చిన్న జిల్లాలతోనే పురోగతి
-
కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం
-
భూపాలపల్లి జిల్లా ఏర్పాటు హర్షణీయం
-
శాసన సభాపతి మధుసూదనాచారి
-
పట్టణంలో విజయోత్సవ ర్యాలీ
భూపాలపల్లి : జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని శాసన సభాపతి, స్థానిక ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూ పాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ముసాయిదా విడుదల చేయడాన్ని హర్షిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి, అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ఆచార్య జయశంకర్ 1952 నుంచి చనిపోయేంత వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతి యుత పోరాటం చేశారని, రాష్ట్రాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకొని అతడి కలలను నెరవేర్చాలన్నారు. భూపాలపల్లి, ములుగు, మంథని ప్రాంతాలను కలుపు తూ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాను ప్రకటించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు నవనీతరావు, సిరికొండ ప్రదీప్, సిరికొండ ప్రశాంత్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, గోనె భాస్కర్, రేగుల రాకేష్, కెక్కెర్ల శ్రీనివాస్, మేకల రజిత, ముం జాల నిర్మల, చందుపట్ల స్వప్నలత, బేతోజు వజ్రమణి, తాటి హైమావతి పాల్గొన్నారు.