జనస్రవంతిలో కలవండి
{పభుత్వపరంగా సాయం
లొంగని దళ సభ్యులను అరెస్ట్ చేస్తాం
జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్
విశాఖపట్నం: లొంగిపోయే మావోయిస్టు మిలీషియా సభ్యులకు ప్రభుత్వ పరంగా రాయితీలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. అలా కాకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన గాలికొండ దళం సభ్యుడు పంగి భాస్కరరావు అలియాస్ సూర్యం(22), పోలీసులకు లొంగిపోయిన కలిమెల దళం సభ్యురాలు కొర్రా శాంతి అలియాస్ రత్నం(22), మరో 11మంది మిలీషియా సభ్యులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిలీషియా సభ్యులు జనస్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. గాలికొండ దళ సభ్యుడు పంగి భాస్కరరావును వేకువజామున పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. కొర్రా శాంతి 2012 నుంచి 2013 వరకు కలిమెల దళంలో కీలక సభ్యురాలిగా పనిచేస్తున్నదన్నారు. రెండు కరువుదాడుల్లో ఆమె నిందితురాలని చెప్పారు. అనారోగ్యంతో ఉన్నందున లొంగిపోయిందని తెలిపారు. ఆమెతో పాటు మిలీషియా సభ్యులు జెమ్మిలి రవి అలియాస్ రవి(23), వంతల చిట్టిబాబు అలియాస్ చిట్టి(24), తంబేలు అర్జున్ అలియాస్ సన్యాసిరావు(20), పంగి సాంబశివ అలియాస్ సాంబ(20), జెమ్మిలి సుందరరావు అలియాస్ అప్పారావు(24), జెమ్మిలి భీమరాజు అలియాస్ భీమ(20), జెమ్మిలి భాస్కరరావు అలియాస్ కేశవరావు(22), పంగి బాలకష్ణ అలియాస్ బాలయ్య, తంబేలు చిన్నరావు అలియాస్ చిన్నయ్య(22), జెమ్మిలి సుబ్బరావు అలియాస్ బందునాయుడు(42) స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు.
పంగి భాస్కరరావు కార్యకలపాలు..
అరెస్టు చేసిన పంగి భాస్కరరావు పలు కేసుల్లో నిందితుడని ఎస్పీ తెలిపారు. జీకే వీధి మండలం పెద్దవలస కాఫీగోడౌన్ పేలుడు కేసు,లక్కవరపు కోటకు చెందిన కె.రాజు హత్య కేసు, లక్కవరపుకోట సర్పంచ్ బాబూరావు ఇంటిపై కరువుదాడి కేసు, లక్కవరపు కోటకు చెందిన కె.రాజబాబు హత్య కేసు, కంకుమపూడిలో కొర్ర నారాయణరావు ఇంటిపై కరువుదాడి, కంటిపాటి సోమలింగంపై హత్యాయత్నం కేసు, ఏపీఎఫ్‌డీసీ క్వార్టర్లు తగలపెట్టిన కేసు, చాపగెడ్డ బ్లాస్టింగ్, జెమ్మిలి చిన్నారావు హత్య కేసు, చింతపల్లి మండంలో సుబ్బరావు ఇంటిపై కరువు దాడి, రాంబాబు, రాము, చెరువుపాకలు కాఫీ ఎస్టేట్‌లో దాడి, సిందిరి కార్ల హత్య కేసు, సంజీవరావు హత్య, కొయ్యూరులో జరిగిన సిందిరి పాత్రో హత్య కేసు, పెద్ద వలస పేలుడు కేసుల్లో పంగి భాస్కరరావు నిందితుడని తెలిపారు. ఒడిశాలో ఇటీవల జరిగినఎన్ కౌంటర్‌లో ఎందరు దళసభ్యులు చనిపోయింది అధికారకంగా తెలియదన్నారు. బలిమెల జలాశయంలో మృతదేహాలు గల్లంతవ్వడంతో గుర్తిం చలేకపోయామన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించందన్నారు.
దళ సభ్యులు లొంగిపోతే అరెస్ట్ చేయం
Published Wed, Jan 14 2015 12:09 AM | Last Updated on Tue, Oct 9 2018 2:40 PM
Advertisement
Advertisement