‘మై షుగర్’కు పూర్వవైభవం | My Sugar Company Developments | Sakshi
Sakshi News home page

‘మై షుగర్’కు పూర్వవైభవం

Published Wed, Aug 5 2015 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

‘మై షుగర్’కు పూర్వవైభవం

‘మై షుగర్’కు పూర్వవైభవం

- సెప్టెంబర్‌లో చక్కెర ఉత్పత్తి
- అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా
మండ్య :
చాలా కాలం తర్వాత మండ్య జిల్లాలో  మై షుగర్ కంపెనీ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ పరిశ్రమలో చక్కెర ఉత్పత్తిని ప్రారంభించే దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన ఈ పరిశ్రమ పాలక మండలి సభ్యులు కేవలం పదవులను అలంకరించేందుకు పరిమితయ్యారు తప్పా, పరిశ్రమ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో పరిశ్రమ మూతపడేందుకు కారణమైంది. ఈ ఐదేళ్లలో పరిశ్రమ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

చెరుకును క్రష్ చేస్తే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. సాంకేతిక లోపాలు తలె త్తాయి. చెరుకును క్రష్ చేసే సమయంలో యంత్రాలు ఆగిపోయేవి. ఈ ప్రభావం చెరుకు రైతులపై తీవ్రంగా చూపింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతిపై లోకాయుక్తలో కేసు కూడా నడుస్తోంది. పరిశ్రమ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో మై షుగర్ పరిశ్రమ అభివృద్ధికి రూ. 120 కోట్లను ప్రకటించింది. కంపెనీలో చెడిపోయిన యంత్రాలకు మరమ్మతు చేయడం, అవసరమైన విడిభాగాలను చేర్చడం, అన్ని విధాలుగా పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
సెప్టెంబర్‌లో చెరుకు క్రషింగ్
మై షుగర్ కంపెనీ తొలిదశలో ఏర్పాటు చేసిన బాయిలర్లు పూర్తిగాచెడిపోయాయి. కొంత కాలంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో బాయిలర్లతో పాటు చెరుకును పొడి చేసే యంత్రాలు కూడా చెడిపోయాయి. ఇప్పటికే ఈ యంత్రాలను బాగు చేస్తున్నారు. ఇందు కోసం తమిళనాడు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పిం చారు. ఈ నెల చివరకు యంత్రాలను సిద్ధం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
పూర్తిగా చెడిపోయిన బాయిలర్లు
మై షుగర్ కంపెనీలో ఉన్న రెండు బాయిలర్లు ఎందుకు పనికి రానంతా చెడిపోయాయి. మరో పదేళ్ల పాటు పనిచేయాల్సిన బాయిలర్లు సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి. ఇదే విషయాన్ని శాంకేతిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. 2011 -12 పంట కాలంలో ఒక బాయిలర్‌లో చుక్క నీరు కూ డా లేకుండా నడిపించడంతో అది మొత్తం కాలిపోయింది.
 
నిధుల కొరత
గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన రూ. 120 కోట్లు ఇప్పటి వరకు మంజూరు కాలేదని అధికారులు తెలి పా రు. అయితే చెడిపోయిన బాయిలర్లును నోయిడా కంపెనీకి చెందిన నిపుణులకు చూపించామని, అవసరమున్న పరికరాలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. బడ్జెట్ విషయం మంత్రి వర్గం సమావేశంలో కూడా చర్చలు జరిపారని, అనంతరం రూ. 95 కోట్లు విడుదల చేయడానికి మంత్రి వర్గం అంగీకరించిందని, ఈ నిధు లు కూడా విడుదల కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ యూనిట్ ప్రారంభం
2007లో మైషుగర్ ప్యాక్టరీలో విద్యుత్ యూనిట్‌ను సా్థి పంచారు. ఈ యూనిట్ కేవలం 17 గంటలు మాత్రమే పనిచేసేది. తర్వాత విద్యుత్ లేకుండా పోయేది. ప్రస్తుతం దీనిని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ మహదేవు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నాటికి ప్రతి రోజూ 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విడుతల వారీగా విద్యుత్ ఉత్పాదన శక్తి కూడా 30 మెగా వాట్లకు పెంచనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement