2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్‌పై ఓ వాల్ క్యాలెండర్‌ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్‌వర్క్‌తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్‌ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది.
ఈ క్యాలెండర్‌లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్‌లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment