మంచినీటి ల్యాబ్‌లలో ఉద్యోగుల తొలగింపునకు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు
తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు
20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఎలా తొలగిస్తారంటూ ఉద్యోగుల ఆందోళన
ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద నిరసన ప్రదర్శన
ఆ ఉద్యోగులకు తొలిసారి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించిన జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల్లో పనిచేసే చిరుద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం చూపిస్తున్నారు. 15–20 ఏళ్లగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పనిచేస్తున్న తమను తొలగించడానికి వీలు లేదని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు మెమో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక కొంత మంది అధికారులు కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో 111 వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండగా.. వాటిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారికి ఉండే కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొదట్లో ఆయా ల్యాబొరేటరీస్‌లో పనిచేసే వారికి వర్తించేవి కావు. అయితే గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించారు.
ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఆయా ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి్పడి చేసే ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వంలో మొదలవగా, ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆరి్థక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15–20 ఏళ్లుగా ఉన్న తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడడంపై రాష్ట్రవ్యాప్తంగా వారు ఆందోళన బాట పట్టారు.
పవన్ ఇంటి ముందు ప్రదర్శన..
ఉద్యోగుల తొలగింపునకు అధికార కూటమి పార్టీ ల ఎమ్మెల్యేల రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వచి్చన ఉద్యోగులు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు.
‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కలి్పంచాలి, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్‌కళ్యాణ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.. సమస్యను పవన్, అధికారుల దృష్టికి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడ నుంచి వెనుతిరిగారు. గత ఐదేళ్లూ నీటి శుద్ధి పరీక్షల్లో ఏపీనే టాప్..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో కలుíÙతాలు గుర్తిస్తే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మన రాష్ట్రం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే టాప్‌గా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ముందు, తర్వాత స్థానిక పంచాయతీ సిబ్బంది లేదంటే శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి వాటిని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాబొరేటరీల్లో పరీక్షించారు.
గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలో ఉండే తాగునీటి వనరులకు సైతం 97 శాతం పైబడి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షల్లో గత ఆరి్థక ఏడాదిలో మన రాష్ట్రంలో 25,546 చోట్ల కలుíÙత నీటిని గుర్తించగా, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment