సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది.
కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment