MLA Shankar Nayak
-
‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’
సాక్షి, గూడూరు(వరంగల్): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు వాయిల్‌బంధం సమీపంలోని పోడు భూములను పరిశీలించడానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఆ సాగు భూముల వివరాలను నాయకులు, అక్కడి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో తన కారులోని టిఫిన్ బాక్సును తీసుకునిరా అని డ్రైవర్‌కు చెప్పాడు. అక్కడే ఉండి ఎమ్మెల్యే మాటలు వింటున్న మహిళా రైతులు కొందరు ‘అయ్యా..ఫారెస్టో ల్లు మా భూములు గుంజుకొని మాకు బువ్వ లేకుండా చేయాలని చూస్తుర్రు, మీకైతే ఎక్కడ బడితె అక్కడికి బువ్వొస్తుంది. మా గతేంటి’ అని వాపోయారు. ఆ మాటలను విన్న ఎమ్మెల్యే.. మహిళలను చూస్తూ ‘అవ్వా..ఓ తల్లులూ..మీ భూములు ఎటూ పోవు, ఇప్పించే బాధ్యత నాది. ఇగరాండి’...అంటూ పిలిచారు. ‘మీకు భూములప్పిస్తా...బువ్వ తినిపిస్తా’నంటూ ఎమ్మెల్యే తన టిఫిన్ బాక్సులోని అనాన్ని ముద్దలు కలిపి తినిపించారు. ఈ సంఘటను అక్కడున్న నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు. -
మా మంచి ఎమ్మెల్సీనే: కరోనా కిట్‌తో విస్కీ మందు
సాక్షి, మహబూబాబాద్ : లీడరా.. మజాకా! ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు కదా! అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి కిట్బ్యాగులను పంపించారు. అయితే ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పంపిణీ చేశారు. మెడికల్ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్.. మహా అయితే డ్రైఫ్రూట్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటారా?! పైన చెప్పినవే కాకుండా ఆ ప్యాక్‌లో టీచర్స్ విస్కీ బాటిల్ కూడా ఉంది మరి! దీంతో ప్యాక్ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు. -
రైతు కాళ్లు మొక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
మహబూబాబాద్: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా ప్రయోగ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి పాదాలు మొక్కి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమన్‌గల్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి రైతు వద్ది సుదర్శన్ రెడ్డి స్థలం ఇచ్చారు. రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థలం ఇచ్చిన రైతు సుదర్శన్‌రెడ్డి కాళ్లను ఎమ్మెల్యే మొక్కారు. పాదాభివందనం చేస్తుండగా రైతు వారించాడు. రైతు స్థలం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రైతును అభినందించారు. -
నాయక్‌పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, స్వేచ్ఛగా విధులను నిర్వహించలేకపోతున్నానని ప్రీతి మీనా ఆరు నెలల క్రితమే సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన వారిని కాపాడటం కోసం డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, అదే జరిగితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా నాశనం అవుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. -
జిల్లా ఏర్పాటులో అధికారులు సహకరించాలి
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటులో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ప ట్టణ శివారులోని ఐటీఐ భవనా న్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించగా చుట్టూ ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటుతో మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కార్యాలయాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. మా నుకోట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధా లా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, టౌన్ సీఐ నందిరామ్‌నాయక్, ఎస్సైలు తిరుపతి, కమలాకర్, ట్రా ఫిక్ ఎస్సై అంబటి రవీందర్, టీఆర్ఎస్ నా యకులు ఫరీద్, భూక్య ప్రవీణ్ పాల్గొన్నారు. -
రెండేళ్లలో రూ.1,139కోట్లతో అభివృద్ధి
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మహబూబాబాద్ : నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1,139 కోట్ల 53లక్షల నిధులు మంజూరు కాగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ కింద రూ.576 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 124 చెరువులు ఎంపిక కాగా మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్లు విడుదలయ్యూయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద ట్యాంకుల నిర్మాణానికి రూ.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.62.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 131 పనుల(బోర్‌వెల్స్, పైపులైన్స్, ఓపెన్ వెల్స్)కు రూ.3.5కోట్లు రాగా పనులు చేసిన ట్లు చెప్పారు. ఐటీడీఏ కింద 20 పనులు చేయగా ఇందుకు రూ. 11.88కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో విద్యా, సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతులు ప్రహరీ, తాగునీటి సౌకర్యం, ఇతరాల కోసం రూ.6.27 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన 34 పనులు జరగ్గా రూ. 193.07కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మానుకోట నుంచి ఈదులపూసపల్లి రోడ్‌కు రూ.25కోట్లు కేటారుుంచామని, టెండర్ పూర్తరుు్యందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పనిము ట్లు, ట్రాక్టర్లకు రూ.2కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించి నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, గూడూరు, గోదాములకు రూ.9.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ట్రాన్స్‌కో నుంచి సబ్స్టేషన్లు, ఇతరాల కోసం రూ.68.7 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ, గూడూరులో హెల్త్‌సెంటర్ కోసం రూ. 5.15 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 400 డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణానికి రూ.21.2 కోట్లు కేటారుుంచామని తెలిపారు. మానుకోటలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీలోని 44 పనులకు రూ.2.41 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. సీడీఎఫ్ నుంచి 69 పనులకు రూ.3 కోట్లు కేటారుుంచానన్నారు. రెండు గిరిజన గురుకుల భవన నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరయ్యూయని తెలిపారు. నెల్లికుదురు మండ లం ఆలేరు నుంచి కోమటిపల్లి రోడ్డు కోసం రూ.6.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మానుకోటలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందన్నారు. అనంతారం మైసమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి రూ.3కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యాయన్నారు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. నెల్లికుదురు, మునిగలవీడు, మేచరాజుపల్లి, మట్టెవాడ, అన్నారంలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరయ్యూయని వివరించారు. మున్నేరువాగుపై చెక్‌డ్యామ్, ఇతర పనుల కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, పొనుగోటి రామకృష్ణారావు, చౌడవరపు రంగన్న, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, జెర్రిపోతుల వెంకన్న, మల్సూర్, వెన్నమల్ల అజయ్, పెద్ది సైదులు, చారి, దార యాదగిరిరావు, రాజేష్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో పలువురి చేరిక
నెల్లికుదురు : మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన 100మంది ఆ గ్రామ సర్పంచ్ కశిరబోయి మంజు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ నివాసంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు యాదవసంఘం గ్రామ పెద్ద గొల్ల ఉడుత కొమురుమల్లు, నాయిని కొమురయ్య, మల్లయ్య, భూక్య రాములు, చెడుపాక యాకయ్య, వై.శ్రీను, యాకయ్య, అయిలయ్య, చంద్రయ్య, కట్టయ్య, సాయిలు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి గొట్టిముక్కుల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు బైరు బాలయ్య, బొడపెల్లి కొండయ్య, పోలోజు వ్యాకర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
మేడారం జాతరను సక్సెస్ చేద్దాం
హన్మకొండ అర్బన్ : ‘‘జిల్లాలో ఇటీవల నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో జిల్లా యంత్రాంగం చక్కగా పనిచేసింది.. అదేవిధంగా అందరం కలిసి టీం వర్క్ చేద్దాం.. మేడారం జాతరను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేద్దాం.. జాతరకు కోటిమంది భక్తులు వస్తారు.. అభివృద్ధి పనుల కోసం రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. నాణ్యతతో కూడిన పనులు సకాలంలో చేయడమే మనలక్ష్యం’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతు, విస్తరణ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి సకాలంలో పూర్తి చేయాలన్నారు. మరమ్మతు, కొత్తగా వేయాల్సిన రోడ్ల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో చేపట్టే శాశ్వత పనులు జాతర అనంతరం గ్రామస్తులకు ఉపయోగపడేలా చూడాలని అన్నారు. 35 రోజుల్లో బ్రిడ్జి కట్టాం.. పస్రా నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న 27 కిలో మీటర్ల రోడ్డు విస్తరణ పనుల్లో జాతర నాటికి పస్రా నుంచి తాడ్వాయి వరకు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్ ఈఈ అబ్దుల్ చెప్పడంతో శ్రీహరి అభ్యంతరం తెలిపారు. జాతరకు ఐదునెలల సమయం ఉందని.. ఈలోగా సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుని ఏటూరునాగారం వరకు పూర్తిగా విస్తరణ పనులు చేయాలన్నారు. మేడారంలో 14 ఏళ్ల క్రితం 35 రోజుల్లో బ్రిడ్జి కట్టామని అలాంటిది ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున రోడ్డు పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే గతంలో వాడిన మోటారు సామగ్రి వివరాలు, నిధుల ఖర్చు ల లెక్కలు చూపాలని శ్రీహరి అన్నారు. గతంలో వేసిన రోడ్లు ఎంతకాలం ఉన్నాయో తెలపాలని.. కొత్త రోడ్ల కోసం ఇస్తున్న ప్రతిపాదనల్లో పాత రోడ్లు కూడా ఎక్కడైనా ఉన్నాయా ముందే చెప్పమని అధికారులను ఆదేశించారు. జాతరలో రద్దీ ఉండే ప్రాం తాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. మేడారం జాతర ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశమని అందువల్ల ముఖ్యమంత్రి సమక్షంలో సెప్టెంబర్ నెలలో ఉన్నత స్థారుులో సమీక్ష సమావేశం ఉంటుందని అన్నారు. జాతర ఏర్పాట్లు చేయూలి.. సమ్మక్క జాతర గిరిజన జాతర కాబట్టి గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేయాలని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ ఈ సారి ప్రయోగత్మాకంగా అల్యూమినియం రేకులతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని తెలి పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా యంత్రాంగం అన్ని పనులు ముందుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు జాతరలో చేపట్టాల్సిన పనుల కోసం రూ.145 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని తెలిపారు. మమ్మల్ని పిలవలేదు.. మేడారం జాతరకు సంబంధించి సమావేశం విషయంలో ఎమ్మెల్యేలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ఒక్క మేడారం జాతరపైనే చర్చపెడుతున్నారని.. 20 లక్షల మంది వచ్చే ఆగ్రంపాడ్ జాతరను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరని అన్నారు. దీనిపై కూడా సమీక్ష నిర్వహించాలని అన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి సర్దిచెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మేడారం పనుల్లో నాణ్యత ఉండటంలేదని ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జేసీ ప్రశాంత్ పాటిల్, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, డీఆర్వో శోభ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, డీపీవో నాయక్, డీఎంఅండ్ హెచ్‌వో సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.