జిల్లాలో నాబార్డు ద్వారా ఆర్‌ఐడిఎఫ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబరులో నాబార్డు ద్వారా ఆర్‌ఐడిఎఫ్ పనుల ప్రగతిని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్, గిరిజన సంక్షేమ శాఖలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకూ రు.373 కోట్లతో 228 ప్రాజెక్టులను చేపట్టామని అవి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు.
నాబార్డు పనులు వేగవంతం చేయాలి
Published Wed, Nov 2 2016 6:52 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో)
జిల్లాలో నాబార్డు ద్వారా ఆర్‌ఐడిఎఫ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబరులో నాబార్డు ద్వారా ఆర్‌ఐడిఎఫ్ పనుల ప్రగతిని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్, గిరిజన సంక్షేమ శాఖలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకూ రు.373 కోట్లతో 228 ప్రాజెక్టులను చేపట్టామని అవి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఆర్‌అండ్‌బి ద్వారా చేపట్టిన పనులను సమీక్షిస్తూ 6 నెలల నుండి ఎటువంటి ప్రగతి లేదనీ, వారం, వారం అడిగితే పనులు ఇంకా మొదలు కాలేదని టెండర్లు స్టేజిలో ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఇదే కొనసాగితే ఇకపై ఆర్‌అండ్‌బి శాఖకు నాబార్డు ద్వారా పనులను ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారు. ప్రతిపాదనలు అనుమతి కోసం ప్రభుత్వం వద్ద పెడింగ్‌లో ఉన్నాయని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల చెప్పగా కలెక్టరు ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని నాబార్డు డిజిఎం రామప్రభును ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఎర్రకాలువ, తమ్మిలేరు పనులను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ డిఇను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement