సీఎం సహాయ నిధి నుంచి డబ్బు ఇప్పిస్తానని మోసం | cm aid money from the fraud | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధి నుంచి డబ్బు ఇప్పిస్తానని మోసం

Published Wed, Apr 1 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

cm aid money from the fraud

నిందితుడి అరెస్టు

సిటీబ్యూరో: ఆయా కేసుల్లో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తానని పలువురిని నిలువునా దోచుకున్న ఓ మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా కథనం మేరకు...అనంతపురం జిల్లా జోగుల కొత్తపల్లికి చెందిన బంగారు సురేష్ (36) తనకు తాను సీఎం పేషీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీఏనంటూ పలువురిని మోసగించాడు.

మల్కాజిగిరికి చెందిన అంజయ్య కుమారుడు కరీంనగర్‌లో గతేడాది సెప్టెంబర్ 10న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయని, మీరు కొంత డబ్బు డిపాజిట్ చేయాలని అంజయ్యకు సురేష్ ఫోన్ చేసి చెప్పాడు. నిజమే అనుకున్న అంజయ్య అతను చెప్పిన ప్రకారం డిపాజిట్ కింద రూ.10 వేలు సురేష్ బ్యాంక్ అకౌంట్‌లో వేశాడు. సురేష్ ఇదే తీరులో పలువురు బాధితుల నుంచి డబ్బు వసూలు చేశాడు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు రాకపోవడంతో చివరకు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసు బుధవారం సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement