టీకి దగ్గరయ్యేలా చూడాలని కోరారు. గోదావరిని పెన్నాకు కూడా అనుసంధానం చేసి సోమశిల వరకు నీటిని తీసుకెళ్తామన్నారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఇండియా ఎకనమిక్ సమ్మిట్‌లో బాబు ప్రసంగిస్తారు. సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. -
కరువు నివారణలో ప్రభుత్వాలు విఫలం
► ఏఐఎఫ్టీయూ (న్యూ) కేంద్ర ప్రధాన కార్యదర్శి అరవింద సిన్హా ► గుంటూరులో ప్రారంభమైన రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు గుంటూరు వెస్ట్ : దేశ వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (న్యూ) కేంద్ర ప్రధాన కార్యదర్శి అరవిందసిన్హా విమర్శించారు. మూడు రోజుల పాటు జరగనున్న రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభలు శుక్రవారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్లారి రాఘవ ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరిగింది. సభలో అరవిందసిన్హా మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ విధానాలతో దేశంలో రైతాంగానికి సబ్సిడీలు తగ్గిపోయాయని, విదేశాల్లో రైతులకు సబ్సిడీలు పెరిగాయని తెలిపారు. దీంతో విదేశీ ఉత్పత్తులు తక్కువ ధరలకే దేశ మార్కెట్లోకి రావడంతో మన ఉత్పత్తులకు మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీచాయ్వాలా కాదని, బూర్జువా వాలా అంటూ ఘాటుగా విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని ధ్వజమెత్తారు. సీపీఐ (ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని కోసం ఏడాదిలో మూడు పంటలు పండే 33 వేల ఎకరాల సారవంతమైన భూములను సమీకరణ పేరుతో రైతుల నుంచి గుంజుకోవడాన్ని తప్పుపట్టారు. సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టే విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఉద్యమాలకు పురిటిగడ్డ గుంటూరు జిల్లా అని పేర్కొన్నారు. సభలో ఏఐకేఎంకేఎస్ నాయకులు శంభుమోహతో (జార్ఖండ్), ఎస్డీ బోసు (బీహార్), శ్రీకాంత్ మొహంతీ (ఒడిషా), విందైవేందన్ (తమిళనాడు), కృష్ణన్‌కుట్టి (కేరళ), కె.బాబూరావు (మహారాష్ట్ర), రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.కోటయ్య, రాష్ట్ర నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, భూతం వీరయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, జనశక్తి సంపాదకుడు డాక్టర్ పి.జశ్వంత్‌రావు, చాగనూరు మల్లికార్జునరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ప్రదర్శన.. రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ప్రదర్శన నిర్వహించారు. నగర పాలక సంస్థ కార్యాలయం మీదుగా కొత్తపేట, భగత్‌సింగ్ విగ్రహం, నాజ్‌సెంటర్ తదితర ప్రాంతాల మీదుగా ప్రదర్శన కొనసాగింది. బహిరంగసభ ప్రారంభం ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, రైతాంగ సమస్యలపై నిర్వహించిన పొలికేక నృత్య నాటిక సభికులను ఆకట్టుకున్నాయి. -
ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయ యంత్రాలు
100 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ పని ముట్ల పరిశోధన విభాగం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ దినోత్సవం, రైతు సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో యాంత్రీకరణకు అత్యధికంగా సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి లాభాలు పొందాలంటే యాంత్రీకరణ అవసరమన్నారు. ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు యాంత్రీకరణ పథకాల నిబంధనలను సరళతరం చేశామన్నారు. వచ్చే ఖరీఫ్‌కు వివిధ పంటలకు అవసరమైన 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎరువులను కూడా బఫర్ స్టాక్ ఏర్పాటు చేశామన్నారు. కరువుకు సంబంధించి పెట్టుబడి రాయితీ కేంద్రం నుంచి సకాలంలో వచ్చినా రాకపోయినా వచ్చే ఖరీఫ్‌కు ముందే మే నెలలో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక అసిస్టెంట్ డెరైక్టర్‌ను నియమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎన్.వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీల వేతనం స్వాహా
ఫోర్జరీ సంతకాలతో ఎంపీటీసీల జీతం స్వాహా చేసిన వైనం ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు ఎంపీటీసీ సభ్యురాలి ఫిర్యాదు సంక్షేమ పథకాలు.. సామాన్యులకు ఇచ్చే సబ్సిడీలు.. పింఛన్లు తదితర వాటిల్లో ప్రభుత్వ శాఖల సిబ్బంది స్వాహా చేయడం మామూలే. అయితే ఆ మండల కార్యాలయ సిబ్బంది ఏకంగా ప్రజాప్రతినిధులకే టోకరా వేశారు. వారి వేతనాలను స్వాహా చేశారు. ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్నవారు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుపతి: ఏకంగా ఎంపీటీసీ సభ్యులకే మస్కా కొట్టి వారి వేతనాలను స్వాహా చేసిన సంఘటన ఐరాల మండలంలో కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఓ ఎంపీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ఆరా తీశారు. ప్రజాప్రతినిధుల వేతనాల పంపిణీలో సిబ్బం ది చేతివాటం ప్రదర్శించినట్లు తేలడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఐరాల మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. 20 14లో వారుఎన్నికైన సమయంలో గౌరవ వేతనం రూ.750 ఉండేది. వారు జూన్ 2015 వరకు జీతాలుడ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి ఏప్రిల్ వరకే వేతనం అందింది. అటు తర్వాత ఇంతవరకు జీతం చెల్లించలేదు. అక్టోబర్ 2015 నుంచి వీరి జీతంరూ.3,000 చేశారు. గుట్టు రట్టయింది ఇలా... తనకు రెండేళ్లుగా జీతం రావడం లేదని కోళ్లపల్లె ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మ ఇటీవల పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన చిత్తూరులోని జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కు వెంటనే ఫోన్ చేశారు. ఎంపీటీసీ సభ్యుల జీతాల విషయమై ఆరా తీయగా నిధులను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. దీంతో ఆయన ఎంపీడీఓను జీతాల విషయమై ప్రశ్నిం చారు. డొంక తిరుగుడు సమాధానం రావడంతో ఎమ్మెల్యేకి అనుమానం వచ్చింది. వెంటనే ఐరాల మండల పరి షత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్క డ ఎంపీడీవో పార్వతమ్మ సమక్షంలో కార్యాలయ రికార్డులను తనిఖీ చేయగా, అక్విటెన్స్ రిజిస్టర్లో సంతకాలు ఫోర్జరీ చేసి జీతాలు స్వాహా చేసిన విషయం, కొట్టివేతలను గమనించారు. ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మను కార్యాలయానికి పిలిపించి సంతకాలు పరిశీలించగా ఫోర్జరీ అని తేలింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలను పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గత సంవత్సరం పంపిణీ చేసిన గౌరవ వేతనంలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో తారుమారయ్యాయన్నారు. లెక్కల్లో ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
మాటల గారడీతో బురిడీ
విశ్లేషణ వంట గ్యాస్ సబ్సిడీ రూ. 48 కోట్లతో ఏడాదిపాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించ వచ్చని ఒక ఆర్థికవేత్త అన్నారు. అలాగైతే కార్పొరేట్ రంగానికి పన్నుల రాయితీలుగా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించి, గత చరిత్రగా మార్చేయొచ్చుగా? అంటే, ఆ రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు. కానీ ఈ రాయితీలు వృద్ధిపై ప్రభావం చూపిన దాఖలాలే లేకుండా విఫలమయ్యాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోయినట్టు? పదే పదే అడుగుతున్నా... భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు. అవునండీ, ప్రధాన మంత్రి గారూ! మీరన్నది అక్షరాలా నిజం. ఇదంతా మాటల గారడీయే. పేదలకిచ్చే ఆర్థిక సహాయాన్ని సబ్సిడీలంటారు. సంపన్నులకు... భూమి, సహజ వనరులను కారు చౌకకు సునాయాసంగా కట్టబెట్టేయడం, పన్నుల రాయితీలు, పన్నుల సెలవులు వంటి కొండవీటి చాంతాడంతటి భారీ రాయితీల జాబితాను వృద్ధికి ప్రోత్సాహకం అంటారు. పేదలకిచ్చే సబ్సిడీ అనే పదమే ఇప్పుడు గొప్ప తప్పుగా మారిపోయింది. వృద్ధి పేరిట పన్ను రాయితీల దగా ఆర్థిక చింతనను అతి తెలివిగా వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా పదాలను ఎంచుకుని వల్లె వేయడం బహిరంగ చర్చలో భాగమై పోయే స్థాయికి నేడు చేరింది. ఈ పదాల గారడీ ఆర్థిక అంతరాలు మరింత అధ్వానంగా విస్తరిం చడానికి దారి తీస్తోంది. సంపన్నులకు, పలుకుబడిగలవారికి తరచుగా ఇస్తుండే విపరీతమని అనిపించేటంతటి భారీ సబ్సిడీలే బహుశా నేటి ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభానికి అసలు పునాదులు కావచ్చు. ఆ సబ్సిడీలను కప్పిపుచ్చడానికి తగ్గ పదజాలాన్నే ఎంచుకుంటున్నారు. ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలెవరూ ఈ విషయాన్ని ఎన్నడూ ప్రశ్నించకపోవడమే విషాదం. వారికీ విషయం తెలుసు. అయినా మౌనం దాల్చారు. ‘‘ఎరువుల సబ్సిడీలను ‘వ్యవసాయ ఉత్పత్తికి ప్రోత్సాహకం’గా పునర్నామకరణం చేస్తే కొందరు నిపుణులు వాటిని విభిన్నంగా చూడవచ్చా? అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’ అని ప్రధాని అన్నారు. ఆయన సరిగ్గా సరైన విషయమే చెప్పారు. సరిగ్గా నేనీ విషయాన్నే చాలా కాలంగా చెబుతున్నాను. ఇది పదాల గారడీ కాకపోతే... 2004-05 నుంచి మన కార్పొరేట్ రంగానికి రూ. 42 లక్షల కోట్ల పన్ను రాయితీలను ఇవ్వడాన్ని వృద్ధికి ప్రోత్సాహకమని ఎలా అంటారు? (సంపన్నుల కిచ్చే ఈ భారీ సబ్సిడీలను బడ్జెట్ డాక్యుమెంట్లలో ‘ముందస్తుగా వదులుకున్న రాబడులు’ అని చూపుతారు.) దేశ జనాభాలో 67 శాతం ఆకలిని తీరుస్తుందని భావిస్తున్న ఆహార భద్రతా కార్యక్రమానికి ఖర్చయ్యే రూ. 1.25 లక్షల కోట్లు వృథా సబ్సిడీ అని ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందుకు గగ్గోలు పెడతారు? ఈ విషయాన్ని మీరూ గమనించే ఉంటారు. పలు టీవీ చర్చల్లో నేనీ ప్రశ్నను లేవనెత్తినప్పుడల్లా నన్ను విస్మరించడమే జరగుతోంది. విఫలమైన కార్పొరేట్ రాయితీలు నాకింకా గుర్తుంది. ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీతో జరిగిన ఒక బడ్జెట్ పూర్వ సమావేశాల్లో పన్ను రాయితీలను ఉపసంహరించుకోవాలని సూచించాను (అప్పట్లో అవి ఒక్క ఏడాదికే రూ. 5.24 లక్షల కోట్లుగా ఉన్నాయి). అవి దేశ అర్థిక వనరులను ఖాళీ చేసే భారీ కంత అని వివరించాను. కాగా, ఈ భారీ రాయితీలను ప్రజల కంటపడకుండా చేస్తున్న ‘ముందస్తుగానే వదులుకున్న రాబడులు’ పద్దును బడ్టెట్ పత్రాల నుంచి తొలగించాలని ప్రధాన స్రవంతికి చెందిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక మంత్రిని కోరేంత వరకూ వెళ్లారు. గ్యాస్ సబ్సిడీతో పేదరిక నిర్మూలన? ఈ విషయాన్ని పరిశీలించండి. వంట గ్యాసు (ఎల్పీజీ) సబ్సిడీని వృథా సబ్సిడీ అంటూ గగ్గోలు పెట్టారు. దానిలో చాలా వరకు సంపన్న వర్గాలకు చేరేదే. వారి సబ్సిడీని ఉపసంహరించుకోవాల్సిందే. ఏటా దేశం వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీల కోసం రూ. 48 కోట్లు ఖర్చు చేస్తోందని, ఒక ఏడాది పాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి అది సరిపోతుందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త రాయడం నాకు గుర్తుంది. ఆయన మొత్తంగా ఆ సబ్సిడీ రద్దును కోరారు. రూ. 48 కోట్ల వంట గ్యాస్ సబ్సిడీతో ఏడాది పాటూ పేదరి కాన్ని నిర్మూలించగలిగితే, పన్నుల రాయితీల రూపేణా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించవచ్చని, పేదరికం కచ్చితంగా గత చరిత్రగా మారిపోతుందని నేను బదులు రాశాను. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు. ఈ భారీ పన్ను రాయితీలు, మూడేళ్ల బడ్జెట్ పూర్తి వ్యయానికి సరిపోతాయి. పైగా ఈ రాయితీలు ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలమయ్యాయి. దేశంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఉద్యోగాలు లేని వృద్ధి. ఉపాధి కల్పన నిరాశాజనకంగా, పారిశ్రామిక వృద్ధి మందకొడిగా ఉండగా, వస్తుతయారీ వృద్ధి రుణాత్మకంగా మారింది. ఎగుమతులు పుంజుకోవడంలో విఫలమయ్యాయి. వృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎలాంటి ప్రభావాన్ని కలిగించిన దాఖలాలే కనబడకుండా విఫలమైతే, ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయినట్టు? అనే ప్రశ్నను నేను పదే పదే అడుగుతూనే ఉన్నాను. సమా దానం మాత్రం నేటికీ రాలేదు. నీతి ఆయోగ్ ఎన్నడూ దీన్ని ప్రశ్నించినదీ లేదు. ముఖ్య ఆర్థిక సలహాదారు ఈ విషయాన్ని వేలెత్తి చూపినదీ లేదు. భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు. దేశానికి దెబ్బ మీద దెబ్బ ‘‘ద్వంద్వ పన్నుల ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో రెట్టింపు పన్నుల ఎగవేతకు దారి తీస్తుంది’’ అని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య నాకు నచ్చింది. ఏటా ఇచ్చే పన్నుల రాయితీలలో ఇవి కూడా లెక్కకు రావు. మరో విధంగా చెప్పాలంటే, దేశానికి రెట్టింపు నష్టం వాటిల్లుతుంది. ఒక వంక ఈ పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ రాబడికి నష్టం. మరోవంక ప్రధాని అన్నట్టు ‘‘స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారం జరిగే షేర్ల నుంచి లభించే డివిడెంట్లను (లాభాలు), దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్‌ను ఆర్జించేది పేదలు కాకున్నా వాటిపై ఆదాయపు పన్నుకు పూర్తి మినహాయింపు ఉంది. అది మినహాయింపే అయినా దాన్ని పన్ను రాయితీగా లెక్కించడంలేదు.’’ ప్రధాని అన్నది అక్షర సత్యం. దేశానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ మాటల గారడీ ఇక్కడితో ముగిసేది కాదు. మీరో, నేనో బ్యాంకు అప్పు చెల్లించలేకపోతే మనల్ని అపరాధులుగా లెక్కిస్తారు. మనం అప్పుచేసి కొన్న కారును లేదా మనం కుదువ పెట్టిన ఆస్తిని బ్యాంకు లాక్కుంటుంది. లేదంటే ఆ డబ్బు రాబట్టుకోడానికి తప్పుడు పద్ధతులకైనా పాల్పడుతుంది. అదే సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు బ్యాంకు రుణం చెల్లించకపోతే. ఆ రుణాన్ని నాన్-పెర్ఫార్మింగ్ ఎస్సెట్స్ (ఎన్పీఏలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తులు) అంటారు. ఈ పద ప్రయోగంతో రెండు ప్రయోజనాలు. ఒకటి, తెలివిగా విభిన్న పదాలను ప్రయోగించడం ద్వారా పెద్ద పెద్ద నేరాలను ఎలా దాచిపెట్టేస్తారో సామాన్యునికి అర్థం కాదు. రెండు. ఈ కంపెనీల భౌతిక అస్తులను ఎన్నడూ స్వాధీనం చేసుకోరు. అందుకు బదులుగా వారి బాకీలను పునర్వ్యవస్థీకరిస్తారు. సామాన్యుని సబ్సిడీకి మోదీ వత్తాసు బ్యాంకుల క్రియాశీలంగా లేని ఆస్తులు కీలక స్థాయికి చేరాయి. కానీ ఏ టీవీ చర్చనైనా చూడండి... వాటి గురించి ఎప్పుడో గానీ ప్రస్తావనకు రాదు. 2008-09లో రైతుల రుణాలను రూ. 74 వేల కోట్ల మేరకు మాఫీ చేశారనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. భారీ రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరించడం మాత్రం ప్రధాన మీడియాలో (బిజినెస్ చానల్స్ సహా) చర్చకు రావడం ఎన్నడూ చూసి ఎరుగను. కారణం సుస్పష్టమే. సంపన్నులు తమకిచ్చే సబ్సిడీలను కాపాడుకోవాలని కోరుకుంటారు. ప్రజలకు అర్థంకాని పదజాల ప్రయోగంతో వాటిని కప్పిపుచ్చడమే అందుకు అత్యుత్తమ మార్గం. ప్రధాన మంత్రి గారూ, ధన్యవాదాలు. ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు, మీడియా అడుగిడటానికి భయపడే బాటన మీరు అడుగు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల సబ్సిడీలను సమర్థిస్తూ మాట్లాడారు. అది పూర్తిగా సరైనది. వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు hunger55@gmail.com దేవిందర్‌శర్మ -
ఇదెక్కడి చేయూత
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అందని రాయితీలు రూ.కోటికి పైగా పేరుకుపోయిన బకాయిలు పరిశ్రమలకు స్వర్గధామం ఏపీ. ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఫలానా పరిశ్రమ పెట్టుకుంటామని దరఖాస్తు చేస్తే చాలు. అన్ని అనుమతులు చకచకా ఇచ్చేస్తాం.. అన్ని రాయితీలు ఇస్తాం.. అంటూ సర్కా రు చెప్పుకుం టున్న గొప్పలు నీటి మీద రాతలేనని తేలిపోతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికులకు ప్రభుత్వ ఆసరా కాగితాలకే పరిమితమవుతోంది. రాయితీల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడితోపాటు స్టాంప్ డ్యూటీ, పావలా వడ్డీ, సేల్స్ ట్యాక్స్, పవర్ టారిఫ్ ఇలా వివిధ రకాల రాయితీలు కల్పించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది. అలాగే వారికి అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు కావాల్సిన స్థలం కేటాయింపు విద్యుత్ తదితర అన్ని విషయాల్లో రాయితీలు కల్పించాలి. అయితే జిల్లాలో గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నేటికీ వివిధ రాయితీలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో వారంతా పరిశ్రమల స్థాపనకు చేసిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడిలో 35 శాతం రాయితీగా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ విధంగా మూడు కంపెనీలకు రూ.20 లక్షల మేర పెట్టుబడి రాయితీ రావాల్సి ఉంది. అలాగే స్టాంప్‌డ్యూటీలో 50 శాతం, ల్యాండ్ కాస్ట్లో 25 శాతం రాయితీ కింద చెల్లించాల్సి ఉంటుంది. రెండు కంపెనీలకు రూ.70వేల వరకు రావాల్సి ఉండగా, పావలా వడ్డీ స్కీమ్‌లో భాగంగా ఇంట్రస్ట్ సబ్సిడీ కింద రూ.3.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సేల్స్ టాక్స్ కింద మూడు కంపెనీలకు రూ.50 లక్షల మేర రాయితీ విడుదల కావాల్సి ఉంది. పవర్ టారిఫ్ రాయితీ కింద ఓ కంపెనీకి రూ.3 వేల వరకు విడుదల కావాల్సి ఉంది. మరికొన్ని కంపెనీలకు రూ.50 లక్షల మేర వివిధ రాయితీల కింద ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సి ఉంది. గత రెండేళ్లుగా తిరుగుతున్నా రాయితీ సొమ్ము విడుదలలో సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. -
సంక్షోభ రంగాలకు రాయితీలివ్వాలి
ప్రభుత్వానికి అసోచామ్ విన్నపం న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న రంగాలను గట్టెక్కించడానికి రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. రియల్టీ, విద్యుత్తు, ఉక్కు, ఆభరణాలు, రత్నాలు తదితర రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. ఈ రంగాలను ఆదుకోవడానికి ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, తక్కువ వడ్డీరేట్లకే రుణాలివ్వాలని, ఎగమతిదారులకు వడ్డీరాయితీ స్కీమ్‌ను అందించాలని కోరారు. విద్యుత్ పంపిణి కంపెనీలు(డిస్కమ్‌లు) సమస్యల్లో కూరుకుపోయాయని, వీటిని రక్షించడానికి ఆర్బీఐ, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటిని గట్టెక్కించలేకపోతే అవి నిర్జీవ ఆస్తులుగా, నిరర్ధక ఆస్తులుగా మారిపోతాయని, ఖజానాకు గుదిబండగా తయారవుతాయని హెచ్చరించారు. ఉద్యోగాలు కల్పించే పలు కీలక రంగాలు సమస్యల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. డిమాండ్ లేకపోవడం, అధిక వడ్డీ వ్యయాలు, చౌక దిగుమతులు వెల్లువెత్తుతుండటం దీనికి ప్రధాన కారణాలని వివరించారు. డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉక్కు, సిమెంట్, విద్యుత్ పరికరాలు వంటి నిర్మాణ రంగ మెటీరియల్స్‌కు స్వల్పకాలిక ప్యాకేజీని ఇవ్వాలని పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాల రంగానికి వడ్డీ రాయితీ వంటి స్కీమ్‌లు వర్తింపజేయాలని సూచించారు. ప్రత్యేక రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందన్న భావన సరికాదని చెప్పారు. -
‘మద్యం’ దరఖాస్తుదారులకు ఇబ్బందులు!
జంగారెడ్డిగూడెం : మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం వీరంతా ఆదాయ పన్ను పరిధిలోకి వెళ్లటమేనని ఆడిటర్లు చెబుతున్నారు. జూన్ నెలాఖరులో జిల్లాలో 475 మద్యం షాపులకుగాను 428 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ షాపులకు పది వేలకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు రుసుము, షాపుల గ్రేడులను బట్టి కనీసం రూ.మూడు లక్షలకు డీడీలు తీసి దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారులకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స వేసి ఉండాలి. ఇదంతా ఆధార్‌తో అనుసంధానం అవుతుంది. మద్యం వ్యాపారులు చాలా వరకు బినామీ పేర్లతో దరఖాస్తులు చేయించారు. ఇందులో ఎక్కువ శాతం మధ్యతరగతి, సామాన్య ప్రజలే ఉన్నారు. కొన్ని షాపులు గిరిజనులకు కేటాయించడంతో వారిలో గిరిజనులు కూడా ఉన్నారు. దీంతో వీరందరికీ ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ వేసేంతగా ఆదాయం ఉందా అనేది ప్రశ్నార్థకం. వీటి ఆధారంగానే ఆదాయ పన్ను అధికారులు భవిష్యత్తులో వారందరికీ నోటీసులు జారీచేసే అవకాశం ఉందని ఆడిటర్ల అభిప్రాయం. చాలా మందికి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స వేసేంత ఆదాయం లేదు. అయినా వాటిని సృష్టించి సిండికేట్లు దరఖాస్తులు చేయించాయి. ఇక్కడ నుంచే వీరందరికీ ఇబ్బందులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ వీరిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతానికి 2009 నుంచి 2012 వరకు ఒకేసారి పొదుపు ఖాతాలో రూ.రెండు లక్షలు జమ అయిన ఖాతాలు, క్రెడిట్‌కార్డు కలిగి ఉండి రూ.50 వేలు ఒకేసారి కొనుగోలు చేసిన ఖాతాదారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో మూడు రూ.లక్షలకుపైగా డీడీలు తీసిన దరఖాస్తుదారులందరికీ అంత డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో లెక్క చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మద్యం దరఖాస్తుల కోసమే తాత్కాలికంగా ఐటీ రిటర్న్స్ వేసినా, వచ్చే ఏడాది నుంచి వీరందరికీ ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. తెల్లరేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్‌లో ఏడాది ఆదాయం కనీసం రూ. రెండు లక్షలుగా చూపిస్తున్నారు. రూ.రెండు లక్షల ఆదాయమున్న వ్యక్తి కుటుంబం తెల్ల రేషన్ కార్డు, ప్రభుత్వ సబ్సిడీలు కోల్పోతుంది. ఇందుకుగాను మద్యం షాపు దరఖాస్తుదారు సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. -
లాభసాటిగా వ్యవసాయం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు పలు రకాల సబ్సిడీలు, ఉత్పత్తుల నిల్వకు గోడౌన్లు, మార్కెటింగ్ వసతి కల్పిస్తున్నామన్నారు. తమకు కూడా గౌరవ వేతనాలను పెంచాలంటూ సహకార సంఘాల అధ్యక్షులు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో సహకార సంఘాల సేవల వినియోగాన్ని పరిశీలిస్తామని చెప్పారు. -
సబ్సిడీల్లో 10 శాతం కోత
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై సబ్సిడీల్లో 10 శాతం కోతవేశారు. ముఖ్యంగా పెట్రోలియంపై సబ్సిడీలను భారీగా కత్తిరించడంతో 2015-16 బడ్జెట్లో సబ్సిడీలు రూ.2.27 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్థిక మంత్రి జైట్లీ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ మూడింటిపై 2,27,387.56 కోట్లను సబ్సిడీల కింద కేటాయించారు. గత బడ్జెట్లో (సవరించిన అంచనాలు) ఈ బిల్లు రూ.2,53,913.12 కోట్లుగా ఉంది. ఆహారానికి గత బడ్జెట్లో రూ.1,22,675.81 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1,24,419 కోట్లను రాయితీల కింద కేటాయించారు.. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు దాదాపు రూ.65 వేల కోట్లు ప్రతిపాదించారు. ఎరువులపై సబ్సిడీ గత బడ్జెట్లో రూ.70,967.31 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.72.968.56 కోట్లు కేటాయించారు. పెట్రోలియంకు గత బడ్జెట్లో రూ.60,270 కోట్ల సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రూ.30 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఎల్పీజీ సబ్సిడీకి రూ.22 వేల కోట్లు కాగా మిగతా మొత్తం కిరోసిన్‌కు కేటాయించారు. -
క్రమేణా సబ్సిడీలు హేతుబద్ధం: జైట్లీ
చెన్నై: దేశంలో వివిధ రంగాల్లో అమలు చేస్తున్న అన్ని సబ్సీడీలను క్రమేణా హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అప్పుడే దేశంలో భారీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, తద్వారా ఆశించిన ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న 2015-16 సాధారణ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మండలి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, వంట గ్యాస్ సబ్సిడీని బ్యాంకుల ద్వారా బట్వాడా చేయడం జనవరి నుంచి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ సాధ్యమయ్యే అన్ని సబ్సిడీలను సాధ్యమైనంత త్వరగా హేతుబద్ధం చేస్తామని ప్రకటించారు. చమురు, ఎరువులకు ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దాటిందని దీన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని ఆర్థిక వ్యయ కమిషన్ సిఫార్సులను రానున్న బడ్జెట్లో పొందుపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జైట్లీ తెలిపారు. -
దళ సభ్యులు లొంగిపోతే అరెస్ట్ చేయం
జనస్రవంతిలో కలవండి {పభుత్వపరంగా సాయం లొంగని దళ సభ్యులను అరెస్ట్ చేస్తాం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ విశాఖపట్నం: లొంగిపోయే మావోయిస్టు మిలీషియా సభ్యులకు ప్రభుత్వ పరంగా రాయితీలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. అలా కాకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన గాలికొండ దళం సభ్యుడు పంగి భాస్కరరావు అలియాస్ సూర్యం(22), పోలీసులకు లొంగిపోయిన కలిమెల దళం సభ్యురాలు కొర్రా శాంతి అలియాస్ రత్నం(22), మరో 11మంది మిలీషియా సభ్యులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిలీషియా సభ్యులు జనస్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. గాలికొండ దళ సభ్యుడు పంగి భాస్కరరావును వేకువజామున పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. కొర్రా శాంతి 2012 నుంచి 2013 వరకు కలిమెల దళంలో కీలక సభ్యురాలిగా పనిచేస్తున్నదన్నారు. రెండు కరువుదాడుల్లో ఆమె నిందితురాలని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నందున లొంగిపోయిందని తెలిపారు. ఆమెతో పాటు మిలీషియా సభ్యులు జెమ్మిలి రవి అలియాస్ రవి(23), వంతల చిట్టిబాబు అలియాస్ చిట్టి(24), తంబేలు అర్జున్ అలియాస్ సన్యాసిరావు(20), పంగి సాంబశివ అలియాస్ సాంబ(20), జెమ్మిలి సుందరరావు అలియాస్ అప్పారావు(24), జెమ్మిలి భీమరాజు అలియాస్ భీమ(20), జెమ్మిలి భాస్కరరావు అలియాస్ కేశవరావు(22), పంగి బాలకష్ణ అలియాస్ బాలయ్య, తంబేలు చిన్నరావు అలియాస్ చిన్నయ్య(22), జెమ్మిలి సుబ్బరావు అలియాస్ బందునాయుడు(42) స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. పంగి భాస్కరరావు కార్యకలపాలు.. అరెస్టు చేసిన పంగి భాస్కరరావు పలు కేసుల్లో నిందితుడని ఎస్పీ తెలిపారు. జీకే వీధి మండలం పెద్దవలస కాఫీగోడౌన్ పేలుడు కేసు,లక్కవరపు కోటకు చెందిన కె.రాజు హత్య కేసు, లక్కవరపుకోట సర్పంచ్ బాబూరావు ఇంటిపై కరువుదాడి కేసు, లక్కవరపు కోటకు చెందిన కె.రాజబాబు హత్య కేసు, కంకుమపూడిలో కొర్ర నారాయణరావు ఇంటిపై కరువుదాడి, కంటిపాటి సోమలింగంపై హత్యాయత్నం కేసు, ఏపీఎఫ్డీసీ క్వార్టర్లు తగలపెట్టిన కేసు, చాపగెడ్డ బ్లాస్టింగ్, జెమ్మిలి చిన్నారావు హత్య కేసు, చింతపల్లి మండంలో సుబ్బరావు ఇంటిపై కరువు దాడి, రాంబాబు, రాము, చెరువుపాకలు కాఫీ ఎస్టేట్‌లో దాడి, సిందిరి కార్ల హత్య కేసు, సంజీవరావు హత్య, కొయ్యూరులో జరిగిన సిందిరి పాత్రో హత్య కేసు, పెద్ద వలస పేలుడు కేసుల్లో పంగి భాస్కరరావు నిందితుడని తెలిపారు. ఒడిశాలో ఇటీవల జరిగినఎన్ కౌంటర్లో ఎందరు దళసభ్యులు చనిపోయింది అధికారకంగా తెలియదన్నారు. బలిమెల జలాశయంలో మృతదేహాలు గల్లంతవ్వడంతో గుర్తిం చలేకపోయామన్నారు. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించందన్నారు. -
నిధులు నేరుగా ఇవ్వండి: యనమల
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేసి నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలపడితేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజనల ఏపీ నష్టపోయినందున ఎక్కువగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని వాగ్దానాల అమలుకు బడ్జెట్ లో తగినంత నిధులు ఇవ్వాలని యనమల అన్నారు. -
పౌల్ట్రీకి ప్రాణం
సిద్దిపేట అర్బన్: పౌల్ట్రీరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెతుకుసీమది రెండోస్థానం. రంగారెడ్డి జిల్లా తర్వాత కోళ్ల ఫారాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న జిల్లా. గడచిన పదేళ్లలో పౌల్ట్రీ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి రూ.1,116 కోట్ల వరకు పౌల్ట్రీ వ్యాపారం సాగుతోంది. జిల్లాలో 80 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బాయిలర్ ఫారాలు 2 వేల వరకు ఉన్నాయి. ఇక 70 లక్షల సామర్థ్యం కలిగిన లేయర్ ఫారాలు 70, 5 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బ్రీడర్ పౌల్ట్రీ ఫారాలు జిల్లాలోని వివిధ చోట్ల ఉన్నాయి. పౌల్ట్రీరంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నిర్వహణ ఖర్చులతో కుదేలు ఒకప్పుడు కాసులు కురిపించిన పౌల్ట్రీ రంగం రానురాను సంక్షోభంలో కూరుకుపోయింది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో పాటు విద్యుత్ ఛార్జీలు, తరచూ దాణా ధరల పెరుగుదల వంటివి ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు, రైతులు, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడ్డాక పౌల్ట్రీ సమాఖ్య ప్రతినిధులంతా మరోమారు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పౌల్ట్రీని గట్టెక్కించేందుకు ఈ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా తన తొలి బడ్జెట్లోనే నిధులు సైతం కేటాయించారు. పౌల్ట్రీరంగం ఎదుర్కొన్న సమస్యలు కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, చేపల మిశ్రమం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దాణాను ప్రభుత్వరంగ సంస్థల నుంచి కాకుండా మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో వారు కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేశారు. దీంతో కోళ్ల ఫారాల రైతులపై అదనపు భారం పడింది. సాధారణంగా కోళ్ల ఫారాలకు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో విద్యుత్ శాఖ కోళ్ల ఫారాలను మూడో విభాగం కింద చేర్చి యూనిట్‌కు రూ. 6.08 ఛార్జీలు వసూలు చేస్తోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ. 2 చొప్పునే చెల్లించే వెసులుబాటు కల్పించడంతో పాటు కోళ్ల ఫారాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. ఈ విధంగా మనదగ్గర లేకపోవడంతో నిర్వహణ వ్యయం పౌల్ట్రీ నిర్వాహకులకు భారంగా మారుతోంది. వ్యవసాయ హోదాతో కలిగే లాభాలు ప్రభుత్వం ప్రస్తుతం కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వడంతో చాలా వరకు కష్టాలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. విద్యుత్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనిట్ కరెంటుకు రూ. 6.08 చెల్లిస్తున్న పౌల్ట్రీ రైతులు, ఇక నుంచి రూ.3 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పభుత్వ రంగ సంస్థల నుంచే దాణాలో వినియోగించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశంతో పాటు సబ్సిడీలు పొందే వీలుంటుంది. నిర్వహణ భారం తగ్గడం వల్ల ఫారాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దవచ్చు. దీంతో కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు, దుర్వాసన వంటి అసౌకర్యాలూ తొలగిపోతాయి. వ్యవసాయ హోదా వల్ల ఔత్సాహికులు ఫారాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పౌల్ట్రీ వృద్ధికి దోహదపడడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కూడా మెరుగవుతుంది. జిల్లా ఇదీ పరిస్థితి జిల్లాలో కోళ్ల పరిశ్రమకు మంచి ఆదరణ ఉండడంతో పాటు రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాలలో ఎక్కువ సంఖ్యలో కోళ్ల ఫారాలు వెలిశాయి. కేవలం బ్రూడర్ కోళ్ల ఫారాలు సిద్దిపేటలో మాత్రమే ఉన్నాయి. మిగితా కొన్ని చోట్ల లేయర్స్ ఫారాలు ఉండగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బాయిలర్స్ ఫారాలను రైతులు నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకూ జిల్లా నుంచి కోళ్లు, గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ఇతర జిల్లాలకు సిద్దిపేట నుంచి పిల్లలను తరలిస్తున్నారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించడం పట్ల అందులో పని చేసే కూలీలు కూడా తమకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. -
పీపీపీకి సర్కార్ ప్రోత్సాహం
బాబు సర్కార్ కొత్త ఐటీ విధానం పారిశ్రామికవేత్తలకు రారుుతీలు, పన్ను మినహారుుంపులతో ఊతం రూ.30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2014-20 సంవత్సరాలకు కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమాభివృద్ధికి విధివిధానాలను, చర్యలను వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు, రాయితీలు ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పలనలో మెరుగైన విధానాలు అనుసరిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ విద్యకు బీజం వేయాలని భావించింది. 2020 సంవత్సరం నాటికి రూ.30 వేల కోట్లకు పైగా (5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు ఆకర్షించాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఐటీ సెక్టార్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 వేల కంపెనీలు, ఔత్సాహికులను తయారు చేయడం ఐటీ పాలసీ లక్ష్యం. 10 లక్షల చదరపు అడుగుల్లో ఐటీని అభివృద్ధి చేస్తారు. ఈ దిశగా 18 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విధానపత్రంలో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్ళలో రూ. 30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ హబ్‌లు, హార్డ్‌వేర్ పార్కులు, జోన్ లు ఏర్పాటు చేసి, ఏపీఐఐసీ పర్యవేక్షణలో మౌలిక వసతులను కల్పిస్తారు. ఐదేళ్ళ పాటు విద్యుత్ రాయితీలు, మరో ఏడేళ్ళపాటు అమ్మకం పన్ను మినహాయింపు ఇస్తారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తారు. వ్యాట్, రిజిస్ట్రేషన్ నుంచి మినహాయిం పు ఉంటుంది. మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ భూమిని షరతులకు లోబడి కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టులు ఐదేళ్ళలో కనీసం 2 వేల మందికి ఉపాధి కల్పించాలి. 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, 50 శాతం సబ్సిడీ అందిస్తారు. అనుమతులను సింగిల్ విడో పద్ధతిలో క్లియర్ చేస్తారు. గృహ సంబంధమైన ఐటీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మెగా ఎలక్ట్రానిక్ హబ్‌లు విశాఖపట్నాన్ని మెగా ఎలక్ట్రానిక్ హబ్‌గా గుర్తించారు. ఐటీ ఉత్పత్తుల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులన్నీ 4 వారాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. కాకినాడలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ను ఏర్పాటు చేసి, అవసరమైన ఉపకరణాలు తెప్పించుకునే వీలు కల్పిస్తారు. విజయవాడ, విశాఖపట్నంలలో కొత్తగా ఎలక్ట్రానిక్ బజార్లను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయాలని, అందులో కొత్త ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని ప్రతిపాదించారు. పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పలు దేశాల ప్రతినిధులను రప్పించి రోడ్ షోలు ఏర్పాటు చేస్తారు. ఐటీ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారు. 2017 నాటికి ఏటా 8 వేల మంది విద్యార్థులను ఐటీ రంగానికి అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. యూనివర్శిటీల్లోనూ ప్రత్యేక ఐటీ ప్రాధాన్యత గల కోర్సులను ప్రవేశపెడతారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాల్లో అన్యాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాల్లో అన్యాయం రాయితీకి నోచుకోని లబ్ధిదారులు లక్ష్యం పూర్తికి గడువు 30 రోజులే అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ విధానాలు నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి రుణాలిస్తామంటూ ఆశలు కల్పించి ఉసూరు మనిపించే దుస్థితి నెలకొంటోంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు రుణాల రాయితీని సర్కారు ప్రకటించింది. సమయం తక్కువగా ఉండడం.. బ్యాంకర్ల నిబంధనలు వంటి కారణాలతో లబ్ధిదారులకు రుణాలతో పాటు రాయితీ దక్కే అవకాశం లేకుండా పోయింది. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. బీసీ, ఎస్సీ, మైనార్టీ, వికలాంగ, సెట్విస్ శాఖలకు సంబంధించి 8,785 యూనిట్లకు ఇప్పటి వరకు కేవలం 2,034 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేశారు. వికలాంగులకు ఒక్కరికి కూడా రుణం ఇవ్వకపోవడం గమనార్హం. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వాస్తవానికి ఏటా ఏప్రిల్, మే నెలలోఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాలకు యూనిట్ల మంజూరు, నిధుల లక్ష్యం నిర్దేశించి మూడు నెలల్లో మంజూరు చేస్తుంటారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం రాయితీని ప్రకటించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. గతేడాది డిసెంబర్ వరకు ఎస్సీ, ఎస్టీలకు రుణ లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేదు. వారికిచ్చే రుణాల రాయితీపై కూడా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 3 నెలల ముందు అంటే డిసెంబర్ 31న ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలపై రూ.లక్ష వరకు రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిల్లోనూ పూర్తి స్థాయిలో స్పష్టత రాడానికి మరో రెండు వారాలు పట్టింది. దీందో ఆయా శాఖల అధికారులు జనవరి మూడో వారం నుంచి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. లక్ష్యాలను చేరుకోడానికి జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు రెండేసి మండలాల్లో పర్యటించి అవగాహన కార్యక్రమాలతో పాటు లబ్ధిదారుల గుర్తింపును చేపట్టారు. సమయం తక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 25 శాతమే పూర్తి చేయగలిగారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోగా పదుల సంఖ్యలో లబ్ధిదారులకు మాత్రమే మేలు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మహిళల ఆర్థిక స్వావలంభనకు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, స్క్రీన్ప్రింటింగ్, ఇలా అన్ని స్వయం ఉపాధి పనులకు రుణాలివ్వనున్నారు. ఈ పథకం కింద జిల్లాలో 200 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. భర్తను కోల్పోయి, నిరాశ్రయులు, సాంఘిక అరాచకాలకు గురైన, ఎయిడ్స్ బాధిత, పెదరికంలో ఉన్న మహిళలకు ఈ పథకం ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో మండలంలో ఐదుగురు మహిళలకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్యాంకర్ల దయతోనే.. ఏదైనా వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా.. లబ్ధిదారులుగా అధికారులు గుర్తించినా.. రుణం మంజూరు కావాలంటే బ్యాంకర్ల మీదే ఆధారపడాలి. తక్కువ సమయంతో లబ్ధిదారులను గుర్తిస్తున్నా.. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రికవరీలను దృష్ట్యా పూర్తి విశ్వాసం కలిగితేనే రుణమిచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ కారణం వల్ల కూడా కొంత జాప్యం జరుగుతోంది. -
రేషన్‌కూ ఆ‘ధారే’
సాక్షి, ఏలూరు:సబ్సిడీలకు ఆధార్ కార్డుతో లింకు పెట్టొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలి చ్చినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. నిన్నటివరకూ సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లకు ఆధార్ కార్డుతో లింకు పెట్టిన ప్రభుత్వం తాజాగా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా ఆధార్ నంబర్‌ను రేషన్ కార్డుతో అనుసంధానం చేయించుకుని తీరాలనే నిబంధన విధించింది. లేదంటే తెల్ల రేషన్ కార్డుపై ఇచ్చే బియ్యం కోటాలో కోత విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డులో నమోదై ఉండే కుటుంబ సభ్యులంతా ఆధార్ కార్డు కాపీలు సమర్పించాలని ఆదేశాలి చ్చారు. ఏదైనా కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్ నంబర్ ఇవ్వకపోరుునా వచ్చేనెల కోటాలో సంబంధిత వ్యక్తికి బియ్యం ఇవ్వరు. నిజానికి ఈ విధానాన్ని జనవరి నుంచే అమలు చేయూలని భావించినప్పటికీ సంక్రాంతి రోజులు కావడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వెనక్కు తగ్గారు. ఈ దృష్ట్యా జనవరినెలాఖరు వరకూ ఆధార్ సమర్పించేందుకు గడువు ఇచ్చారు. ఆలోగా స్థానిక చౌక దుకాణంలో ఆధార్ కార్డు నకలు అందించాలని సూచిస్తున్నారు. వచ్చే నెలలో రేషన్ బియ్యూనికి మాత్రమే పరిమితం చేసిన ఆధార్ అనుసంధానాన్ని ఆ తరువాత నుంచి అన్ని సరుకులకు అమలు చేస్తారు. పండగ కోటా లేనట్టే సంక్రాంతి పండగకు ఈసారి కూడా అదనపు కోటా ఇవ్వడం లేదు. పెద్ద పండగగా పిలిచే సంక్రాంతికి సాధారణ కోటా సరిపోదు. ఈ పరిస్థితుల్లో పేదలకు అదనపు కోటాగా నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అదనపు కోటాపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రెండేళ్ల క్రితం వరకూ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు రేషన్ కోటాలో కొన్ని సరుకులు అధికంగా ఇచ్చేది. పంచదార అరకేజీ ఇవ్వాల్సి ఉండగా, మరో అరకేజీ అదనంగా ఇచ్చేవారు. అదేవిధంగా పామాయిల్ కేజీ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా మరో కేజీ అదనంగా ఇచ్చేవారు. గతేడాది ఈ ఆనవాయితీని తప్పించారు. ఈ ఏడాదైనా ఇస్తారనుకుంటే మళ్లీ నిరాశే మిగింది. అసలు కోటా అయినా ఎప్పుడిస్తారో జిల్లాకు 11 లక్షల 38 వేల లీటర్ల పామాయిల్ అవసరం కాగా, అందుకోసం 22వేల 88 మంది డీలర్లు ప్రతినెలా డీడీలు తీస్తున్నారు. గత డిసెంబర్‌లోనూ డీడీలు తీశారు. కానీ ప్రభుత్వం పామాయిల్ కంపెనీలకు సబ్సిడీ మొత్తం చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రేషన్ కార్డులపై పామాయిల్ పంపిణీని నిలిపివేశారు. దానికోసం సొమ్ముకట్టిన డీలర్లు వడ్డీ నష్టపోయారు. సబ్సిడీపై లీటర్ పామాయిల్ రూ.40కి రేషన్ డిపోల ద్వారా ఇస్తుండగా, బహిరంగ మార్కెట్లో రూ.65 పలుకుతోంది. గత నెల దీనిని పంపిణీ చేయకపోవడంతో11.22లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు రూ.2.80 కోట్ల మేర నష్టపోయారు. సంక్రాంతి దృష్ట్యా ఈనెలలో సాధారణ కోటా కింద కార్డుకు కిలో చొప్పున పామాయిల్ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. పండగ రోజులు దగ్గర పడుతున్నా నేటికీ రేషన్ డిపోలకు ఆ ప్యాకెట్లు చేరుకోలేదు. ‘అమ్మహస్తం’ సరుకులు సిద్ధం: జనవరి కోటా ‘అమ్మహస్తం’ సరుకులు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పంచదార 560 టన్నులు, గోధుమలు, గోధుమపిండి 350 టన్నులు, చింతపండు 90 నుంచి 120 టన్నులు, పసుపు 20 టన్నులు. కందిపప్పు 600 టన్నులు సిద్ధంగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10 నుంచి వీటిని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. 1,776కిలో లీటర్ల కిరోసిన్‌ను ఈ నెలలో పంపిణీ చేయనున్నారు. ఇటీవల కూపన్లు పొందిన వారికి కిరోసిన్ మినహా మిగతా సరుకులు అందించనున్నారు. 15 వేల టన్నుల బియ్యం విడుదలకాగా, ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు.