సాక్షి, హైదరాబాద్: సాగునీరు, వ్యవసాయ రంగాలతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కారణంగా తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా ఎదుగుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం గురువారం ఆన్‌లైన్ విధానంలో జరిగింది. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచి ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, చేపలు, గొర్రెల పంపిణీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్లడం సంతోషకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ ప్యాకేజ్ ఆత్మనిర్భర్ భారతాన్ని సాకారం చేసే దిశలో వ్యవసాయ రంగాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు.
కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డులు, ఇతర సంస్కరణలు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత సాధించినా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూసారానికి, పర్యావరణానికి హాని కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ సుస్థిరతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో కూడిన వ్యవసాయం కారణంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా సంప్రదాయ విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికతలతో అనుసంధానం చేయాలని సూచించారు. దేశంలో పోషకాహార లోపం లేని విధంగా సమతుల పంటల సాగు ప్రణా ళికలు అమలు చేయాలని తెలిపారు. పప్పు లు, చిరు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పండించాలని, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా పండించటం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని గవర్నర్ వివరించారు.
రైతుబంధు ఓ ట్రెండ్ సెట్టర్: నాబార్డు చైర్మన్ గోవిందరాజులు
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డు చైర్మన్ గోవిందరాజులు చింతల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఓ ట్రెండ్ సెట్టర్ అని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో ప్రభుత్వం సమర్థ నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తోందని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు, పశుపోషణను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అభినందించారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో హైటెక్ సాగు వి ధానాలను అవలంభించాల్సిన అవసరముం దన్నారు. పరిశోధనలకు గాను వ్యవసాయ వర్సిటీకి నాబార్డు నుంచి తగిన ఆర్థిక సా యం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజులుకు వర్సిటీ తరఫున ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ను ప్రదానం చేశారు. మొత్తం 12 మంది విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో, 10 మందికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో బంగారు పతకాలను, 30 మంది స్కాలర్స్‌కు పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని మేడిశెట్టి అనూహ్య కు ఔట్‌స్టాండింగ్ గోల్డ్‌మెడల్, కోమటిరెడ్డి భార్గవికి మూడు, ప్రవల్లిక అనే విద్యార్థినికి రెండు బంగారు పతకాలు లభించాయి. వ్య వసాయ వర్సిటీ వైస్‌చాన్సలర్ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.
నాబార్డు చైర్మన్‌కు ‘గ్రామోదయ బంధు మిత్ర’
నాబార్డు చైర్మన్ గోవిందరాజులు కు మరో అవార్డు లభించింది. గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టె క్నాలజీ (జీసీవోటీ) ఇటీవలే ప్రకటించి న ‘గ్రామోదయ బంధు మిత్ర పురస్కారం’ఆయనకు ప్రదానం చేశారు. గురువారం వ్యవసాయ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రవీణ్‌రావు.. గోవిందరాజులుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. జీసీవోటీ వ్యవస్థాపకులు ఢిల్లీ వసంత్, సీఈవో ఎం.శ్రవణ్, సలహాదారులు దోనేపూడి చక్రపాణి, పులిజాల రాంచం దర్‌తో పాటు నాబార్డు తెలంగాణ సీజీఎం వైకె.రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment