distrcit centre
-
జిల్లా ఏర్పాటులో అధికారులు సహకరించాలి
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటులో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ప ట్టణ శివారులోని ఐటీఐ భవనా న్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించగా చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటుతో మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కార్యాలయాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. మా నుకోట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధా లా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, టౌన్ సీఐ నందిరామ్‌నాయక్, ఎస్సైలు తిరుపతి, కమలాకర్, ట్రా ఫిక్ ఎస్సై అంబటి రవీందర్, టీఆర్ఎస్ నా యకులు ఫరీద్, భూక్య ప్రవీణ్ పాల్గొన్నారు. -
చిన్న జిల్లాలతోనే పురోగతి
కేసీఆర్‌ది సాహసోపేత నిర్ణయం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు హర్షణీయం శాసన సభాపతి మధుసూదనాచారి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ భూపాలపల్లి : జిల్లాల ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని శాసన సభాపతి, స్థానిక ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూ పాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం ముసాయిదా విడుదల చేయడాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి, అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ఆచార్య జయశంకర్ 1952 నుంచి చనిపోయేంత వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం శాంతి యుత పోరాటం చేశారని, రాష్ట్రాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకొని అతడి కలలను నెరవేర్చాలన్నారు. భూపాలపల్లి, ములుగు, మంథని ప్రాంతాలను కలుపు తూ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాను ప్రకటించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవనీతరావు, సిరికొండ ప్రదీప్, సిరికొండ ప్రశాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, గోనె భాస్కర్, రేగుల రాకేష్, కెక్కెర్ల శ్రీనివాస్, మేకల రజిత, ముం జాల నిర్మల, చందుపట్ల స్వప్నలత, బేతోజు వజ్రమణి, తాటి హైమావతి పాల్గొన్నారు. -
జననేతకు ఘన నివాళి
సాక్షి బృందం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి వేడుకలను మంగళవారం కల్వకుర్తి, అచ్చంపేట, కొత్తకోట, దేవరకద్ర, షాద్‌నగర్, అలంపూర్, జడ్చర్ల, కొడంగల్, కొల్లాపూర్, నర్వ, ఆత్మకూర్, పట్టణాల్లో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పూలమాల లు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు వైఎస్ సేవలను కొనియాడా రు. పాలమూరు నుంచి పలు సంక్షేమపథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు అందజేసిన ఘనత వైఎస్‌కే ద క్కిందన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేసి.. ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులతో చెలగాటమాడుతుందన్నారు. అనంతరం అనాథ విద్యార్థులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేటలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీష్వ రవీందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రజ లగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వైఎస్ పథకాలను గత ప్రభుత్వాలు నీరుగార్చాయని విమర్శిం చారు. అనంతరం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పం పిణీ చేశారు. వ్యవసాయానికి ఊపిరిపోసి..రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. కొల్లాపూర్‌లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నేత మేనుగొండ రాముయాదవ్ వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. మక్తల్‌లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. నారాయణపేటలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి జమీర్‌పాషా ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. అనంతరం ‘పేట’ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమఫలాలు అందాయని డీసీసీ ఉపాధ్యక్షుడు రంగారావు కొనియాడారు. వైఎస్ అమలుచేసిన పథకాలను జిల్లానుంచే ప్రారంభించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్‌నగర్ మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తకోటలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో వర్ధంతి జరిపారు. డీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. పేదప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగంగా సాగిందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కీర్తించారు. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. మహానేత హయాం లోనే చెప్పుకోదగిన అభివృద్ధి పనులు జరిగాయని కొనియాడారు. గద్వాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డీకే బంగ్లా నుంచి వైఎస్ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.