వచ్చేనెల 16న జిల్లాకు సచిన్ | On November 16th the district to Sachin | Sakshi
Sakshi News home page

వచ్చేనెల 16న జిల్లాకు సచిన్

Published Fri, Oct 17 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

వచ్చేనెల 16న జిల్లాకు సచిన్

వచ్చేనెల 16న జిల్లాకు సచిన్

* పుట్టంరాజుకండ్రిగ అభివృద్ధికి రూ.3.5 కోట్ల ఎంపీల్యాడ్స్  
* వేగంగా జరుగుతున్న పనులు

నెల్లూరు(పొగతోట): రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వచ్చేనెల 16వ తేదీన జిల్లాకు రానున్నారు. సచిన్ టెండూల్కర్ గూడూరు రూరల్ మండలం పుట్టంరాజుకండ్రిగ గ్రామాభివృద్ధికి రాజ్యసభ నిధుల నుంచి రూ.3.5 కోట్లు కేటాయించారు. విడుదల చేసిన నిధులతో పుట్టంరాజుకండ్రిగాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనుల వివరాలను సచిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు అధికారిక సమాచారం. కలెక్టర్ శ్రీకాంత్ గ్రామీణ ప్రాంతాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పుట్టంరాజుకండ్రిగను ఎంపిక చేశారు.

గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పుట్టంరాజుకండ్రిగలో 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, పాఠశాల, డంపింగ్‌యార్డు తదితర పనులు చేపడుతున్నారు. కలెక్టర్, జేసీ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని పనులను పర్వవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement