త్వరలో పుట్టంరాజు కండ్రిగకు సచిన్?
-
ఏర్పాట్లు పరిశీలించిన జేసీ, సచిన్ పీఏ
గూడూరు:
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ దత్తత గ్రామం అయిన పుట్టమరాజు కండ్రిగలో జేసీ ఇంతియాజ్, సచిన్ పీఏ నారాయణలతోపాటు ఇన్‌చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్యలతో కలిసి గురువారం పర్యటించారు. త్వరలో సచిన్ ఆ గ్రామానికి రానున్నారని, ఈ మేరకే జేసీ గ్రామాన్ని విజిట్ చేసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను వర్మిక్యులైట్, టైలరింగ్, పచ్చళ్ల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వచ్చిన ఏజన్సీవారితో పలు విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు, త్వరితగతిన గ్రౌండ్‌ను చదును చేయాలని సంబంధిత అధికారుకు ఆదేశించారు. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు విస్తరణలో 7 కాలనీ ఇళ్ల బేస్‌మెంట్లు తీసివేయడం జరిగింది. దీంతో హౌసింగ్ అధికారులు ఆ మొత్తాన్ని మినహాఇంచి బిల్లులు చేస్తామని చెప్పడంతో ఆ మొత్తంతో తాము ఇళ్ల నిర్మించుకోలేమని, నూతనంగా ఇళ్లు మంజూరుకు గతంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గ్రామాన్ని సందర్శించిన సమయంలో వారు విన్నవించుకోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి పూర్తి పేమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ ఆ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయన వెంట చీఫ్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకయ్య, ఇతర శాఖాధికారులు ఉన్నారు.