జిల్లా ఏర్పాటులో అధికారులు సహకరించాలి
Published Sat, Sep 24 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటులో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ప ట్టణ శివారులోని ఐటీఐ భవనా న్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించగా చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటుతో మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కార్యాలయాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. మా నుకోట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధా లా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, టౌన్ సీఐ నందిరామ్‌నాయక్, ఎస్సైలు తిరుపతి, కమలాకర్, ట్రా ఫిక్ ఎస్సై అంబటి రవీందర్, టీఆర్‌ఎస్ నా యకులు ఫరీద్, భూక్య ప్రవీణ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement