small
-
చిరుద్యోగులపై సర్కార్ పగ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల్లో పనిచేసే చిరుద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం చూపిస్తున్నారు. 15–20 ఏళ్లగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పనిచేస్తున్న తమను తొలగించడానికి వీలు లేదని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు మెమో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక కొంత మంది అధికారులు కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో 111 వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండగా.. వాటిలో ఔట్సోర్సింగ్ విధానంలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారికి ఉండే కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొదట్లో ఆయా ల్యాబొరేటరీస్‌లో పనిచేసే వారికి వర్తించేవి కావు. అయితే గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించారు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఆయా ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి్పడి చేసే ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వంలో మొదలవగా, ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆరి్థక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15–20 ఏళ్లుగా ఉన్న తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడడంపై రాష్ట్రవ్యాప్తంగా వారు ఆందోళన బాట పట్టారు. పవన్ ఇంటి ముందు ప్రదర్శన.. ఉద్యోగుల తొలగింపునకు అధికార కూటమి పార్టీ ల ఎమ్మెల్యేల రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వచి్చన ఉద్యోగులు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కలి్పంచాలి, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్‌కళ్యాణ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.. సమస్యను పవన్, అధికారుల దృష్టికి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడ నుంచి వెనుతిరిగారు. గత ఐదేళ్లూ నీటి శుద్ధి పరీక్షల్లో ఏపీనే టాప్..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో కలుíÙతాలు గుర్తిస్తే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మన రాష్ట్రం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే టాప్‌గా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ముందు, తర్వాత స్థానిక పంచాయతీ సిబ్బంది లేదంటే శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి వాటిని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాబొరేటరీల్లో పరీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలో ఉండే తాగునీటి వనరులకు సైతం 97 శాతం పైబడి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షల్లో గత ఆరి్థక ఏడాదిలో మన రాష్ట్రంలో 25,546 చోట్ల కలుíÙత నీటిని గుర్తించగా, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. -
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
చిన్న ప్యాక్స్ ఎత్తుగడ, దూసుకుపోతున్న వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, స్నాక్స్, సబ్బులు, టీ, కాఫీ పొడులు.. ఇలా ఉత్పాదన ఏదైనా మారుమూల పల్లెల్లోని దుకాణాల్లో రూ.1, రూ.2, రూ.5, రూ.10 ధరలో లభించే చిన్న ప్యాక్‌లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఉత్పాదనను వినియోగదారుడికి అలవాటు చేయడం, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇలా చిన్న ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇటువంటి చిన్న ప్యాక్‌లు ఇప్పుడు ప్రధాన నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక రిటైల్ ఔట్లెట్లు, ఆన్లైన్ వేదికల్లోనూ ఇవి చొచ్చుకువచ్చాయి. ఇందుకు రిటైల్ ద్రవ్యోల్బణం కారణమని ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలు చెబుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అధికంగా ఉండడంతో భారత్‌లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం నమోదైంది. దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ 2020లో రూ.9.1 లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రెండింతలు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగం పెరిగేందుకు.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమ 2022 అక్టోబర్-డిసెంబర్లో 7.6 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 9.2 శాతంగా ఉంది. నిత్యావసరాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ప్రముఖ తయారీ కంపెనీలు చిన్న ప్యాక్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ ధరలో లభించే చిన్న బ్రాండ్స్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల వైపు కస్టమర్లు మళ్లకుండా పెద్ద బ్రాండ్లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం నెలవారీ చేసే ఖర్చులపై ఒత్తిడి ఉండడం కూడా మరో కారణం. ముడిసరుకు వ్యయాలు పెరుగుతుండడంతో కంపెనీలు ప్యాక్ బరువు తగ్గించడం లేదా ధర పెంచడమో చేస్తున్నాయి. ధర పెంచిన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వినియోగం పెరిగేందుకు చిన్న ప్యాక్‌లను కొనసాగించాల్సిందేనని రిసర్చ్ కంపెనీ నీల్సన్ఐక్యూ తెలిపింది. ఆహారేతర విభాగాల్లో ఇవి డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది. విక్రయాల్లో 50 శాతం దాకా.. చిన్న ప్యాక్‌ల వాటా మొత్తం అమ్మకాల్లో కంపెనీని బట్టి 50 శాతం వరకు ఉందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాల్లో మొత్తం విక్రయాల్లో చిన్న ప్యాక్‌ల వాటా 5 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. మొత్తం సేల్స్‌లో చిన్న ప్యాక్‌ల వాటా ఏకంగా 50 శాతం ఉందని పార్లే ప్రొడక్ట్స్ వెల్లడించింది. నగరాల్లో గడిచిన రెండు మూడు నెలల్లో పెద్ద ప్యాక్‌లకు బదులుగా చిన్న ప్యాక్‌ల విక్రయాలే అధికంగా ఉన్నాయని కంపెనీ సీనియర్ కేటగిరీ హెడ్ మాయంక్ షా తెలిపారు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు. సాధారణంగా ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అని చెప్పారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌ల వైపు మార్కెట్ మళ్లుతోందని సుస్పష్టం అవుతోందని విప్రో కంజ్యూమర్ కేర్ చెబుతోంది. ద్రవ్యోల్బణం ప్రధాన సవాల్‌గా ఉందని కోకా-కోలా ఇండియా తెలిపింది. ఇతర విభాగాల్లోనూ.. మిల్క్, న్యూట్రీషన్ విభాగాల్లో అందుబాటు ధరలో ప్యాక్‌లను పరిచయం చేయాలని దిగ్గజ సంస్థ నెస్లే నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీ కెచప్, చాకొలేట్స్, కాఫీలో చిన్న ప్యాక్స్‌ను విక్రయిస్తోంది. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని బ్రాండ్స్‌లో అందుబాటు ధరలో విక్రయించేందుకు చిన్న ప్యాక్‌లు దోహదం చేస్తున్నాయి. చిన్న ప్యాక్‌లు లక్ష్యంగా ఇతర విభాగాల్లో విస్తరిస్తున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది’ అని కోక–కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే తెలిపారు. పెప్సి, మిరిండా, మౌంటెయిన్ డ్యూ సింగిల్ సర్వ్ బాటిల్స్ అమ్మకాలు ఇతర ప్యాక్‌లను మించి నమోదయ్యాయి. గెలాక్సీ, స్నిక్కర్స్, ఎంఅండ్ఎం బ్రాండ్ల చాకొలేట్లను విక్రయిస్తున్న మార్స్ రిగ్లీ రూ.10 ధరలో లభించే ప్యాక్‌లను నగరాల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రమే ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ, ధర నిర్ణయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
ఐకామ్ ప్లాంటులో కారకల్ ఆయుధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది. -
ఈ విద్యార్థులకేమైంది!
ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే విద్యార్థులు విషాద గీతికలను ఆలపిస్తున్నారు. గోరంతలను కొండంతలుగా ఊహించుకుని ఊపిరి తీసుకుంటున్నారు. చిన్న విషయానికే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రు అశనిపాతంలా పరిణమిస్తున్నాయి. మంగళవారం నాగోల్‌లో 6వ తరగతి విద్యారి్థని వర్షిత అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మరువకముందే గురువారం సైదాబాద్‌లో ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఓల్బోయిన్పల్లిలో పన్నెండో తరగతి చదువుతున్న బాలిక పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వ్యూస్ రావడం లేదని.. సైదాబాద్: ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రాంతినగర్‌లోని ఆదర్శ్ అపార్టుమెంట్స్‌లో నివసించే చంద్రశేఖర్ రైల్వే ఉద్యోగి. అతని భార్య కేంద్ర రక్షణ రంగ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుమారుడు ధీనా (23) గ్వాలియర్‌లో ట్రిపుల్ ఐటీ ఫైనలియర్ చదువుతున్నాడు. గురువారం తెల్లవారుజామున ధీనా నగరంలోని తాము నివసించే రెండో అంతస్తు నుంచి అపార్టుమెంట్ అయిదో అంతస్తు పైకి చేరుకొని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధీనా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడని తెలుస్తోంది. అతను సెల్ఫో పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. తనకు తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శనం లేదని, తన యూట్యూబ్ చానల్‌కు వీక్షకులు తగ్గుతున్నారని భావించేవాడు. తన వీడియోలకు స్పందన కూడా సరిగా రావడం లేదని మనస్తాపం చెందుతున్నాడని సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన తెలిపారు. తనకు జీవితంపై విరక్తి కలుగుతోందంటూ ఆత్మహత్యకు ముందు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. విదేశాలకు పంపించలేదని.. కంటోన్మెంట్: స్కూలు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ విద్యార్థిని. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ జయచంద్రా రావు కుమార్తె స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది. గురువారం స్కూలు రెండో అంతస్తు పైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్కూలు యాజమాన్యం వెంటనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక సోదరుడు కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా, తాను కూడా అక్కడే చదువుకుంటానని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు వారించగా, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడానికి ముందు తన తండ్రికి సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. వర్షిత ఆత్మహత్యపై విచారణ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వర్షిత (12) కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని గురువారం ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. చిన్నారి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి పరిసరాల్లో ఉండే వారిని విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం వచ్చిందని తెలిపారు. (చదవండి: ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం: కేటీఆర్) -
చిన్న ప్యాకెట్.. సూపర్‌హిట్!
న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి. తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ. వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి. మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్.. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం బిజోమ్ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది. అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అబనీష్ రాయ్ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు. -
ప్రపంచంలోనే అతి చిన్న 4జీ స్మార్ట్‌ఫోన్..! ధర ఏంతంటే..?
Mony Mint World Smallest 4G Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న 4జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన మోనీ మింట్ రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏటీఎమ్ కార్డు సైజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ మూడు అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు 150 డాలర్లు(సుమారు రూ. 11,131) గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తోందనే విషయం కంపెనీ తెలపలేదు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికా, యూరోపియన్ నెట్వర్క్ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. మోనీ మింట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ 1,250mAh పాలిమర్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 854*450 రిసల్యూషన్ డిస్ప్లే 1.5గిగా హెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఎక్సపాండబుల్ అప్టూ 128 జీబీ డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ -
ఉపాధికి ఎసరు
– జైల్‌రోడ్డులో చిరువ్యాపారులపై నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రతాపం – రోడ్డు పక్కల వ్యాపారాలు చేయకూడదంటూ హుకుం – ఆశీల దోపిడీ ఆపాలని కోరిన చిరువ్యాపారులు – అది పట్టించుకోకుండా బడుగుజీవుల ఉపాధిపై వేటు – వైఎస్సార్సీపీ నేతల జోక్యంతో ఊరట సాక్షి, రాజమహేంద్రవరం: కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఉంది నగరంలోని బడుగుజీవుల పరిస్థితి. తమ వద్ద ఆశీలు కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ సరిహద్దులు దాటి వచ్చి మరీ రోజుకు రూ. 20 నుంచి రూ. 40లు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీ ఆపాలని కోరిన చిరు వ్యాపారులకు నగరపాలక సంస్థ యంత్రాంగం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నగరంలోని వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు ఉన్న జైల్ రోడ్డుకు ఇరు వైపులా చిరు వ్యాపారులు సైకిళ్లు, మోటారు సైకిళ్లు, బుట్టలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా కోరుకొండ రోడ్డు, ఏవీ అప్పారావు, జేఎన్ రోడ్డు, పేపర్ మిల్లు రోడ్డులు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. జైల్ రోడ్డులో దాదాపు 200 మంది బడుగు జీవులు పుచ్చకాయ, బొప్పాయి, తాటిముంజలు, సపోటా తదితర ఫలాలు అమ్ముకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో పది మంది వికలాంగులు కూడా ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి ఉపాధి చూపకపోయినా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఈ తరహా వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయకూడదని హడలెత్తిస్తున్నారు. ‘ఈ రోడ్డు రాజవీధి లాంటిది. ఎంతో మంది రాజులు (వీఐపీలు) ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటార’నే కారణం చెబుతూ హడావుడి చేస్తున్నారు. రాజధానుల్లో లేని నిబంధనలు ఇక్కడా...? వీఐపీలు తిరిగే ఈ రహదారిలో చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటే తప్పేంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదారాబాద్‌లో, విజయవాడలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చీపోయే సచివాలయం ఎదుట, దేశ, విదేశాల యాత్రికులు సందర్శించే ట్యాంక్ బండ్‌పైన చిరుతిళ్ల బండ్లు, షోడా బండ్లు, జామ, పుచ్చకాయల వ్యాపారాలు చేసుకుంటూ వందలాది మంది జీవిస్తుంటారు. సచివాలయం, ట్యాంక్బండ్లు నగరంలోని జైల్‌రోడ్డు కంటే ప్రాముఖ్యమైనవి కాదా?, అక్కడ బడుగు జీవులు చిరువ్యాపారాలు చేసుకుని బతుకుతుండగా లేనిది ఇక్కడ విచిత్ర నిబంధనలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఆశీలు కాంట్రాక్టర్లు నగరంలో దొరికినకాడ దొరికినట్లు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుంటే పట్టించుకోని యంత్రాంగం తమ ఉపాధిని పోగొట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ జోక్యంతో బడుగుజీవులకు న్యాయం.. తమకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు చిరువ్యాపారులు విన్నవించుకున్నారు. బుధవారం వైఎస్సార్సీపీ నేతలు కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్‌రావు తదితరులు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
మినిమమ్ బ్యాలెన్స్ పై ఎస్బీఐ గుడ్ న్యూస్
ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్బీఐ అంతకమునుపు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా అకౌంట్ల పరిస్థితేమిటి? అని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలపై ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం స్పందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. అంతేకాక, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే ఛార్జీలు వేస్తామని తెలిపింది. ఈ ప్రభావం పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ప్రభావం చూపనుందని తెలిసింది. Account holders of the following types of accounts are exempt from requiring to maintain an average monthly balance: pic.twitter.com/61U8QNu7xR — State Bank of India (@TheOfficialSBI) April 11, 2017 -
స్వర్ణ విహంగం
శ్రీనివాస్ మరో అద్భుత సృష్టి 2.700 మి.గ్రా. స్వర్ణంతో బుల్లి హెలికాఫ్టర్ తయారీ బిక్కవోలు : మరో అద్భుత వస్తువు తయారీతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు బిక్కవోలుకు చెందిన స్వర్ణకారుడు అంబవరపు శ్రీనివాస్. గతంలో 200 మిల్లీ గ్రాముల బంగారంతో సైకిల్ నమూనాను తయారు చేసి చేతి గడియారంలో ఇమిడ్చి పలువురి ప్రశంసలందుకున్నారు. తాజాగా 2.700 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజులు పాటు శ్రమించి బంగారు హెలికాప్టర్‌ను రూపొందించారు. అంగుళం ఎత్తు, అంగుళం పొడవున ఉన్న ఈ స్వర్ణ విహంగానికి పైన నాలుగు రెక్కలు, వెనుక ఫ్యా¯ŒSతో పాటు తెరుచుకునే విధంగా రెండు డోర్లు ఏర్పాటు చేశారు. వాటికి అద్దాలను కూడా అమర్చారు. జాతీయ జెండా చిహ్నంతో పాటు ఇండియా అనే అక్షరాలను ఆంగ్లంలో మూడు రంగులతో ముద్రించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా తన తండ్రి రాము వద్ద స్వర్ణభరణాల తయారీలో శిక్షణ పొందానని చెప్పారు. ఖాళీ సమయాలలో ఇలాంటి వస్తువులను తయారు చేస్తున్నానని తెలిపారు. ఈ కళాకృతుల ద్వారా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. బంగారు హెలికాఫ్టర్ నమూనాను చూసిన వారంతా శ్రీనివాస్‌ను అభినందిస్తున్నారు. -
అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి
బాలాజీచెరువు (కాకినాడ) : గత వారం వినాయక నిమజ్ఞనం సందర్భంగా అతిసూక్ష్మ వినాయక ప్రతిమను తయారు చేసిన కళాకారుడు ఆరిపాక రమేష్ ఇప్పుడు తాజాగా మరో అతి సూక్ష్మ విగ్రహాన్ని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని సూదిలో ఇమిడేలా తయారుచేశారు. కేవలం 20 మిల్లీగ్రాములు బంగారంతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. -
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
ముకరంపుర : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు. మంగళవారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు, వ్యాపారం, ముడిసరుకు లేక పరిశ్రమల కోలుకోలేకపోతున్నాయన్నారు. ఈపరిస్థితుల్లో బ్యాంకులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అప్పులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు ప్రభాకర్‌రావు, రాజేశ్వర స్వామి, కళ్యాణ్ చక్రవర్తి, ఎం.వాసుదేవచారి, జడల భాస్కర్‌రావు, రవీందర్, మేరుగు పర్శరాములు, తాటికొండ రాజు, దేవదాసు, గుడ్లపల్లి సుధాకర్, శ్యాంసుందర్, వీరేశం, శనిగరం సునీత, మధు పాల్గొన్నారు. -
స్మాల్ ట్రాక్టర్.. సో బెటర్
రైతులు తమ పంట చేలల్లో సులువుగా పనులు చేసుకునేందుకు పలు కంపెనీలు వివిధ రకాల యంత్రాలు, పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన కుబోటా కంపెనీ నిర్వాహకులు టమాటా, మిరప, పత్తి, తదితర పంటల్లో వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా బీ–2441 అనే ఈ చిన్న ట్రాక్టర్‌ను రూపొందించి ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. రూ. 5.20 లక్షల ధర ఉండే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసేందుకు రైతు లు ఆసక్తి చూపుతున్నారు. చేలల్లో కలుపు, ఇతర పనులు చేసుకునేందుకు ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతోందని పలువురు రైతులు చెబుతున్నారు. – కరీమాబాద్ -
చిన్నది కానున్న ‘మిర్యాలగూడ’
– డివిజన్లో నాడు 11 మండలాలు – విభజనలో తొమ్మిది మండలాలతో సరి – మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి మిర్యాలగూడ పట్టణం మిర్యాలగూడ : మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మరింత చిన్నది కానున్నది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజనల అనంతరం మిర్యాలగూడ డివిజన్ చిన్నది కానున్నది. గతంలో 11 మండలాలతో ఉన్న మిర్యాలగూడ డివిజన్ నుంచి నాలుగు మండలాలను ఇతర డివిజన్లో కలుపుతున్నారు. కాగా మరో రెండు కొత్త మండలాలను చేర్చుతున్నారు. గతంలో మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాలు ఉండేవి. కాగా వీటిలో హుజూర్నగర్, మఠంపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటయ్యే కోదాడ డివిజన్లో కలుపుతుండగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాన్ని మాత్రం సూర్యాపేట డివిజన్లో కలుపుతున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడనున్న తిరుమలగిరి (సాగర్), మాడ్గులపల్లి మండలాలను మిర్యాలగూడ డివిజన్లో కలపనున్నారు. నాలుగు మండలాలను తొలగించి రెండు మండలాలను కలపడం వల్ల తొమ్మిది మండలాలకు మిర్యాలగూడ డివిజన్ పరిమితం కానున్నది. మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రానున్నది. ప్రస్తుతం మాడ్గులపల్లి గ్రామం తిప్పర్తి మండలంలో ఉండగా పునర్విభజనలో భాగంగా మాడ్గులపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. కానీ నూతనంగా ఏర్పడే మండలంలో తిప్పర్తి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలపనున్నారు. దాంతో మూడు నియోజకవర్గాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండకు సంబంధించిన గ్రామాలు ఈ మండలంలో చేరనున్నాయి. నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలంలో వేములపల్లి మండలం నుంచి కోయిలపాడు, ఆగామోత్కూర్, చిరుమర్తి, కుక్కడం, గండ్రవారిగూడెం, తోపుచర్ల, కల్వలపాలెం, నిడమనూరు మండలం నుంచి కన్నెకల్, త్రిపురారం మండలం నుంచి పూసలపాడు, గజలాపురం, పెద్దదేవులపల్లి, నర్లెకంటిగూడెం, అబంగాపురం, త్రిప్పర్తి మండలం నుంచి చెర్వుపల్లి, దాచారం, ఇందుగుల గ్రామాలను కలపనున్నారు. వేములపల్లి మండలం నుంచి మాడ్గులపల్లిలోకి కలిసే గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గం, త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని గ్రామాలు నాగార్జునసాగర్, తిప్పర్తి మండలంలోని గ్రామాలు నల్లగొండ నియోజకవర్గం నుంచి వచ్చి కలవనున్నాయి. -
చిన్న జిల్లాలతోనే పురోగతి
కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు హర్షణీయం శాసన సభాపతి మధుసూదనాచారి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ భూపాలపల్లి : జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని శాసన సభాపతి, స్థానిక ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూ పాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ముసాయిదా విడుదల చేయడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి, అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ఆచార్య జయశంకర్ 1952 నుంచి చనిపోయేంత వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతి యుత పోరాటం చేశారని, రాష్ట్రాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకొని అతడి కలలను నెరవేర్చాలన్నారు. భూపాలపల్లి, ములుగు, మంథని ప్రాంతాలను కలుపు తూ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాను ప్రకటించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవనీతరావు, సిరికొండ ప్రదీప్, సిరికొండ ప్రశాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, గోనె భాస్కర్, రేగుల రాకేష్, కెక్కెర్ల శ్రీనివాస్, మేకల రజిత, ముం జాల నిర్మల, చందుపట్ల స్వప్నలత, బేతోజు వజ్రమణి, తాటి హైమావతి పాల్గొన్నారు. -
కుటీర పరిశ్రమలకు ఎన్సీడీసీ చేయూత
ఐసీడీపీ డైరెక్టర్ డాక్టర్ ఇళంగోవెల్ వెల్లడి ఆత్రేయపురం : గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ఆధారంగా చేసుకుని జీవించే వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ఐసీడీపీ (ఇండస్ట్రియల్ కోఅపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) కృషి చేస్తుందని డైరెక్టర్ ఇళంగోవెల్ అన్నారు. మంగళవారం ఆత్రేయపురం సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం పూతరేకులు, మామిడితాండ్ర, తాడితాండ్ర, పచ్చళ్ల తయారీ పరిశ్రమలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో సొసైటీల ద్వారా కుటీర పరిశ్రమలకు, రైతుల యాంత్రీకరణ పనిముట్లకు రెండో విడత రుణాలు అందిస్తున్నట్టు వివరించారు. సహకార సొసైటీలకు గొడౌన్లు నిర్మించేందుకు రూ.15 లక్షలు ఐసీడీపీ ప్రాజెక్టు ద్వారా రుణంగా ఇస్తామని వివరించారు. కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందిస్తామని, ఒక్కొక్క మండలం నుంచి 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ పథకం ఐదేళ్ల పాటు ఉంటుందన్నారు. తొలుత ఆయన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డీసీసీబీ ఏజీఎం కృష్ణమూర్తిరాజు, డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు ఆయన వెంట ఉన్నారు. -
నీటిసంరక్షణ గుంతలతో సత్ఫలితాలు
పెరుగుతున్న నీటి మట్టం కాంటూర్ కందకాల్లో జలకళ ఎల్లారెడ్డిపేట : సిరిసిల్ల మెట్ట ప్రాంతంలోని అడవుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కాంటూర్ కందకాల తవ్వకం, రాతి కట్టడాలు, చిన్నపాటి నీటి ఊటకుంటలు జలకళ సంతరించుకున్నాయి. ‘నీరున్న చోటే పంటలు పండుతాయ్.. చెట్లు ఉంటే వానలు పడుతాయ్’ నినాదాన్ని నిజం చేస్తున్నాయి. చెట్లు ఉన్న చోటే వర్షాలు పడతాయని సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అంతకు ముందే.. వీర్నపల్లి, కంచర్ల, అల్మాస్పూర్, మద్దిమల్ల, రంగంపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చిన్ననీటి ఊటకుంటలు, కాంటూర్ కందకాలు నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నీరు బూమిలోకి ఇంకుతోంది. బోర్లు, బావులతోపాటు చిన్ననీటి వనరుల్లో నీటి మట్టం పెరుగుతోంది. వర్షాలతో జలకళ వీర్నపల్లి అటవీ సెక్షన్లో గతేడాది నీటి నిల్వ సంరక్షణ పనులు చేపట్టారు. సుమారు 5,500 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీప్రాంతంలో దాదాపు 2,250 కాంటూర్ కందకాలు, రెండు చిన్ననీటి ఊటకుంటలు, 49 రాతి కట్టడాలు నిర్మించారు. కాంటూర్ కందకాల్లో చేరిన వర్షపునీరు భూమిలో ఇంకుతోంది. దిగువన ఉన్న ఒర్రెలు, కాలువల్లో ఊటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. అటవీ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోవుతోంది. అటవీ గ్రామాల్లోనూ జోరువానలు కురుస్తున్నాయి. రాతి కట్టడాలతో వర్షపునీరు నెమ్మదిగా ప్రవహిస్తుండడంతో భూసారం కొట్టుకుపోకుండా, భూమి కోతకు గురికావడంలేదు. వన్య ప్రాణులకు పుష్కలంగా తాగునీరు లభిస్తోంది. సమీప గ్రామాల్లోనూ సాగునీటికి కొదవలేకుండాపోయింది. -
చిన్న పరిశ్రమల పని ముగిసిపోయింది!
న్యూఢిల్లీః సుబ్రమణ్యస్వామి ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజన్ విధానాలతో చిన్న పరిశ్రమలకు పాతర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపిస్తున్నారని, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని స్వామి విరుచుకుకు పడ్డారు. రాజన్ తప్పుడు విధానాల ఆధారంగానే తాను విమర్శలు చేయాల్సి వస్తోందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పొట్ట కొట్టి, బహుళజాతి సంస్థలకు మేలు చేసేందుకు ఆయన ఈ విధానాలను అనుసరిస్తున్నారంటూ స్వామి ఆరోపించారు. ఆర్ బీ ఐ గవర్నర్ రాజన్ వ్యవసాయ వ్యతిరేక బ్యాంకింగ్ విధానాలను అనుసరించారని వాటిని తాను చార్జిషీటులో పొందిపరచినట్లు స్వామి తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారతీయ కిసాన్ అభియాన్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన స్వామి... అధిక వడ్డీరేట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయని, దీంతో దేశవాళీ ఉత్పత్తులు తగ్గిపోవడమే కాక, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. రఘురామ రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవినుంచీ వెంటనే తొలగించాలని కోరుతూ స్వామి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. -
డైమండ్ 'చిన్నది'... పెళ్ళి వద్దంది!
పెళ్ళి నిశ్చితార్థానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఓ యువతిని పెళ్ళికి ప్రపోజ్ చేసిన యువకుడు ఉంగరం చేయిస్తానని మాటిచ్చాడు. అన్నట్టుగానే చేయించాడు కూడా. కానీ ఉంగరంలోని డైమండ్ చిన్నదైందంటూ ఏకంగా పెళ్ళికే ససేమిరా అందా మగువ. ఎంగేజ్ మెంట్ రింగ్ లో డైమండ్ చిన్నదైనందుకు పెళ్ళినే నిరాకరించింది. చైనా సిచువాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. పాపం ఆ ప్రేమికుడు... ప్రేయసిని ఉంగరంతో ఆశ్చర్యపరచాలనుకున్నాడు. పార్టీకి పిలిచి డైమండ్ రింగ్ బహూకరించి పెళ్ళి చేసుకుందామన్న ప్రపోజల్ తో సిద్ధంగా వచ్చాడు. తీరా ఆమె ఉంగరంలో చిన్న డైమండ్ ఉందంటూ పెళ్ళినే నిరాకరించడంతో వందలమంది డ్యాన్సర్లు ముందే మోకరిల్లాడు. ఎంతగానో బతిమలాడాడు. అయితేనేం వజ్రంలాంటి కుర్రాడికన్నా ఉంగరంలోని వజ్రానికే ఆ చిన్నది ప్రాముఖ్యతనిచ్చింది. పెళ్ళి గిళ్ళి జాంతానై.. అంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది. నైరుతి చైనా రాజధాని, సుచియాన్ ప్రావిన్స్ నగరంలో ఆమె చేస్తున్న చెంగ్డూ నృత్యాన్ని చూసి ఆ ప్రేమికుడు ఫిదా అయిపోయాడు. ఆమె వెంటపడి తన ప్రేమను తెలిపాడు. అలాగే పెళ్ళికి కూడ ప్రపోజ్ చేశాడు. వజ్రం ఉంగరం ఇస్తామని ప్రామిస్ చేశాడు. అన్నట్లుగానే తన బాయ్ ఫ్రెడ్ వజ్రం ఉంగరాన్ని తెచ్చివ్వడాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. బాక్స్ నుంచి ఉంగరం బయటకు తీశాడు. అంతే.. ఆమె ముఖం మాడిపోయింది. ఏంటీ ఇంత చిన్న వజ్రమా అంటూ ఉంగరంతోపాటు అతడి ప్రపోజల్ నూ తిప్పి కొట్టింది. అతడితో మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయింది. జరిగిన తతంగంపై ఆ ప్రియురాలు 'వియ్ ఛాట్' లో తన స్నేహితురాలితో సంభాషించింది. ఆ తర్వాత ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ గా మారి... ఆన్ లైన్ లో లీకయింది. ఓ కథలా పబ్లిష్ అయ్యింది. తనకు ప్రపోజ్ చేసినప్పుడు వన్ కేరెట్ వజ్రంతో ఉంగరం చేయిస్తానన్నాడని, తీరా నిశ్చితార్థానికి అంత చిన్న వజ్రం ఉంగరం ఇవ్వడంలో అతని ఉద్యేశ్యం ఏమిటంటూ ఆమె తన అభద్రతా భావాన్ని మెసేజ్ లో వ్యక్త పరిచింది. అతడు తనగురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఫ్రెండ్ ''బాధపడకు నీకోసం మరో పెద్ద రింగ్ ఎదురు చూస్తూ ఉండి ఉంటుందిలే'' అంటూ ఆమెకు సర్ది చెప్పింది. ఇలా మెసేజ్ ల ద్వారా విషయం లీక్ అవడంతో ఆ ప్రేమికుల కథ బట్టబయలైంది. సో అబ్బాయిలూ ప్రపోజ్ చేసేంముందు కాస్ల ఆలోచించి మరీ వాగ్దానాలు చేయాలని మర్చిపోకండి. -
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్‌లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్‌లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్‌లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్‌వర్క్‌లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది.