
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖకు ఈ యేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది రూ.202 కోట్ల మేర బడ్జెట్‌లో కోత పెట్టారు. గతేడాది బడ్జెట్‌లో బియ్యం సబ్సిడీలు కలుపుకొని మొత్తంగా రూ.2,946 కోట్లు కేటాయించగా, ఈ యేడాది రూ.2,744 కోట్లు కేటాయించారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సైతం సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని గత ప్రభుత్వంలో ఆలోచనలు సాగినా.. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు, నిధులూ కేటాయించలేదు.
ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికిరూ.26,408 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికోసం కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2019–20లో రూ.26,408 కోట్లు చొప్పున కేటాయింపులు జరిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,581 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,827 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఎస్సీఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ.128.21 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌కు అదనంగా రూ. 133.89 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం మిగులు నిధులను క్యారీఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వార్షిక సంవత్సరం ఖర్చులు తేలిన తర్వాత నిధులను క్యారీఫార్వర్డ్ చేసే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment