విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై బంపర్‌ ఆఫర్‌....! | Joy Electric Scooter Subsidy For Students From Class 9 | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై బంపర్‌ ఆఫర్‌....!

Published Wed, Jul 28 2021 6:21 PM | Last Updated on Wed, Jul 28 2021 6:45 PM

Joy Electric Scooter Subsidy For Students From Class 9 - Sakshi

గాంధీనగర్: ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి పలు ప్రభుత్వాలు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఫేమ్‌-2 విధానానికి సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీగా సబ్సీడిలను అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు మెరుగుపర్చడం కోసం వ్యక్తిగత రాయితీలను ప్రకటించింది. జాయ్‌ ఈ-బైక్‌పై సబ్సిడీ కార్యక్రమానికి గుజరాత్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజేన్సీ (జీఈడీఏ) ఆమోదం తెలిపింది.

జాయ్‌ ఈ-బైక్స్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధరలపై సుమారు 12 వేల సబ్సిడీను గుజరాత్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఈ సబ్సిడీ కేవలం గుజరాత్‌లో చదువుకునే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు వర్తించనుంది. జాయ్‌ ఈ-బైక్స్‌ శ్రేణిలోని జెన్‌ నెక్ట్స్‌, వోల్ఫ్‌, గ్లోబ్‌, మాన్‌స్టర్‌ వేరియంట్‌లకు ఈ సబ్సిడీ లభించనుంది.   

జాయ్ ఈ-బైక్ ఫీచర్స్‌

  • బ్యాటరీ టైప్‌- 74 V, 25Ah/30Ah, లిథియం అయాన్ బ్యాటరీ
  • హబ్ మోటార్ ఆర్‌పీఎమ్‌- 100 - 375 ఆర్‌పీఎమ్‌ 
  • టాప్ స్పీడ్- 25 కి.మీ.
  • పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు పట్టే సమయం- 4 నుంచి 4.5 గంటలు
  • ఫుల్‌ ఛార్జింగ్‌తో సుమారు 75 కిలోమీటర్ల ప్రయాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement