ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు | Irrigation Minister harish rao went delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు

Published Tue, Sep 6 2016 8:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు

ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్:  తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.  ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ ఒప్పంద కార‍్యక్రమానికి జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో పాటు టీ.సర్కార్ తరపున హరీశ్ రావు హాజరు అవుతున్నారు.

దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. అలాగే కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీశ్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి వెంట అధికార బృందం కూడా ఢిల్లీ వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement