నిధులు నేరుగా ఇవ్వండి: యనమల
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేసి నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలపడితేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజనల ఏపీ నష్టపోయినందున ఎక్కువగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని వాగ్దానాల అమలుకు బడ్జెట్ లో తగినంత నిధులు ఇవ్వాలని యనమల అన్నారు.