ఆగ్రహం.. అసహనం.. | speedup development workers said srihari | Sakshi
Sakshi News home page

ఆగ్రహం.. అసహనం..

Published Sun, May 24 2015 4:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

ఆగ్రహం.. అసహనం..

ఆగ్రహం.. అసహనం..

కేంద్రం నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల్లో స్పష్టత కొరవడడంతో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
 అభివృద్ధి పనులను వేగవంతం చేయూలి
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
- వివరాలతో రాలేదంటూ అధికారులపై అసహనం
- విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
హన్మకొండ :
కేంద్రం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో వరంగల్ ఎంపీగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులచే చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

అధికారులు సరైన నివేదికలతో రాకపోవడం, సరిగా సమాధానం చెప్పకపోవడంపై శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. పలువురు సభ్యులు కొత్త రాష్ట్రం ఏర్పాటరుునా అధికారుల తీరులో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్ ఇంజనీరింగ్ శాఖ అమలు చేస్తున్న పీఎంజీఎస్‌వై పనులపై కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటాపురం మండలం లక్ష్మీపురం నుంచి కొండాపురం వెళ్లే రోడ్డులో నాలుగేళ్ల కింద నిర్మించిన క ల్వర్టు నిర్మించిన రెండు నెలలకే కూలిపోయిందని, మళ్లీ ఎందుకు నిర్మించలేదని మహబూబాబాద్ ఎంపీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ కోచైర్మన్ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ప్రశ్నించారు.

దీంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలుగజేసుకుని.. రెండు నెలలకే కల్వర్టు కూలిపోతే కాంట్రాక్టర్, అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే మట్టి పనులపై చూపుతున్న శ్రద్ధ సీసీ, తారు పనులపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, మరుగుదొడ్ల బిల్లులను 15 రోజుల్లో చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆర్‌జీఎఫ్ పథకం రద్దయినందున విలీన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు.

ఐఏపీ పనులపై సీపీఓ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. వేజ్ కాంపోనెంట్ కంటే మెటీరియల్ కాంపోనెంట్ అధికంగా ఉన్నందున సకాలంలో బిల్లులు చెల్లించలేక పోయారన్నారు. ప్రస్తుతం రూ.1.90 లక్షల కూలీలకు పని కల్పించారన్నారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరు అయిన నిర్మాణ  పనుల్లో జాప్యం జరుగుతుందని, నాలుగు వంతెనలకు గతంలో కన్న నాలుగింతల రివైజ్డ్ ఎస్టిమేట్ వేశారని, ఇంత తేడా ఎందుకు వచ్చిందని, ఈ పనులకు మంజూరు ఎలా లభిస్తుందని అధికారులను ప్రశ్నించారు.

నిర్ణీత గడువులోగా పని చేయని కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పీఆర్ ఎస్‌ఈని ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన పథకాల పనులు ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, ఆర్డీఓలతో నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చూ డాలన్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు శ్రీహరి తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు.

కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వ్యక్తిగత లబ్ధిదారుల బకాయిలను పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చె ల్లింపు విషయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవక లు జరిగాయన్న కోణంలో ఆన్‌లైన్ ద్వారా విచారణ జరిపామన్నారు. రెండో దశ వెరిఫికేషన్ చేసి బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశం లో జెడ్పీ  చైర్‌పర్సన్ గద్దల పద్మ, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, నామినేటెడ్ సభ్యులు పల్లెపాడు దామోదర్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement