center funding
-
‘కేంద్రం’ వాటాకు ‘కత్తెర’
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా జాతీయ హోదా పొందిన సాగు నీటి ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం ఇచ్చే నిధులకు కత్తెర వేసింది. కొత్త జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలి. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు వాటికి జాతీయ హోదా కల్పించి, అంచనా వ్యయంలో 90 శాతం నిధులను ఇప్పటివరకూ కేంద్రం భరిస్తోంది. ఇప్పుడా నిధుల్లో కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర ప్రాజెక్టులకూ ఇదే రీతిలో నిధులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, లడఖ్‌లకు పాత విధానంలోనే 90 శాతం ఇవ్వనుంది. ఇంతకు ముందే ఆమోదం పొందిన పోలవరంతోపాటు 15 జాతీయ ప్రాజెక్టులకు ప్రస్తుత పద్ధతి ప్రకారమే 90 శాతం నిధులిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తెలిపింది. జాతీయ హోదా కల్పన, నిధులు మరింత క్లిష్టం ► తాజా మార్గదర్శకాల ప్రకారం.. నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుదుత్పత్తి వ్యయం తదితర సమస్యల వల్ల నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాని అంతర్రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా కల్పించి, సత్వరమే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నీటి లభ్యత, పంపిణీ సమస్య లేకుండా ఒక రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించనుంది. ► ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తారు. ► రాష్ట్రం తన వాటా నిధులను జమ చేసి.. 75 శాతం ఖర్చు చేయకపోతే కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే.. ఆమోదం పొందిన పెరిగిన వ్యయంలో 20 శాతమే కేంద్రం భరిస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్రాలే భరించాలి. ► పాత విధానంలో కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టే జాతీయ హోదా కింద కేంద్రం నిధులిచ్చే చివరి ప్రాజెక్టు. ఏఐబీపీ నిధుల మంజూరులోనూ కోత నిధుల కొరత వల్ల సకాలంలో పూర్తి కాని దేశంలోని 99 ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం నిధులిస్తోంది. కొత్తగా ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకూ నిధుల మంజూరులో కోతలు పెడుతూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ► ఎనిమిది ఈశాన్య, రెండు హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢఖ్‌లలో ఏఐబీపీ కింద కొత్త ఎంపిక చేసే ప్రాజెక్టులకు వాటి అంచనా వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. ► కరవు నివారణ పథకం (డీపీఏపీ), ఎడారి నివారణ పథకం(డీడీపీ) అమలవుతున్న ప్రాంతాలు, గిరిజన, వరద ప్రభావిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, మరఠ్వాడ, కేబీకే (ఒడిశా) ప్రాంతాల్లో కొత్తగా ఎంపిక చేసే ఏఐబీపీ ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 60 శాతం ఇవ్వనుంది. మిగతా ప్రాంతాల్లో ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 25 శాతం నిధులిస్తుంది. మిగతా వ్యయాన్ని ఆ రాష్ట్రాలే భరించాలి. -
ఆగ్రహం.. అసహనం..
కేంద్రం నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల్లో స్పష్టత కొరవడడంతో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయూలి - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - వివరాలతో రాలేదంటూ అధికారులపై అసహనం - విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం హన్మకొండ : కేంద్రం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో వరంగల్ ఎంపీగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులచే చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. అధికారులు సరైన నివేదికలతో రాకపోవడం, సరిగా సమాధానం చెప్పకపోవడంపై శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. పలువురు సభ్యులు కొత్త రాష్ట్రం ఏర్పాటరుునా అధికారుల తీరులో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్ ఇంజనీరింగ్ శాఖ అమలు చేస్తున్న పీఎంజీఎస్‌వై పనులపై కడియం అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటాపురం మండలం లక్ష్మీపురం నుంచి కొండాపురం వెళ్లే రోడ్డులో నాలుగేళ్ల కింద నిర్మించిన క ల్వర్టు నిర్మించిన రెండు నెలలకే కూలిపోయిందని, మళ్లీ ఎందుకు నిర్మించలేదని మహబూబాబాద్ ఎంపీ, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ కోచైర్మన్ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలుగజేసుకుని.. రెండు నెలలకే కల్వర్టు కూలిపోతే కాంట్రాక్టర్, అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చే మట్టి పనులపై చూపుతున్న శ్రద్ధ సీసీ, తారు పనులపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, మరుగుదొడ్ల బిల్లులను 15 రోజుల్లో చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆర్జీఎఫ్ పథకం రద్దయినందున విలీన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. ఐఏపీ పనులపై సీపీఓ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. తర్వాత కడియం శ్రీహరి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. వేజ్ కాంపోనెంట్ కంటే మెటీరియల్ కాంపోనెంట్ అధికంగా ఉన్నందున సకాలంలో బిల్లులు చెల్లించలేక పోయారన్నారు. ప్రస్తుతం రూ.1.90 లక్షల కూలీలకు పని కల్పించారన్నారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరు అయిన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని, నాలుగు వంతెనలకు గతంలో కన్న నాలుగింతల రివైజ్డ్ ఎస్టిమేట్ వేశారని, ఇంత తేడా ఎందుకు వచ్చిందని, ఈ పనులకు మంజూరు ఎలా లభిస్తుందని అధికారులను ప్రశ్నించారు. నిర్ణీత గడువులోగా పని చేయని కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పీఆర్ ఎస్ఈని ప్రశ్నించారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన పథకాల పనులు ఆగస్టు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఆర్డీఓలతో నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చూ డాలన్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు శ్రీహరి తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ వ్యక్తిగత లబ్ధిదారుల బకాయిలను పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చె ల్లింపు విషయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవక లు జరిగాయన్న కోణంలో ఆన్లైన్ ద్వారా విచారణ జరిపామన్నారు. రెండో దశ వెరిఫికేషన్ చేసి బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశం లో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, నామినేటెడ్ సభ్యులు పల్లెపాడు దామోదర్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
ఓ ఎంపీగారి పాడుప్రేమ!
వెనుకబడిన మండలంగా చందర్లపాడు ఎంపిక అంత కన్నా వెనుకబడిన పది మండలాలను పట్టించుకోని వైనం తెరవెనుక చక్రం తిప్పిన టీడీపీ ఎంపీ? ఆయన పరిశ్రమల కోసం కేంద్రం నిధులతో అభివృద్ధి! నందిగామ : అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ ఎంపీ ఒకరు. తాను భవిష్యత్తులో స్థాపించనున్న పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చుకునేందుకు పథకం పన్నారు. ఈ మేరకు ఢిల్లీలో చక్రం తిప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన మండలాల జాబితాలో చందర్లపాడుకు చోటు కల్పించారు. దీంతో చందర్లపాడు కన్నా వెనుకబడిన పది మండలాల ప్రజలు మండిపడుతున్నారు. సదరు ఎంపీకి చందర్లపాడు మండలంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, అందువల్లే వెనుకబడినట్లు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడినా.. పట్టించుకోని వైనం.. జిల్లాలోని నందిగామ, వత్సవాయి, వీరులపాడు, కంచికచర్ల, తిరువూరు, పెనుగంచిప్రోలు, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట, చాట్రాయి మండలాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. ఈ మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా లేదు. నీటి వనరులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మునేటికి వరద వచ్చినప్పుడు మాత్రమే చివరి భూములకు నీరు అందుతుంది. సాగర్ కాలువ ఉన్నా చివరి భూములకు నీరు అందిన దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతాలు కావడంతో వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకృతి ఆటుపోట్లు వచ్చిన ప్రతీసారి పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పది మండలాల్లోని గ్రామాల్లో అంతర్గత రహదారులు లేవు. డొంకరోడ్లు 20 శాతం కూడా నిర్మించలేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. గుర్తింపు వల్ల ఇవీ ఉపయోగాలు.. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తారు. పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపులతోపాటు ఇతర రాయితీలు ఇస్తారు. దీంతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పంచాయతీల ఆదాయం మెరుగుపడుతుంది. ఇన్ని ఉన్నా.. వెనకబడినట్లు గుర్తింపు.. చందర్లపాడు మండలంలో అభివృద్ధికి అవసరమైన వనరులన్నీ ఉన్నాయి. సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు, నీరు, కొండ పోరంబోకు, అటవీ పోరంబోకు, కృష్ణానదీ పరీవాహక పోరంబోకు భూములు అనేకం ఉన్నాయి. మండలంలో ఇప్పటికే సుబాబుల్ కర్ర వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ఇందుకోసం అనేక వేబ్రిడ్జిలు ఉన్నాయి. ముప్పాళ్ల ప్రాంతంలో బస్ బాడీ బిల్డింగ్ ఫ్యాక్టరీ, ఫ్లైవుడ్, టైల్స్, విద్యుత్ ట్రాన్సఫార్మర్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. గుడిమెట్ల-ఉస్తేపల్లి మధ్య కెమికల్ ఫ్యాక్టరీ, ఆయుర్వేద ఫార్మసీ, బిస్లెరీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. గుడిమెట్ల ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు రెండు వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏటూరు గ్రామం నుంచి కంచికచర్ల మండలం మోగులూరును కలుపుతూ మునేటిపై కాజ్వే నిర్మించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద నుంచి గుంటూరు జిల్లా అమరావతిని కలుపుతూ భారీ వంతెనతో పాటు రిజర్వాయర్‌ను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. చందర్లపాడు మండలానికి తూర్పున మునేరు, దక్షిణం పడమరగా కృష్ణానదీ ప్రవహిస్తుండటంతో అక్కడి భూములు పరిశ్రమలకు అనువుగా ఉంటాయని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.