కాంట్రాక్టర్లకు ధనజాతర | Contractors dhanajatara | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లకు ధనజాతర

Published Thu, Dec 19 2013 4:22 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

Contractors dhanajatara

=మేడారం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు
 =అధికారులతో కాంట్రాక్టర్ల ‘ముందస్తు’ ఒప్పందం
 =లెస్‌తో పనులు దక్కించుకుంటున్న వైనం

 
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు లెస్(తక్కువ)తో టెండర్లు దాఖలు చేస్తూ ముందుకు వస్తుండడమే ఇందుకు నిదర్శనం.
 
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అర్‌డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా సుమారు రూ.80కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే గత జాతరలో పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఈసారి సంబంధిత శాఖ అధికారులతో ‘ముందస్తు’ ఒప్పందం చేసుకుని పనుల మంజూరు కోసం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధులు మంజూరు చేయించే బాధ్యతను అధికారులే తీసుకోవడంతో కాంట్రాక్టర్లు సూచించిన మేరకే పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఏ విధంగానైనా చేపట్టనున్న పనులకు నిధులను తామే తెస్తున్నందున టెండర్లు కూడా తమకే దక్కుతాయని చెప్పి పలువురు కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియ పూర్తికాకున్నా పనులు ప్రారంభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆర్‌అండ్‌బీ శాఖ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు నిర్వహించడం, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయడంతో కొన్ని పనులను ఆయా కాంట్రాక్ట ర్లు ప్రారంభించారు. అయితే ఇరిగేషన్ శాఖలో జరుగుతు న్న మాయాజాలం అంతా ఇంతా కాదు.

గత రెండు జాతరల సందర్భంగా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ ఆరునెలల క్రితమే తన పలుకుబడిని ఉపయోగించుకుని సీఎం పేషీ నుంచి మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. జాతరలో నిధులు మొత్తం తనకే కేటాయిస్తే పనులను విభ జించాల్సి వస్తుందని భావించి ఇప్పుడు మంజూరైన పను ల నుంచి సగం వాటినే ప్రస్తుతం చేపట్టే విధంగా జీఓను జారీ చేయించడంలో అతడు విజయం సాధించాడు. కా గా, మంజూరైన నిధులతో చేపట్టే పనులను విభజించే అధికారం ఇరిగేషన్ ఎస్‌ఈకి ఉంటుందని తెలి సింది. అయితే ఈ నిబంధనను తొక్కి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శితో టెండర్లను విభజించి కా కుండా ఒకే పనిగా టెండర్లు పిలవాలన్న ఆదేశాలు ఇప్పిం చడంతో ఆయన పలుకుబడి ఏమిటో అందరికీ అర్థమైంది.
 
లెస్‌తో నాణ్యత ఎలా...

పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15.08 కిలోమీటర్ల రహదారులను రూ.7.69కోట్ల వ్యయంతో మరమ్మతులు, అభివృ ద్ధి చేసేందుకు టెండర్లు నిర్వహించారు. ఇందులో మేడా రం గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి నార్లాపూర్ ఆర్‌అం డ్‌బీ రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.67లక్షలు కేటాయించారు. అయితే ఈ పనిని దక్కించుకునేందుకు కరీంనగర్‌కు చెంది న కాంట్రాక్టర్ ఏకంగా 32 శాతం లెస్ వేయడం, మరో పనికి 26 శాతం నుంచి 5 శాతం వరకు తక్కువగా టెం డర్లు దాఖలు కావడంతో శాఖలోని అధికారులు విస్మ యానికి గురయ్యారు.

కాంట్రాక్టర్ చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం శాఖాపరంగా మరో 12 శాతం వరకు ఖర్చులుంటాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో తక్కువ వేసిన 32 శాతం కలిస్తే వంద రూపాయల పనిని యాభై రూపాయలకే చేయాల్సి ఉంటుంది. ఈ పనిని పొందిన కాంట్రాక్టర్ మరీ తక్కువగా వేయడంతో, తక్కువ వేసిన మొత్తానికి నిబంధనల ప్రకారం ఏఎస్‌డీ(అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పని రద్దు చేయాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి భావించారు. సదరు కాంట్రాక్టర్ ఏఎస్‌డీ రూ.7.43లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడంతో శాఖలోని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. టెండర్లలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోకపోయినప్పటికీ పనులు ప్రారంభించారు.
 
ఎస్టిమేట్లతో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు...

ఇంజినీరింగ్ అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల వల్లనే ఎంత లెస్(తక్కువ శాతం)కైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజం కాదనకుండా ఉండలేం. ఏ మేరకు రోడ్లు వేస్తున్నారు...ఎంత వరకు బిల్లులు చెల్లిస్తున్నారో జాతర తర్వాత పట్టించుకున్న అధికారి ఇప్పటి వరకు లేరు. జాతర ముగిసిన వెంటనే అధికారులు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడమే ఇందుకు కారణం. ఈ వెసులుబాటుతోనే కాంట్రాక్టర్లు ఎస్టిమేట్లు ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ పనులను దక్కించుకుంటున్నట్లు  తెలుస్తోంది. అధికారులు పనులను పట్టించుకోకపోవడంతో గతంలో ఓసారి జాతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మళ్లీ వచ్చే జాతరకు పో టీపడడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement