
మహబూబాబాద్: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా ప్రయోగ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి పాదాలు మొక్కి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఆమన్‌గల్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి రైతు వద్ది సుదర్శన్ రెడ్డి స్థలం ఇచ్చారు. రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థలం ఇచ్చిన రైతు సుదర్శన్‌రెడ్డి కాళ్లను ఎమ్మెల్యే మొక్కారు. పాదాభివందనం చేస్తుండగా రైతు వారించాడు. రైతు స్థలం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రైతును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment