Development tasks
-
రెండేళ్లలో రూ.1,139కోట్లతో అభివృద్ధి
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మహబూబాబాద్ : నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1,139 కోట్ల 53లక్షల నిధులు మంజూరు కాగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ కింద రూ.576 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 124 చెరువులు ఎంపిక కాగా మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్లు విడుదలయ్యూయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద ట్యాంకుల నిర్మాణానికి రూ.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.62.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 131 పనుల(బోర్‌వెల్స్, పైపులైన్స్, ఓపెన్ వెల్స్)కు రూ.3.5కోట్లు రాగా పనులు చేసిన ట్లు చెప్పారు. ఐటీడీఏ కింద 20 పనులు చేయగా ఇందుకు రూ. 11.88కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో విద్యా, సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతులు ప్రహరీ, తాగునీటి సౌకర్యం, ఇతరాల కోసం రూ.6.27 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన 34 పనులు జరగ్గా రూ. 193.07కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మానుకోట నుంచి ఈదులపూసపల్లి రోడ్‌కు రూ.25కోట్లు కేటారుుంచామని, టెండర్ పూర్తరుు్యందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పనిము ట్లు, ట్రాక్టర్లకు రూ.2కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించి నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, గూడూరు, గోదాములకు రూ.9.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ట్రాన్స్‌కో నుంచి సబ్స్టేషన్లు, ఇతరాల కోసం రూ.68.7 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ, గూడూరులో హెల్త్‌సెంటర్ కోసం రూ. 5.15 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 400 డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణానికి రూ.21.2 కోట్లు కేటారుుంచామని తెలిపారు. మానుకోటలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీలోని 44 పనులకు రూ.2.41 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. సీడీఎఫ్ నుంచి 69 పనులకు రూ.3 కోట్లు కేటారుుంచానన్నారు. రెండు గిరిజన గురుకుల భవన నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరయ్యూయని తెలిపారు. నెల్లికుదురు మండ లం ఆలేరు నుంచి కోమటిపల్లి రోడ్డు కోసం రూ.6.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మానుకోటలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందన్నారు. అనంతారం మైసమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి రూ.3కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యాయన్నారు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. నెల్లికుదురు, మునిగలవీడు, మేచరాజుపల్లి, మట్టెవాడ, అన్నారంలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరయ్యూయని వివరించారు. మున్నేరువాగుపై చెక్‌డ్యామ్, ఇతర పనుల కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, పొనుగోటి రామకృష్ణారావు, చౌడవరపు రంగన్న, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, జెర్రిపోతుల వెంకన్న, మల్సూర్, వెన్నమల్ల అజయ్, పెద్ది సైదులు, చారి, దార యాదగిరిరావు, రాజేష్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటి మొక్కలు.. రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు. మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్‌తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు. పథకాల అమలులో మనమే ఫస్టు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్‌గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ 10 నుంచి హరితహారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్‌కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు. అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్‌ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 451, పీఆర్‌కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘భగీరథ’ వేగం పెంచండి ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు ‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. -
జెడ్పీ పాలనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం
హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ పనితీరు, వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉద్యోగుల సేవలు తదితర వివరాలు సేకరించేందుకు కేంద్ర బృందం సోమవారం వరంగల్ జిల్లా పరిషత్‌కు వచ్చింది. తెలంగాణలో ఉత్తమ జిల్లా పరిషత్గా వరంగల్ ఎంపిక కావడంతో పనులను పరిశీలించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వివరాలు సేకరించింది. దేశంలోని అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లు ఈ ఫార్మాట్లో వివరాలు పొందుపరిచాయి. అరుుతే తెలంగాణలో వరంగల్ జెడ్పీ అత్యధిక పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జెడ్పీలలో ఆన్లైన్లో పొందుపర్చిన మేరకు పనులు జరిగాయా? లేదా అని తెలుసుకునేందుకు కేరళ, మణిపూర్లకు చెందిన ఐఏఎస్ అధికారులు రాంనాయర్, కె.కె.ఠక్కర్తో కూడిన కేంద్ర బృందం జిల్లా పర్యటనకు వచ్చింది. అందుబాటులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులతో బృందం అధికారులు సమావేశమై వారి నుంచి పలు సమాధానాలు రాబట్టారు. అధికారాల బదలాయింపు, సమావేశాల నిర్వహణ తీరు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జెడ్పీటీసీ సభ్యులు తమ సమస్యలను వివరించారు. జెడ్పీలకు నిధులు నిలిచిపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని చెప్పారు. కాగా, ఈ బృందం మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, నిధుల వినియోగంపై తెలుసుకోనున్నారు. కేంద్ర బృందాలు అన్ని రాష్ట్రాలలో పర్యటించి పనితీరును పరిశీలించిన తర్వాత జాతీయ స్థాయిలో అధిక పాయింట్లు సాధించిన జిల్లాకు ప్రత్యేక నిధులు కేటారుుస్తారని జెడ్పీ సీఈవో అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజాపరిషత్‌గా ఎంపికైతే కేంద్రం నుంచి పారితోషికం కింద రూ.40 లక్షలు వస్తాయన్నారు. బృందం వెంట జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ తదితరులు ఉన్నారు. -
నత్తే నయం!
కొనసాగుతున్న అభివృద్ధి పనులు కానరాని నాణ్యత {పమాణాలు పూర్తికాని రోడ్ల విస్తరణ అధికారుల తీరుపై మేయర్ గుర్రు విజయవాడ సెంట్రల్ : నగరంలో అభివృద్ధి పనులు నీరసంగా సాగుతున్నాయి. సమగ్ర ప్రణాళిక లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో అంచనాలు పెరిగిపోయి నగరపాలక సంస్థపై ఆర్థిక భారం పడుతోంది. కొండ ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి నెలకొంది. పుష్కలంగా నిధులు మంజూరైనప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఫలితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. జరిగిన పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కమిషనర్‌కే మస్కా 13వ ఆర్థిక సంఘం, ప్లాన్, నాన్‌ప్లాన్, ఇరిగేషన్ గ్రాంట్లు, స్టేట్‌ఫైనాన్స్, నగరపాలక సంస్థ జనరల్ గ్రాంట్ల ద్వారా నగరంలోని మూడు సర్కిళ్లలో రూ. 158.28 కోట్లతో 750 పనులను నాలుగు నెలల కిందట చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ పూర్తికావాల్సి ఉంది. ఇందులో 494 పనులు పూర్తికాగా, 138 అభివృద్ధి దశలో ఉన్నాయి. 82 ప్రారంభ దశలో ఉండగా, 36 పనులు ఇంకా టెండర్ దశలో కునారిల్లుతున్నట్లు ఇంజినీరింగ్ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతంటే అదీ అనుమానమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ దెబ్బతింటోంది. సర్కిల్-1 పరిధిలో పనులు ప్రారంభం కాకుండానే తప్పుడు రికార్డులతో కమిషనర్‌ను పక్కదారి పట్టించేందుకు ఏఈ, డీఈలు యత్నించారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో వారిని విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ తరహాలో కొందరు ఏఈలు కాగితాలపైనే పనులు జరిగినట్లు చూపిస్తూ మస్కా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతకు తిలోదకాలు ఇప్పటివరకు జరిగిన పనులను నిశితంగా పరిశీలిస్తే 40 శాతం పనులు నాసిరకంగా ఉన్నాయనే వాదనలున్నాయి. సర్కిల్-3 చేపట్టిన డ్రెయినేజీ పనుల్లో నాణ్యత లోపించడంపై మేయర్ కోనేరు శ్రీధర్ తప్పుబట్టారు. చీఫ్ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేశారు. కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు పనుల్లో నాణ్యత లేకుంటే ఎలా అంటూ నిలదీసినట్లు తెలిసింది. సర్కిల్-1 చేపట్టిన పనుల్లో కొన్ని నాసిరకంగా ఉండడంపై కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో చేపట్టిన కొన్ని పనుల్లో డొల్లతనం వెలుగుచూసింది. విస్తరణ పనులకు అడ్డంకులు.. సమగ్ర ప్రణాళికలు, ఏర్పాట్లు లేకుండా టెండర్లు పిలవడంతో రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దుర్గగుడి ఫ్లైఓవర్, కృష్ణాపుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నగరంలో సుమారు 29 రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. విస్తరణకు మార్కింగ్ ప్రకారం రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ఇప్పటికీ తొలగించకపోవడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. స్తంభాలు తొలగిస్తేనే పనులు చేయగలుగుతామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. భవానీపురం, విద్యాధరపురం, సింగ్‌నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విస్తరణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ సీరియస్ అయ్యారు. స్తంభాల తొలగింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ కమిషనర్‌కు లేఖరాసినట్లు తెలుస్తోంది. -
‘మై షుగర్’కు పూర్వవైభవం
- సెప్టెంబర్‌లో చక్కెర ఉత్పత్తి - అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా మండ్య : చాలా కాలం తర్వాత మండ్య జిల్లాలో మై షుగర్ కంపెనీ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ పరిశ్రమలో చక్కెర ఉత్పత్తిని ప్రారంభించే దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన ఈ పరిశ్రమ పాలక మండలి సభ్యులు కేవలం పదవులను అలంకరించేందుకు పరిమితయ్యారు తప్పా, పరిశ్రమ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో పరిశ్రమ మూతపడేందుకు కారణమైంది. ఈ ఐదేళ్లలో పరిశ్రమ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చెరుకును క్రష్ చేస్తే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. సాంకేతిక లోపాలు తలె త్తాయి. చెరుకును క్రష్ చేసే సమయంలో యంత్రాలు ఆగిపోయేవి. ఈ ప్రభావం చెరుకు రైతులపై తీవ్రంగా చూపింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతిపై లోకాయుక్తలో కేసు కూడా నడుస్తోంది. పరిశ్రమ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మై షుగర్ పరిశ్రమ అభివృద్ధికి రూ. 120 కోట్లను ప్రకటించింది. కంపెనీలో చెడిపోయిన యంత్రాలకు మరమ్మతు చేయడం, అవసరమైన విడిభాగాలను చేర్చడం, అన్ని విధాలుగా పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్‌లో చెరుకు క్రషింగ్ మై షుగర్ కంపెనీ తొలిదశలో ఏర్పాటు చేసిన బాయిలర్లు పూర్తిగాచెడిపోయాయి. కొంత కాలంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో బాయిలర్లతో పాటు చెరుకును పొడి చేసే యంత్రాలు కూడా చెడిపోయాయి. ఇప్పటికే ఈ యంత్రాలను బాగు చేస్తున్నారు. ఇందు కోసం తమిళనాడు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిం చారు. ఈ నెల చివరకు యంత్రాలను సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా చెడిపోయిన బాయిలర్లు మై షుగర్ కంపెనీలో ఉన్న రెండు బాయిలర్లు ఎందుకు పనికి రానంతా చెడిపోయాయి. మరో పదేళ్ల పాటు పనిచేయాల్సిన బాయిలర్లు సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి. ఇదే విషయాన్ని శాంకేతిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 2011 -12 పంట కాలంలో ఒక బాయిలర్‌లో చుక్క నీరు కూ డా లేకుండా నడిపించడంతో అది మొత్తం కాలిపోయింది. నిధుల కొరత గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ. 120 కోట్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదని అధికారులు తెలి పా రు. అయితే చెడిపోయిన బాయిలర్లును నోయిడా కంపెనీకి చెందిన నిపుణులకు చూపించామని, అవసరమున్న పరికరాలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ విషయం మంత్రి వర్గం సమావేశంలో కూడా చర్చలు జరిపారని, అనంతరం రూ. 95 కోట్లు విడుదల చేయడానికి మంత్రి వర్గం అంగీకరించిందని, ఈ నిధు లు కూడా విడుదల కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ యూనిట్ ప్రారంభం 2007లో మైషుగర్ ప్యాక్టరీలో విద్యుత్ యూనిట్‌ను సా్థి పంచారు. ఈ యూనిట్ కేవలం 17 గంటలు మాత్రమే పనిచేసేది. తర్వాత విద్యుత్ లేకుండా పోయేది. ప్రస్తుతం దీనిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ మహదేవు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నాటికి ప్రతి రోజూ 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విడుతల వారీగా విద్యుత్ ఉత్పాదన శక్తి కూడా 30 మెగా వాట్లకు పెంచనున్నట్లు తెలిపారు. -
సిద్ధం
- అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ - సహకారానికి వివిధ పార్టీల సంసిద్ధత - పనుల కోసం ప్రత్యేక కమిటీలు - సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం సాక్షి,సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదికగా నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయాల కు అతీతంగా అన్ని పార్టీలనూ కలుపుకొని ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో వివిధ పార్టీలు నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారమందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. నగరంలో నాలాలను ఆధునీకరించాలన్నా, రహదారులను వెడ ల్పు చేయాలన్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని పార్టీలను కలుపుకొని పోవడం.. స్థానిక ఎమ్మెల్యేకే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ-జలమండలి, హెచ్ఎండీఏ, విద్యుత్‌కు సంబంధించిన పనులపై ప్రత్యేక కమిటీలు వేస్తున్నారు. వీటి బాధ్యతలను సైతం నాలుగు పార్టీల నాయకులు కె.కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, మల్లారెడ్డి, కిషన్‌రెడ్డిలకు అప్పగించారు. వారు కమిటీలపై వెంటనే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. త్వరలోనే జీవో వెలువడనుంది. ఈ కమిటీలు వచ్చేనెల 8న మరోమారు సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనున్నాయి. తొలుత నాలాలు.. నీళ్లు.. చెత్త.... గృహ నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాలాల ఆధునికీకరణ నగరంలో నాలాల ఆధునికీకరణకు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించనిదే ఈ సమస్య పరిష్కారం కాదని సీఎం భావించారు. అందుకనుగుణంగా అన్ని పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడం... తాగునీటిలో మురుగునీరు కలుస్తున్న దుస్థితిని వివరించారు. కాలువలపై ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే విధి విధానాలు రూపొందించనున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో కనీసం రూ. 6వేల కోట్ల పనులైనా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆటోట్రాలీలు ఇళ్ల నుంచి చెత్త తరలింపునకు ప్రస్తుతమున్న రిక్షాల స్థానే ఆటోట్రాలీలు అందుబాటులోకి తేనున్నారు. బస్తీల్లోని నిరుద్యోగులకే వీటిని అందజేసి, ఇంటి చెత్త రోడ్డుపై ఎక్కడా పడకుండా డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేయనున్నారు. తొలిదశలో 2వేల ఆటోట్రాలీలను కొనుగోలు చేయనున్నారు. దీనికి దాదాపు రూ. 90 కోట్లు ఖర్చు చేయనున్నారు. 24 తక్షణ మరమ్మతు బృందాలు రహదారులపై గుంతలు, ఫుట్‌పాత్‌ల మరమ్మతుల వంటి చిన్నచిన్న పనులకు తక్షణ మరమ్మతు బృందాలను శాశ్వతంగా ఏర్పాటుచేయనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో వీటి వల్ల మంచి ఫలితం కనిపించిన సంగతి తెలిసిందే. 45 లక్షల డబ్బాలు ఇళ్లనుంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రెండు రంగుల డబ్బాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేయనుంది. దాదాపు 45 లక్షల డబ్బాలను వీలైనంత త్వరితంగా ప్రజలకు అందజేసే పనిలో పడ్డారు. తాగునీరు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ తాగునీటి సరఫరాకు అవసరమైన రూ.3100 కోట్లు, తాగునీరు.. మురుగునీరు కలిసిపోతుండటాన్ని నిరోధించేందుకు అవసరమైన రూ.3400 కోట్లు సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చే పనిని కూడా చేపట్టనున్నారు. సిబ్బంది కొరతపై దృష్టి జీహెచ్ఎంసీ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం సీఎం దృష్టికి వచ్చింది. అవసరమైన వారిని వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీటితో పాటు సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలని భావిస్తున్నారు. -
ఆగ్రహం.. అసహనం..
కేంద్రం నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల్లో స్పష్టత కొరవడడంతో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయూలి - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - వివరాలతో రాలేదంటూ అధికారులపై అసహనం - విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం హన్మకొండ : కేంద్రం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో వరంగల్ ఎంపీగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులచే చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. అధికారులు సరైన నివేదికలతో రాకపోవడం, సరిగా సమాధానం చెప్పకపోవడంపై శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. పలువురు సభ్యులు కొత్త రాష్ట్రం ఏర్పాటరుునా అధికారుల తీరులో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్ ఇంజనీరింగ్ శాఖ అమలు చేస్తున్న పీఎంజీఎస్‌వై పనులపై కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటాపురం మండలం లక్ష్మీపురం నుంచి కొండాపురం వెళ్లే రోడ్డులో నాలుగేళ్ల కింద నిర్మించిన క ల్వర్టు నిర్మించిన రెండు నెలలకే కూలిపోయిందని, మళ్లీ ఎందుకు నిర్మించలేదని మహబూబాబాద్ ఎంపీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ కోచైర్మన్ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలుగజేసుకుని.. రెండు నెలలకే కల్వర్టు కూలిపోతే కాంట్రాక్టర్, అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే మట్టి పనులపై చూపుతున్న శ్రద్ధ సీసీ, తారు పనులపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, మరుగుదొడ్ల బిల్లులను 15 రోజుల్లో చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆర్జీఎఫ్ పథకం రద్దయినందున విలీన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. ఐఏపీ పనులపై సీపీఓ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. వేజ్ కాంపోనెంట్ కంటే మెటీరియల్ కాంపోనెంట్ అధికంగా ఉన్నందున సకాలంలో బిల్లులు చెల్లించలేక పోయారన్నారు. ప్రస్తుతం రూ.1.90 లక్షల కూలీలకు పని కల్పించారన్నారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరు అయిన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని, నాలుగు వంతెనలకు గతంలో కన్న నాలుగింతల రివైజ్డ్ ఎస్టిమేట్ వేశారని, ఇంత తేడా ఎందుకు వచ్చిందని, ఈ పనులకు మంజూరు ఎలా లభిస్తుందని అధికారులను ప్రశ్నించారు. నిర్ణీత గడువులోగా పని చేయని కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పీఆర్ ఎస్ఈని ప్రశ్నించారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన పథకాల పనులు ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఆర్డీఓలతో నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చూ డాలన్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు శ్రీహరి తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వ్యక్తిగత లబ్ధిదారుల బకాయిలను పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చె ల్లింపు విషయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవక లు జరిగాయన్న కోణంలో ఆన్లైన్ ద్వారా విచారణ జరిపామన్నారు. రెండో దశ వెరిఫికేషన్ చేసి బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశం లో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, నామినేటెడ్ సభ్యులు పల్లెపాడు దామోదర్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
‘మహా’ మేలు!
- ‘స్వచ్ఛ హైదరాబాద్’తో శివారుకు మహర్దశ - అభివృద్ధి పనులకు సన్నాహాలు - మౌలిక వసతుల వైపు అడుగులు - అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో రూ.123 కోట్ల పనులు సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ పుణ్యమా అని గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలకు రూ.100 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో రూ.10 కోట్లలోపు పనులు జరగనున్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో శివారులోని నాలుగు నియోజకవర్గాల నుంచి రూ.వంద కోట్లకు పైగా ఖర్చయ్యే వినతులు అందాయి. కోర్‌సిటీలోని కొన్ని నియోజకవర్గాల నుంచి రూ.పది కోట్లలోపు వ్యయమయ్యే విజ్ఞప్తులు అందాయి. ఆమేరకు అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.వంద కోట్లకు పైగా పనులు ప్రతిపాదించిన నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి పనులకు దాదాపు రూ.123 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి (రూ.108 కోట్లు), ఎల్బీ నగర్ (రూ.107 కోట్లు), కూకట్పల్లి (రూ.100 కోట్లు) ఉన్నాయి. రూ.పది కోట్లలోపు ప్రతిపాదనల్లో కంటోన్మెంట్, యాకుత్‌పురా, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. నిధులెలా తెస్తారో? ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సిద్ధమయ్యాయి. వినతులు అందుకు మూడు రెట్లకు పైగా ఉన్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా బస్తీలకు నేతృత్వం వహించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల విజ్ఞప్తులను జీహెచ్ఎంసీకి నివేదించారు. వీటికి రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కేవలం పారిశుద్ధ్య కార్యక్రమంగా మిగలరాదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనిదే దానికి సార్థకత లేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులు విభాగాలు, యూనిట్ల వారీగా పనులను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ నెల 26న గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమీక్షించి పనులు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ నిధులు రూ.200 కోట్లతో వెంటనే పనులు చేపట్టేందుకు ఇబ్బంది లేనప్పటికీ, మిగతా రూ. 500 కోట్లు బాండ్ల ద్వారా సేకరిస్తారా.. ప్రభుత్వం కేటాయిస్తుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. -
బల్దియా బద్ధకం !
* యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం * రూ.52 లక్షలకు చేరిన బకాయిలు * పన్ను చెల్లించని హోటళ్లు,బార్లు, ఫంక్షన్ హాళ్లు సాక్షి, హన్మకొండ: అభివృద్ధి పనులు చేపట్టడంలోనే కాదు... ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలోనూ వరంగల్ నగరపాలక సంస్థ పనితీరు నిద్రమత్తును తలపిస్తోంది. వ్యాపార రంగంలో పేరెన్నిక గల బడా సంస్థల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయలేక అధికారులు చతికిలపడుతున్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లకు సంబంధించి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయూల్సిన బకాయిల విషయంలో కనీస మాత్రంగా విధులు నిర్వర్తించడంలేదు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఈ మూడు కేటగిరిల సంస్థలు చెల్లించాల్సిన యూజర్ చార్జీలే రూ.51.65 లక్షలకు చేరుకున్నాయి. నగర పరిధిలో వాణిజ్య పరంగా సేవలు అందిస్తున్న హోటళ్లు, బార్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి నిత్యం వెలువడే చెత్తను సేకరిస్తున్నందుకు ఆయా సంస్థల నుంచి వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ యూజర్ చార్జీలు వసూలు చేయాలి. వీటి ని కేటగిరీల వారీగా విభజించి నెలకు కనిష్టంగా రూ.1000 నుంచి రూ.4,500 వరకు నిర్ణయించారు. ప్రతి నెలా మొదటివారంలోనే ఈ యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా... నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో యూజర్ చార్జీలు చెల్లించడంలో బడా సంస్థలు సైతం మొండికేస్తున్నాయి. స్టార్ హోటళ్లు 11 ఉండగా, ఒక్కొక్కటి నెలకు రూ.4500, మధ్య తరహా హోటళ్లు 12 ఉండగా, ఒక్కొక్కటి రూ.2500... చిన్న హోటళ్లు 82 ఉండగా, ఒక్కొక్కటి రూ.750 చొప్పున యూజర్ చార్జీ చెల్లించాలి. పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లు ఒక్కొక్కటి నెలకు రూ.1200, చిన్న ఫంక్షన్ హాళ్లు రూ.1000 చెల్లించాలి. అవి సక్రమంగా వసూలు చేయకపోవడంతో గత ఏడాదికి యూజర్ చార్జీల రూపంలో రావాల్సిన రూ. 49.51 లక్షలు బకాయిలుగా పేరుకుపోయాయి. 2015 జనవరికి సంబంధించి ఈ మొత్తం రూ 2.14 లక్షలుగా ఉంది. యూజర్ చార్జీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు బల్దియా ఖజానాకు మొత్తం రూ.51.65 లక్షల ఆదాయం సమకూరుతుంది. బార్లదే అగ్రస్థానం యూజర్ చార్జీలను ఎగవేయడంలో బార్, రెస్టారెంట్లది అగ్రస్థానంగా ఉంది. నగర పరిధిలో మొత్తం 78 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు నెలకు రూ.1500, వైన్స్ దుకాణాలు రూ.1000 వంతున యూజర్ చార్జీలు చెల్లించాలి. బల్దియా లెక్కల ప్రకారం బార్లు, వైన్స్‌కు సంబంధించి యూజర్ చార్జీల బకాయిలు రూ. 22.84 లక్షలు ఉన్నాయి. వీటిలో మహర్షి (రాంపూర్), వెంకటరమణ (కాపువాడ), మధుశాల (ఏనుమాముల), ఆరుముఖ (కరీమాబాద్), మేఘన (హంటర్‌రోడ్డు), న్యూవాహిణి (అండర్‌బ్రిడ్జి), శ్రీవాసవి (ఫోర్టురోడ్డు), శ్రీవెంకటేశ్వర (ఎస్పీవీరోడ్డు), శ్రీవర్ష (ఎంజీరోడ్డు),శ్రీ శ్రావణి (ఎంజీరోడ్డు), కావేరి (ఎస్వీఎన్ రోడ్డు), శ్రీరుద్రాక్షిణి (ఎంజీ రోడ్డు), శ్రీబాలాజీ (దేశాయిపేట), శ్రీలక్ష్మి (దేశాయిపేట), సురేశ్ (నర్సంపేట రోడ్డు), భార్గవి (ఎల్బీనగర్), గిరిజ (లక్ష్మీపురం), మౌనిక(న్యూబస్టాండ్), రవిశివాజీ (విజయాటాకీస్ రోడ్డు), రామకృష్ణ (లష్కర్‌బజార్), రామా (హనుమాన్‌నగర్), శ్రీబాలాజీ (కిషన్‌పుర), రాజాశివాజీ (కొత్తూరు), న్యూ శ్రీనివాస (కుమార్‌పల్లి), మాతా (కుమార్‌పల్లి), తిరుమల (సర్క్యుట్హౌజ్), వెంకటేశ్వర (నక్కలగుట్ట),లాండ్‌మార్కు( నక్కలగుట్ట), ట్విలైట్ (బాలాసముద్రం), డాల్ఫిన్ (సుబేదారి), సోనా (సిద్ధార్థనగర్), శ్రీభవాని (సిద్దార్థనగర్)ు ఒక్కొక్కటి రూ 37,500 వంతున బకాయి చెల్లించాల్సి ఉంది. మిగిలిన బార్, రెస్టారెంట్లు బకాయిల చెల్లింపులో వీటి తర్వాత స్థానంలో ఉన్నాయి. భారీ బకాయిలు ఉన్న సంస్థలు... యూజర్ చార్జీల బకాయిల్లో నగరంలోని వివిధ హోటళ్లు రూ.15.14 లక్షలు, ఫంక్షన్ హళ్లు రూ 11.86 లక్షలు చెల్లించాల్సి ఉంది. వరంగల్ నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం హోటళ్ల విభాగంలో సుప్రభ హోటల్ రూ.1,12,500 బకాయి ఉండగా, రాజ్ లాడ్జ్, హవేలీ మల్టీ కుజిన్ రెస్టారెంట్, జూలూరి హోటల్, వరంగల్ బిర్యానీహౌస్, తయ్యాబ్ బిర్యానీ హౌజ్, శ్రీమంజునాథ హోటల్, నక్షత్ర హోటల్ యాజమాన్యాలు ఒక్కొక్కటి రూ. 62,500 వంతున యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు న్యూ ఫ్యామిలీ, సిటీదాబా రూ. 57,500, కాకతీయ హోటల్, అశోకా కాంప్లెక్స్ రూ. 45,000, నక్కలగుట్ట సురభి ఫుడ్కోర్ట్ రూ.1,12,500 బకాయి పడ్డాయి. ఫంక్షన్ హాళ్ల విభాగంలో పుష్పాంజలి, రాయల్, ఈడెన్ , చంద్ర, అనిల్ ఫంక్షన్‌హాళ్లకు సంబంధించిన యాజమాన్యాలు ఒక్కొక్కరు రూ 30,000 వంతున బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
యంత్రాంగం.. నిర్లక్ష్యం..
‘అధికారులు అలక్ష్యం వద్దు.. యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రెండు నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అందరూ సన్నద్ధంగా ఉండాలి’ - సోమవారం సమీక్షలో కేసీఆర్ ⇒ సీఎం సమీక్షలో వెల్లడైన అధికారుల అలక్ష్యం ⇒ వరంగల్ ఆర్అండ్బీ ఈఈ జనార్దన్‌రెడ్డి సరెండర్ ⇒ సీఎం ఫోన్ చేసినా స్పందించని ఈఈ ⇒ ఉత్సవాల తేదీల ఖరారుపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఈఈ జనార్దన్‌రెడ్డిపై వేటు పడింది. ఈఈ జనార్దన్‌రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఈఈ చిన్నపుల్లదాస్కు వరంగల్ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలన అంశాల విషయంలో జిల్లా యంత్రాంగం తీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో జిల్లా అభివృద్ధి విషయంలో అధికారుల వైఖరి కేసీఆర్‌ను అసహనికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా తాను ఫోన్ చేసి చెప్పినా అంశాలను పట్టించుకోకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ సహా పలువురు శాఖల అధికారుల పనితీరు, సమావేశంలో ఇచ్చే వివరణపై అసంతృప్తి దాచుకోలేకపోయారు. అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం సోమవారం జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ప్రధానంగా టెక్స్టైల్ పార్క్, రోడ్ల నిర్మాణం, కాకతీయ ఉత్సవాలపై సమీక్షించారు. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారుల విషయంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల కేసీఆర్ నేరుగా వరంగల్ డివిజన్ రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. స్వయంగా సీఎం ఫోన్ చేసి చెప్పినా జనార్దన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరును ప్రశ్నించారు. అందరూ ఏమి తెలియదని చెప్పినట్లుగా ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈఈ జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ఈ శాఖ ఎస్ఈ మోహన్‌నాయక్ సర్ది చేప్పేందుకు ప్రయత్నించారు. ఎస్ఈ తీరుపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈఈ జనార్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సూచించారు. అటవీ శాఖపై.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల స్థలాల సమాచారంపైనా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పార్క్ కోసం కనీసం వెయ్యి ఎకరాలు తగ్గకుండా స్థలాలు కావాలని సూచించినా.. జిల్లా అధికారులు 500 లోపు ఎకరాలు ఉన్న స్థలాలనే ప్రతిపాదనల్లో పెట్టారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఏరియల్సర్వే షెడ్యూల్ మారింది. నగరానికి సమీపంలో ఒకే చోట 2 వేల ఎకరాల వరకు ఉన్న స్థలాలను సూచించాలని సమీక్షలో అటవీ అధికారులను ఆదేశించారు. నగరానికి 20 కి.మీ పరిధిలో, 30 కి.మీ పరి ధిలోని అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ ముఖ్య అధికారి రాజారావు ఇవ్వలేకపోయారు. గంటలోపు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా చెప్పిన 45 నిమిషాల తర్వాత అటవీ శాఖ అధికారులకు సీఎం గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. కాకతీయ ఉత్సవాలపైనా.. కాకతీయ ఉత్సవాల నిర్వహణ తేదీలను కలెక్టర్ జి.కిషన్ ప్రకటించడంపైనా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. తేదీలను ఎలా ప్రకటిస్తారని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య మొదట కలెక్టర్ జి.కిషన్‌ను ప్రశ్నిం చారు. ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించకుం టే ఎలా అని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సమీక్ష సమావేశానికి సంధించిన సమాచారాన్ని పొందుపరిచిన పుస్తకాలను సమావేశంలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న స్పీకర్, మంత్రులకే ఇవ్వడంపై రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మనది పారదర్శక ప్రభుత్వమని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమీక్ష వివరాలు అందరికీ ఇవ్వకపోతే ఎలా అని కలెక్టర్ జి.కిషన్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సమాచార పుస్తకం నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా ప్రధాన అంశాలపై అధికారుల తీరు సరిగా లేకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2 నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అప్పుడు అందరం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి’ అని కేసీఆర్ చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ తీరుతో జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు చులకన భావం ఏర్పడిందని జిల్లా ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. -
వచ్చేనెల 16న జిల్లాకు సచిన్
* పుట్టంరాజుకండ్రిగ అభివృద్ధికి రూ.3.5 కోట్ల ఎంపీల్యాడ్స్ * వేగంగా జరుగుతున్న పనులు నెల్లూరు(పొగతోట): రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వచ్చేనెల 16వ తేదీన జిల్లాకు రానున్నారు. సచిన్ టెండూల్కర్ గూడూరు రూరల్ మండలం పుట్టంరాజుకండ్రిగ గ్రామాభివృద్ధికి రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించారు. విడుదల చేసిన నిధులతో పుట్టంరాజుకండ్రిగాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనుల వివరాలను సచిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు అధికారిక సమాచారం. కలెక్టర్ శ్రీకాంత్ గ్రామీణ ప్రాంతాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పుట్టంరాజుకండ్రిగను ఎంపిక చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పుట్టంరాజుకండ్రిగలో 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, పాఠశాల, డంపింగ్‌యార్డు తదితర పనులు చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని పనులను పర్వవేక్షిస్తున్నారు. -
కీలక పోస్టులుఖాళీ...
జెడ్పీ సీఈఓ పోస్టు సహా భర్తీకాని 12 స్థానాలు కొన్ని నెలలుగా ఇన్చార్జలతోనే పాలన ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు మందగిస్తున్న అభివృద్ధి పనులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఎన్నో ఆశలతో పాలన మొదలైంది.. నూతన పథకాలు ప్రారంభమతున్నాయి.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది, పథకాలను అమలు చేసేది అధికార యంత్రాంగమే.. జిల్లా స్థాయి అధికారుల పాత్ర దీంట్లో కీలకంగా ఉంటుంది. వీరే, ఆయా శాఖల సిబ్బందిని పరిపాలన పరంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అయితే పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. ఇన్చార్జ అధికారులతో నెట్టుకురావాల్సి వస్తోంది. ఒకే అధికారి రెండు మూడు పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమం అమలు మందగిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికల రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లకు అప్పగించింది. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ప్రణాళిక తయారీ బాధ్యతలను చూడాలి. ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. జిల్లా పరిషత్ సీఈఓ పోస్టు నెల రోజుల క్రితమే ఖాళీ అయింది. జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లుకు జిల్లా పరిషత్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకే అధికారి రెండు కీలకమైన పోస్టుల్లో ఉండడంతో విధుల నిర్వహణ సాఫీగా సాగడం లేదు. మన ఊరు... మన ప్రణాళికకు సంబంధించి కూడా ముందుగా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో ఈ పని చేయకపోవడంతో కొత్త కార్యక్రమం స్ఫూర్తి పూర్తిగా నెరవేరలేదు. గతంలో లాగే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ రేషన్‌కార్డులకు, సామాజిక పించన్లకు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎక్కువ గ్రామాల్లో ప్రణాళిక రూపలక్పన అంశం రెండో ప్రాధాన్యంగా జరిగింది. ప్రాథమిక విద్యకు సంబంధించి కీలకమైన రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి పోస్టు ఖాళీగా ఉంది. దీనికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు జాయింట్ కలెక్టర్ నిర్వహిస్తారు. ఇప్పుడు ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి బాధ్యతలు అదనంగా చూడాల్సి వస్తోంది. సహకార శాఖను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో జిల్లా సహకార శాఖ అధికారి(డీసీవో) పోస్టు ఖాళీగా ఉంది. డివిజన్ స్థాయి సహకార అధికారి సంజీవరెడ్డి డీసీవో పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దళితుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పోస్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులో సైతం ఇంచార్జీ అధికారే ఉన్నారు. రెవెన్యూకు సంబంధించి పట్టణంలో కీలకమైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేసే అధికారి రెవెన్యూ మంత్రి పేషీలో చేరి రెండు నెలలు గడుస్తున్నా కొత్తగా ఏ అధికారినీ నియమించ లేదు. ఏటూరునాగారంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పోస్టు నెలల క్రితమే ఖాళీ అయింది. ములుగు రెవెన్యూ డివి జనల్ అధికారి మోతీలాల్‌కు ఈ పోస్టును అదనపు బాధ్యతల కింద అప్పగించారు. శాఖకు సంబంధించి జిల్లాలోని డిప్యూటీ డెరైక్టరు పోస్టు ఖాళీగానే ఉంది. ఈ శాఖ అసిస్టెంట్ డెరైక్టరు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాలై అమలుపై అధికార యంత్రాంగానికి ప్రజలకు సంధానకర్తగా వ్యవహరించే సమాచార శాఖలోనూ ఖాళీలు ఉన్నా యి. జిల్లా ప్రజాసంబంధాల అధికారి పోస్టులో దాదాపు రెండు నెలలుగా ఇంచార్జీ అధికారే ఉన్నారు. తాజాగా... గురువారం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనే జరు ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో నల్లగొండ జిల్లా జోనల్ మేనేజర్ రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి(సీఈవో) ఖాళీగా ఉంది. సీఈఓగా పనిచేసిన ఆంజనేయులు నెల క్రితం ఉద్యోగ విరమణ పొందగా.. జిల్లా నీటి నిర్వహణ సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.వెంకటేశ్వర్లుకు జెడ్పీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాకు పూర్తి స్థాయి అధికారి లేరు. ఈ పోస్టులో ఉన్న పి.సాంబశివరావును కొన్ని రోజుల క్రితం రీజినల్ డెరైక్టర్‌గా నియమించారు. తాజాగా ఆయన గురువారం వైద్య శాఖ రాష్ట్ర అదనపు డెరైక్టర్‌గా నియమితుల య్యారు. ఆయనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జ అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయూనికి కీలక తరుణమిది. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖకు జిల్లాలో పూర్తి స్థాయి అధికారి లేరు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి(జేడీఏ) పోస్టులో కింది స్థాయి అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
‘గిరి’జన పల్లెల్లో వెలుగు!
చురుగ్గా మౌలిక వసతుల అభివృద్ధి పనులు సెప్టెంబర్‌కల్లా పూర్తి చేయాలని పీవో ఆదేశం పాడేరు: ఏజెన్సీలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన ఆదివాసీ గ్రామాల్లో సమగ్ర సామాజికాభివృద్ధి పథకం (సీసీడీపీ) వెలుగులు నింపుతోంది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాటి మంత్రి పి.బాలరాజు చొరవతో మొదటి విడతగా 64 ఆదివాసీ గ్రామాలకు రూ.19 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో సామాజిక భవనాలు, డీఆర్ డిపోలు, సీసీ రోడ్లు, తాగునీటి పథకాల పనులకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారుచేశారు. అయితే ఈలోగా సార్వత్రిక ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఎన్నికలు ముగియగానే గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో ఎంపిక చేసిన 64 గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభించారు. మండల ప్రత్యేక అధికారులు కూడా ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాడేరు మండలంలోని డల్లాపల్లి, జీడిపగడ, ఎగుసొలముల, పిల్లిపుట్టు గ్రామాలకు రూ. 1.18 కోట్లు, అనంతగిరి మండలంలోని మూడు గ్రామాలకు రూ.78 లక్షలు, అరకులోయ మండలంలోని ఆరు గ్రామాలకు రూ. 1.80 కోట్లు, డుంబ్రిగుడలోని రెండు గ్రామాలకు రూ. 78 లక్షలు, పెదబయలు మండలంలోని 8 గ్రామాలకు రూ. 1.85 కోట్లు, ముంచంగిపుట్టు మండలంలో పది గ్రామాలకు రూ. 3.70 కోట్లు, జి.మాడుగుల మండలంలోని ఆరు గ్రామాలకు రూ. 2.2 కోట్లు, చింతపల్లిలో ఆరు గ్రామాలకు రూ. 2 కోట్లు, జీకేవీధి మండలంలో 10 గ్రామాలకు రూ. 2.41 కోట్లు, కొయ్యూరు మండలంలోని 4 గ్రామాలకు రూ. 1.34 కోట్లతో తలపెట్టిన వివిధ నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఇవన్నీ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ ఇంజనీరింగ్ అధికారులకు నిర్దేశించారు. -
కాంట్రాక్టర్లకు ధనజాతర
=మేడారం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు =అధికారులతో కాంట్రాక్టర్ల ‘ముందస్తు’ ఒప్పందం =లెస్తో పనులు దక్కించుకుంటున్న వైనం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు లెస్(తక్కువ)తో టెండర్లు దాఖలు చేస్తూ ముందుకు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా సుమారు రూ.80కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే గత జాతరలో పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఈసారి సంబంధిత శాఖ అధికారులతో ‘ముందస్తు’ ఒప్పందం చేసుకుని పనుల మంజూరు కోసం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధులు మంజూరు చేయించే బాధ్యతను అధికారులే తీసుకోవడంతో కాంట్రాక్టర్లు సూచించిన మేరకే పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగానైనా చేపట్టనున్న పనులకు నిధులను తామే తెస్తున్నందున టెండర్లు కూడా తమకే దక్కుతాయని చెప్పి పలువురు కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియ పూర్తికాకున్నా పనులు ప్రారంభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆర్అండ్బీ శాఖ ఈ-ప్రొక్యూర్మెంట్లో టెండర్లు నిర్వహించడం, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయడంతో కొన్ని పనులను ఆయా కాంట్రాక్ట ర్లు ప్రారంభించారు. అయితే ఇరిగేషన్ శాఖలో జరుగుతు న్న మాయాజాలం అంతా ఇంతా కాదు. గత రెండు జాతరల సందర్భంగా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ ఆరునెలల క్రితమే తన పలుకుబడిని ఉపయోగించుకుని సీఎం పేషీ నుంచి మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. జాతరలో నిధులు మొత్తం తనకే కేటాయిస్తే పనులను విభ జించాల్సి వస్తుందని భావించి ఇప్పుడు మంజూరైన పను ల నుంచి సగం వాటినే ప్రస్తుతం చేపట్టే విధంగా జీఓను జారీ చేయించడంలో అతడు విజయం సాధించాడు. కా గా, మంజూరైన నిధులతో చేపట్టే పనులను విభజించే అధికారం ఇరిగేషన్ ఎస్ఈకి ఉంటుందని తెలి సింది. అయితే ఈ నిబంధనను తొక్కి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శితో టెండర్లను విభజించి కా కుండా ఒకే పనిగా టెండర్లు పిలవాలన్న ఆదేశాలు ఇప్పిం చడంతో ఆయన పలుకుబడి ఏమిటో అందరికీ అర్థమైంది. లెస్తో నాణ్యత ఎలా... పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15.08 కిలోమీటర్ల రహదారులను రూ.7.69కోట్ల వ్యయంతో మరమ్మతులు, అభివృ ద్ధి చేసేందుకు టెండర్లు నిర్వహించారు. ఇందులో మేడా రం గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి నార్లాపూర్ ఆర్అం డ్బీ రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.67లక్షలు కేటాయించారు. అయితే ఈ పనిని దక్కించుకునేందుకు కరీంనగర్‌కు చెంది న కాంట్రాక్టర్ ఏకంగా 32 శాతం లెస్ వేయడం, మరో పనికి 26 శాతం నుంచి 5 శాతం వరకు తక్కువగా టెం డర్లు దాఖలు కావడంతో శాఖలోని అధికారులు విస్మ యానికి గురయ్యారు. కాంట్రాక్టర్ చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం శాఖాపరంగా మరో 12 శాతం వరకు ఖర్చులుంటాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో తక్కువ వేసిన 32 శాతం కలిస్తే వంద రూపాయల పనిని యాభై రూపాయలకే చేయాల్సి ఉంటుంది. ఈ పనిని పొందిన కాంట్రాక్టర్ మరీ తక్కువగా వేయడంతో, తక్కువ వేసిన మొత్తానికి నిబంధనల ప్రకారం ఏఎస్డీ(అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పని రద్దు చేయాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి భావించారు. సదరు కాంట్రాక్టర్ ఏఎస్డీ రూ.7.43లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడంతో శాఖలోని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. టెండర్లలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోకపోయినప్పటికీ పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లతో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు... ఇంజినీరింగ్ అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల వల్లనే ఎంత లెస్(తక్కువ శాతం)కైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజం కాదనకుండా ఉండలేం. ఏ మేరకు రోడ్లు వేస్తున్నారు...ఎంత వరకు బిల్లులు చెల్లిస్తున్నారో జాతర తర్వాత పట్టించుకున్న అధికారి ఇప్పటి వరకు లేరు. జాతర ముగిసిన వెంటనే అధికారులు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడమే ఇందుకు కారణం. ఈ వెసులుబాటుతోనే కాంట్రాక్టర్లు ఎస్టిమేట్లు ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ పనులను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు పనులను పట్టించుకోకపోవడంతో గతంలో ఓసారి జాతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మళ్లీ వచ్చే జాతరకు పో టీపడడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.