ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్ : నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1,139 కోట్ల 53లక్షల నిధులు మంజూరు కాగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ కింద రూ.576 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 124 చెరువులు ఎంపిక కాగా మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్లు విడుదలయ్యూయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద ట్యాంకుల నిర్మాణానికి రూ.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.62.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి 131 పనుల(బోర్‌వెల్స్, పైపులైన్స్, ఓపెన్ వెల్స్)కు రూ.3.5కోట్లు రాగా పనులు చేసిన ట్లు చెప్పారు. ఐటీడీఏ కింద 20 పనులు చేయగా ఇందుకు రూ. 11.88కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లాలో విద్యా, సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతులు ప్రహరీ, తాగునీటి సౌకర్యం, ఇతరాల కోసం రూ.6.27 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 34 పనులు జరగ్గా రూ. 193.07కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మానుకోట నుంచి ఈదులపూసపల్లి రోడ్‌కు రూ.25కోట్లు కేటారుుంచామని, టెండర్ పూర్తరుు్యందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పనిము ట్లు, ట్రాక్టర్లకు రూ.2కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించి నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, గూడూరు, గోదాములకు రూ.9.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ట్రాన్స్‌కో నుంచి సబ్‌స్టేషన్లు, ఇతరాల కోసం రూ.68.7 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ, గూడూరులో హెల్త్‌సెంటర్ కోసం రూ. 5.15 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 400 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణానికి రూ.21.2 కోట్లు కేటారుుంచామని తెలిపారు. మానుకోటలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీలోని 44 పనులకు రూ.2.41 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. సీడీఎఫ్ నుంచి 69 పనులకు రూ.3 కోట్లు కేటారుుంచానన్నారు. రెండు గిరిజన గురుకుల భవన నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరయ్యూయని తెలిపారు. నెల్లికుదురు మండ లం ఆలేరు నుంచి కోమటిపల్లి రోడ్డు కోసం రూ.6.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మానుకోటలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందన్నారు. అనంతారం మైసమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి రూ.3కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యాయన్నారు.
గూడూరు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. నెల్లికుదురు, మునిగలవీడు, మేచరాజుపల్లి, మట్టెవాడ, అన్నారంలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరయ్యూయని వివరించారు. మున్నేరువాగుపై చెక్‌డ్యామ్, ఇతర పనుల కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, పొనుగోటి రామకృష్ణారావు, చౌడవరపు రంగన్న, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, జెర్రిపోతుల వెంకన్న, మల్సూర్, వెన్నమల్ల అజయ్, పెద్ది సైదులు, చారి, దార యాదగిరిరావు, రాజేష్ పాల్గొన్నారు.