రాయితీలొస్తాయని ఎక్కడుంది?
హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్న
ఉంటే నాకు చూపించండి.. పోరాడుతా?
మీకంటే నాకు ఆత్మగౌరవం ఎక్కువుంది
హోదాకు, రాయితీలకు సంబంధం లేదు
డబ్బులిచ్చి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు
ఆందోళనలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది
సాక్షి, అమరావతి: ‘ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీఓలో ఉందో చూపించండి.. నేను పోరాడుతా. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యా నించారు. హోదాపై తప్పుడు ప్రచారం చేసి అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శిం చారు. ఆయన బుధవారం వెలగపూడి సచివాల యంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జల్లికట్టుకి, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మనవాళ్లు కోడి పందేలు ఆడేశారని, దానికి అనుమతి కూడా లేదని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు ఆర్డినెన్స్ జారీ చేయగా, కేంద్రం దానికి కన్సెంట్ ఇచ్చిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో కలపాలని, లేకపోతే ప్రమాణస్వీకారం కూడా చేయనని ప్రధానికి చెప్పానని, అందుకే మొదట ఆర్డినెన్స్ తెచ్చారని చెప్పుకొచ్చారు.
విలేకరులు హద్దుల్లో ఉండాలి
ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో తనను ఎడ్యుకేట్ చేయాలని చంద్రబాబు అన్నారు. ఏమన్నా అంటే ఆత్మ గౌరవం అంటున్నారని, ఆత్మగౌరవం అందరి కంటే తనకే ఎక్కువ ఉందని చెప్పారు. ఈ సమయంలో విలేకరులు గట్టిగా ప్రశ్నించడంతో అసహనం వ్యక్తం చేస్తూ లిమిట్స్(హద్దు)లో ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఆందోళనకు మద్దతు ప్రకటించడంపై స్పంది స్తూ... ఒక్కో వ్యక్తికి ఒక్కో ఆలోచన ఉంటుందని, రాజకీయ వ్యూహాలుంటాయని చెప్పారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం డబ్బు లిచ్చి యువకులను రెచ్చగొడుతున్నారని ఆరో పించారు. విశాఖలో జరిగే ఆందోళనలపై స్పందిస్తూ.. చట్టాన్ని అందరూ అనుసరించా లని, అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయకూడదన్నారు. తునిలో ఇలాగే చేశారని ఆయనను (ముద్రగడ పద్మనాభం) మళ్లీ వైఎస్సార్‌సీపీ నేతలు కలుస్తున్నారని చెప్పారు. వీటన్నింటినీ తాను చూస్తూ ఊరుకో నని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టం దాని పని అది చేస్తుందన్నారు. కావాలంటే అనుమతి తీసుకుని సమావేశాలు పెట్టుకోవాలన్నారు. వీళ్లకు ప్రొసీజర్ తెలుసా? ఇంట్లో కూర్చొని ఇష్టాను సారంగా చేసి దొరికిపోయారని ప్రతిపక్ష నేతపై పరోక్ష విమర్శలు చేశారు. తాను నిబద్ధతతో పనిచేస్తున్నానన్నారు. తాను కష్డపడితే ఐదు కోట్ల మందికి వెసులుబాటు ఉంటుందన్నారు. తాను అందరిలో నమ్మకాన్ని సృష్టించానని, దాన్ని చెరగొట్టడానికి ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. తనపై నమ్మకం ఉంచాల ని కోరారు.