Grant funding
-
స్వఛ్చందసేవకు ఆసరాగా...హెచ్‌సీఎల్
విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పనిచేస్తున్న ఎన్జీఓలకు ఆర్ధికంగా సాయం చేసేందుకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి పుందిర్ తెలిపారు. హెచ్‌సీఎల్ గ్రాంట్ 8వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం... హెచ్‌సిఎల్ ఫౌండేషన్‌లో భాగంగా హెచ్‌సీఎల్ గ్రాంట్ ను 2015లో లాంచ్ అయింది. మా సాయం పొందేందుకు ఒక ఎన్జీఓ ప్రారంభించి కనీసం మూడేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సంస్థల నిర్వహణ, అందిస్తున్న సేవల్లో పారదర్శకత వంటివి చూసి కేటగిరీల వారీగా ఎంపిక చేస్తాం. మా ప్రాధామ్యాల పరంగా సరితూగే సంస్థలను నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. కేటగిరీ వారీగా 3 ఫైనలిస్ట్స్‌ను ఎంపిక చేశాక ఏడాదికి మొత్తం రూ. 16.5 కోట్లు చొప్పున అందిస్తాం. మరో 30 ఎన్జిఓ సంస్థల గురించి ఒక పుస్తకం ప్రచురిస్తాం. ప్రస్తుతం 6వ వాల్యూమ్ ప్రచురించనున్నాం. అది ప్రభుత్వ శాఖలు, దాతలకు చేరుతుంది. వాళ్ల కార్యక్రమాల శైలులు అందరికీ తెలుస్తాయి. దరఖాస్తులకు ఆహ్వానం... ఇది 8వ ఎడిషన్. ఇటీవలే అప్లికేషన్స్ ఓపెన్ చేశాం. ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప సాధారణంగా 60 రోజులు ఓపెన్ చేసి ఉంచుతాం. కేవలం ఆన్లైన్ ద్వారా తప్ప మరే విధంగాననూ దరఖాస్తులు స్వీకరించం. ఏ రాష్ట్రం నుంచైనా, ఏ నగరం, జిల్లా,గ్రామం నుంచైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఎన్జిఓ సంస్థలు దీని గురించి తెలుసుకోవాలనేదే మా ఉద్ధేశ్యం. అందుకే నగరాల వారీగా సింపోజియమ్స్ నిర్వహిస్తున్నాం. ఎన్జీఓలు వాటికి అర్హతలు ఉన్నా లేకున్నా దీనికి హాజరు కావచ్చు. సీఎస్ఆర్ చట్టాలు,, ప్రాంతీయ అంశాలు, ఉపయుక్తమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ సదస్సులు ఉపకరిస్తాయి. విభిన్న మార్గాల ద్వారా ఎన్జీఓలు సాయం పొందే అవకాశాలు కూడా తెలుస్తాయి. చదవండి: ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్. -
రెండేళ్లలో రూ.1,139కోట్లతో అభివృద్ధి
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మహబూబాబాద్ : నియోజకవర్గంలో రెండేళ్లలో రూ.1,139 కోట్ల 53లక్షల నిధులు మంజూరు కాగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ కింద రూ.576 కోట్లు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 124 చెరువులు ఎంపిక కాగా మరమ్మతుల నిమిత్తం రూ.60 కోట్లు విడుదలయ్యూయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ కింద ట్యాంకుల నిర్మాణానికి రూ.3 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.62.86 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి 131 పనుల(బోర్‌వెల్స్, పైపులైన్స్, ఓపెన్ వెల్స్)కు రూ.3.5కోట్లు రాగా పనులు చేసిన ట్లు చెప్పారు. ఐటీడీఏ కింద 20 పనులు చేయగా ఇందుకు రూ. 11.88కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో విద్యా, సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతులు ప్రహరీ, తాగునీటి సౌకర్యం, ఇతరాల కోసం రూ.6.27 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన 34 పనులు జరగ్గా రూ. 193.07కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మానుకోట నుంచి ఈదులపూసపల్లి రోడ్‌కు రూ.25కోట్లు కేటారుుంచామని, టెండర్ పూర్తరుు్యందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పనిము ట్లు, ట్రాక్టర్లకు రూ.2కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించి నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్, గూడూరు, గోదాములకు రూ.9.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ట్రాన్స్‌కో నుంచి సబ్స్టేషన్లు, ఇతరాల కోసం రూ.68.7 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఎస్ఎన్సీయూ, గూడూరులో హెల్త్‌సెంటర్ కోసం రూ. 5.15 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. నియోజకవర్గానికి 400 డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణానికి రూ.21.2 కోట్లు కేటారుుంచామని తెలిపారు. మానుకోటలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి రూ.2కోట్లు, మున్సిపాలిటీలోని 44 పనులకు రూ.2.41 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. సీడీఎఫ్ నుంచి 69 పనులకు రూ.3 కోట్లు కేటారుుంచానన్నారు. రెండు గిరిజన గురుకుల భవన నిర్మాణాలకు రూ.5కోట్లు మంజూరయ్యూయని తెలిపారు. నెల్లికుదురు మండ లం ఆలేరు నుంచి కోమటిపల్లి రోడ్డు కోసం రూ.6.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మానుకోటలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.5కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందన్నారు. అనంతారం మైసమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి రూ.3కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యాయన్నారు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు కాగా టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. నెల్లికుదురు, మునిగలవీడు, మేచరాజుపల్లి, మట్టెవాడ, అన్నారంలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరయ్యూయని వివరించారు. మున్నేరువాగుపై చెక్‌డ్యామ్, ఇతర పనుల కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, పొనుగోటి రామకృష్ణారావు, చౌడవరపు రంగన్న, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, జెర్రిపోతుల వెంకన్న, మల్సూర్, వెన్నమల్ల అజయ్, పెద్ది సైదులు, చారి, దార యాదగిరిరావు, రాజేష్ పాల్గొన్నారు. -
రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు
అడ్డదిడ్డంగా రోడ్డు వెడల్పు పనులు.. పాత డ్రైనేజీలకు కొత్త పూత.. నాణ్యతకు తిలోదకాలిస్తూ డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం.. రోడ్ల మధ్యలోనే విద్యుత్ స్తంభాలు.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల పర్యవేక్షణాలోపం.. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపడుతున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్ల వెడల్పు పనులు సాగుతున్న తీరిది. - డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం - పాత డ్రెయిన్లకే కొత్త పూతలు - పగులుతున్న పైపులైన్లు...గొంతెండుతున్న ప్రజలు - ఎక్సెస్ రేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి - పట్టించుకోని అధికారులు - కరీంనగర్లో అధ్వానంగా రోడ్డు వెడల్పు పనులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నగరం నలువైపులా ఉన్న రోడ్లను వంద ఫీట్ల వెడల్పుతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతోంది. సుమారు 14.5 కిలోమీటర్ల మేరకు రోడ్డు వెడల్పు పనులతోపాటు డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.46 కోట్లు విడుదల చేసింది. భారీ ఎత్తున నిధులు మంజూరు కావడంతో కాసులపంట పండిందుకున్న కాంట్రాక్టర్లు, అధికారుల అండదండలతో నిబంధనలను తోసిరాజని అడ్డదిడ్డంగా రోడ్లు వెడల్పు, డ్రైనేజీల నిర్మాణాన్ని కొనసగిస్తున్నారు. డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సుమారు రూ.37 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ వరకు, తెలంగాణ చౌక్‌నుంచి ఆర్టీసీ వర్క్‌షాప్ వరకు, కోర్టు చౌరస్తా నుంచి ఆపోలో ఆసుపత్రి వరకు, మంచి ర్యాల చౌరస్తా నుంచి పెద్దపల్లి బైపాస్ వరకు ఉన్న రోడ్లును వంద ఫీట్లు వెడల్పు చేసి పునరుద్దరించాల్సి ఉంది. మిగిలిన రూ.9కోట్ల మొత్తాన్ని సెంట్రల్ లైటింగ్‌కు కేటాయించారు. ప్రధానంగా బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. 40 ఎంఎం, 20 ఎంఎం కంకర, 10 ఎంఎం చిప్స్‌తో వెట్‌మిక్స్ వేయాల్సిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా తవ్వి డస్ట్‌తో నింపేస్తున్నారు. అణగడానికి కనీసం రోలింగ్, క్యూరింగ్ కూడా చేయడం లేదు. ఫలితంగా రోడ్డు పనులన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. గట్టిగా నాలుగు వానలు పడితే ఎక్కడికక్కడ గుంతలేర్పడే విధంగా కన్పిస్తున్నాయి. పాత డ్రైనేజీలకే కొత్త పూతలు నిబంధనల ప్రకారం నూతన రోడ్డు నిర్మాణంతోపాటు రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లు పాత డ్రైనేజీలకే కొత్త పూత పూస్తున్నారు. పాత డ్రెయినేజీలపై అడుగు, అడుగున్నర ఎత్తుతో కొత్త బెడ్పోసి పూర్తిగా డ్రైనేజీ నిర్మించినట్లుగా లెక్కలేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రైనేజీలు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్డుకు డ్రైనేజీకి సంబంధమే లేకుండా పోతోంది. అవసరం లేని చోట సైతం తవ్వి కొత్త డ్రైనేజీని సృష్టిస్తున్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపులోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. రోడ్డు వెడల్పు సందర్భంగా విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉన్నప్పటికీ... అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాలుండే పరిస్థితి కన్పిస్తోంది. పనులు ఇంత నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వెట్‌మిక్స్ వేసేటప్పుడు, బీటీ వేసేటప్పుడు, డ్రెయినేజీల నిర్మాణం జరిగేటప్పుడు అధికారులు లేకుండానే పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నిఘా లేకపోవడంతో కాంట్రాక్టర్ చేసిందే నాణ్యత అన్నట్లు తయారైంది. నో లెస్.. పదేళ్లుగా ఎక్సైస్సే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అభివృద్ధి పనుల్లో గత పదేళ్లలో ఏ ఒక్క టెండర్ కూడా లెస్‌కు వేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినప్పటికీ అందులో ఏ ఒక్క పనీ లేస్‌కు వేయలేదని తెలిసింది. దాదాపు అన్ని పనులకు ఎక్సెస్ టెండర్లు పడుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. మరోవైపు హాట్‌మిక్స్ ప్లాంట్ (హెచ్ఎంపీ) ఉన్న కాంట్రాక్టర్లకే సివిల్ పనులు కట్టబెడుతుండటంతో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ పనులను సైతం బీటీ రోడ్డుతో కలిపి హెచ్ఎంపీ ఉన్న కాంట్రాక్టర్‌కే అర్హత కల్పిస్తుండడంతో సివిల్ కాంట్రాక్టర్లకు ఒక్క పని కూడా దక్కడం లేదు. పైగా సివిల్ పనులు దక్కించుకున్న కొందరు హెచ్ఎంపీ కాంట్రాక్టర్లు ఆయా పనులను మళ్లీ సివిల్ కాంట్రాక్టర్లకే అప్పగిస్తూ... వారి నుంచి కొంత మొత్తాన్ని గుడ్‌విల్ రూపంలో తీసుకుంటున్నారు. సివిల్ పనులను నిబంధనల మేరకు తమకే ఇవ్వాలని కోరుతూ గతంలో చాలాసార్లు సివిల్ కాంట్రాక్టర్లు ఆర్అండ్బీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పటికీ అధికారులెవరూ పట్టించుకున్న పాపానపోలేదు. పగులుతున్న మంచినీటి పైపులైన్లు ఆర్అండ్బీ రోడ్ల పనులు నిర్లక్ష్యంగా చేస్తుండడంతో నగరవాసులు మంచినీటి సరఫరా జరిగే పైపులైన్లు పగులుతున్నాయి. పనులు నడిచినన్ని రోజులు నీటి కోసం ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో మనుషులతో తవ్వించాలనే నిబంధనను కూడా విస్మరించిన కాంట్రాక్టర్లు ప్రొక్టెయిన్తో తవ్వడంతో పైపులు పగిలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు ఎంత మొత్తుకున్నా ఆర్అండ్బీ అధికారులు చెవిక్కెడం లేదు. చివరకు కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అక్షింతలు వేసినా స్పందించిన దాఖలాలు లేవు. కమీషన్లకే ప్రాధాన్యం! ఆర్అండ్బీ అధికారులు అభివృద్ధి పనుల్లో కమీషన్లకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బీటీ రోడ్డు పనులను బీటీ కాంట్రాక్టర్లు, సివిల్ పనులను సివిల్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండింటినీ కలిపి ఒకే టెండర్ కిందకు తెస్తూ హెచ్ఎంపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 18 మంది ఉన్న హెచ్ఎంపీ కాంట్రాక్టర్ల కోసం వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లను బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల చేయని పనులకు కూడా బిల్లులు రాసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఒక్క పనిని కూడా సివిల్ కాంట్రాక్టర్లు దక్కించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపు మండిన సివిల్ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి, ఆర్అండ్బీ మంత్రికి, చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
సీఎం సహాయ నిధి నుంచి డబ్బు ఇప్పిస్తానని మోసం
నిందితుడి అరెస్టు సిటీబ్యూరో: ఆయా కేసుల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తానని పలువురిని నిలువునా దోచుకున్న ఓ మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా కథనం మేరకు...అనంతపురం జిల్లా జోగుల కొత్తపల్లికి చెందిన బంగారు సురేష్ (36) తనకు తాను సీఎం పేషీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీఏనంటూ పలువురిని మోసగించాడు. మల్కాజిగిరికి చెందిన అంజయ్య కుమారుడు కరీంనగర్లో గతేడాది సెప్టెంబర్ 10న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయని, మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని అంజయ్యకు సురేష్ ఫోన్ చేసి చెప్పాడు. నిజమే అనుకున్న అంజయ్య అతను చెప్పిన ప్రకారం డిపాజిట్ కింద రూ.10 వేలు సురేష్ బ్యాంక్ అకౌంట్లో వేశాడు. సురేష్ ఇదే తీరులో పలువురు బాధితుల నుంచి డబ్బు వసూలు చేశాడు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు రాకపోవడంతో చివరకు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసు బుధవారం సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మట్టిపోసి మాయజేసి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే రూ.9 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. నాసిరకంగా చేపట్టిన పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయించుకునేందుకు ఆ ఎమ్మెల్యే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బిల్లు చేయకుంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా పనిచేయలేరని అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. నాసిరకంగా చేస్తున్న పనులకు నిధులు మంజూరు చేయడానికి అధికారులెవ్వరూ సాహసించటం లేదు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు ఓ అధికారి రిజర్వాయర్ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పుకుంటే.. మరో అధికారి సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకెళితే.. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కలువాయి మండలంలో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేశమనేనిపల్లి, తోపుగుంట, కండాపురం, చవటపల్లి వద్ద నాలుగు రిజర్వాయర్లు నిర్మించాలని భావించింది. ఆ మేరకు 2009లో రూ.24 కోట్లు మంజూ రు చేసింది. ఆ మేరకు ఓ కాంట్రాక్టర్ తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. అయితే ఆ కాంట్రాక్టర్ రిజ ర్వాయర్ పనులను మధ్యలో ఆపేశాడు. పనులు చేయలేనని చేతులెత్తేశాడు. నాసిరకం మట్టితో రిజర్వాయర్ పనులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టలేనన్న కాంట్రాక్టర్ టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు చేస్తానని ముందుకొచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టర్ ఒప్పుకోవటానికి వెనుక టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తెలిసింది. ‘నీకు నేను అండగా ఉంటాను. ఏదోలా పనులు పూర్తి చేసేయ్. బిల్లుల మంజూరు నేను చూసుకుంటాను. అందులో నాకు వాటా ఇవ్వాలి’ అని ఒప్పందం కుదుర్చుకున్నాకే కేశమనాయనపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అండగా నాసిరకం మట్టి (సుద్ద) మట్టితో హడావుడిగా కట్టనిర్మాణం చేస్తున్నారు. సుద్దమట్టి తీసుకొచ్చి కట్టపై పోసి రోలింగ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి కట్టలు కోసుకుపోతున్నాయని, అదేవిధంగా కట్టపై నడవాలంటే కాలు మట్టిలో కూరుకుపోతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కట్ట అనేక చోట్ల కోసుకుపోయి దర్శనమిస్తోంది. బిల్లు చేయాలంటూ అధికారులకు ఎమ్మెల్యే బెదిరింపులు రిజర్వాయర్ పనులు పూర్తి నాసిరకంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని పనులను పర్యవేక్షిస్తున్న అధికారిపై టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ఆ అధికారి ససేమిరా అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లు అధికం కావటంతో తనపై అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. రిజర్వాయర్ పనుల పర్యవేక్షణ బాధ్యతలను తనను తప్పించమని వేడుకున్నారు. స్పందించిన ఉన్నతాధికారులు అతడ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. అతనిపైనా ఎమ్మెల్యే బిల్లుల మంజూరుకు ఒత్తిడి తెస్తున్నారు. అతను కూడా రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనులు పూర్తి నాసిరకంగా ఉండటంతో బిల్లు చేయటానికి ఆయనా ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే ఇరిగేషన్ ఈఈపై ఒత్తిడి చేశారు. ఈఈ తన వద్దకు ఫైల్ వస్తే మంజూరుకు సంతకం చేస్తానని చెప్పి తప్పించుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ‘వెంటనే బిల్లులు మంజూరు చేయకపోతే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా పనిచేయలేవు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. -
క్రీడలకు ‘విభజన’ శాపం
- నిధుల మంజూరులో జాప్యం - విడుదల కాని రూ.50.05 కోట్లు - ప్రశ్నార్థకంగా 10 స్టేడియాల ఆధునికీకరణ - కొత్త ప్రభుత్వం కరుణ కోసం నిరీక్షణ నెల్లూరు(బృందావనం): జిల్లాలో క్రీడా ప్రగతికి రాష్ట్ర విభజన శాపంగా మారింది. కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాల ఆధునికీకరణకు గ్రహణం పట్టింది. బాలారిష్టాలెన్నింటినో దాటుకుని పనుల దశకు వచ్చిన సమయంలో విభజన జరిగి, నిధులు మంజూరు నిలిచిపోయింది. మరోవైపు గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు కాలం చెల్లింది. దీంతో క్రీడారంగ అభివృద్ధి ప్రశ్నార్థకమవుతోందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు రూ.50.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాలను ఆధునికీక రిస్తామని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ప్రకటించింది. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్ ఆధునికీకరణకు రూ.14 కోట్లు, మాగుంటలే అవుట్లో టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 6.95 కోట్లు, వెంకటగిరిలోని తారకరామ క్రీడాప్రాంగణం అభివృద్ధికి రూ.2.70 కోట్లు, గూ డూరు, ఉదయగిరిల్లో మినీస్టేడియాలకు ఫెన్సింగ్ నిర్మాణానికి రూ.55 లక్షలు మంజూరు చేశారు. ఇక కొత్తగా మినీస్టేడియాల నిర్మాణానికి సంబంధించి అల్లీపురానికి రూ.3.60 కోట్లు, ఆత్మకూరుకు రూ.7.15 కోట్లు, పొదలకూరుకు రూ.2.60 కోట్లు, కోవూరుకు రూ.5.05 కోట్లు, కావలికి రూ.4.70 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.2.75 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ప్రాంగణంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునికీకరణ, మాగుంట లేఅవుట్లో నూతన టెన్నిస్ కాంప్లెక్స్, అల్లీపురంలో మినీస్టేడియం నిర్మాణానికి మార్చి 2న అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని అప్పట్లో ఆయన సభాముఖంగా అధికారులకు సూచించారు. విభజనతో నిధులకు గ్రహణం రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలన పరంగా తలెత్తిన సమస్యలతో గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. దీంతో రూ.50.05 కోట్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. నిధుల విడుదల కాక, ఆధునికీకరణ పనులు జరగక జిల్లాలో ప్రస్తుతం ఉన్న క్రీడాప్రాంగణాలు కళతప్పుతున్నాయి.కొత్త ప్రభుత్వమైనా స్పందించి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేసి క్రీడాభివృద్ధికి సహకరించాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు. త్వరలో నిధులు విడుదల: ఆర్.కె.ఎతిరాజ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలో విడుదల అవుతాయి. ఇప్పటికే జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్, కలెక్టర్ శ్రీకాంత్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సమీక్ష సమావేశం కూడా నిర్వహిం చారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించాం. మరో పదిహేను రోజుల్లో నిధుల విడుదల జరిగి పనులు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సొసైటీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ ఫ్లోట్ చేయనుంది. మరో 15 రోజు ల్లోగా సమగ్ర సమాచారం అందుతుంది.