నాయక్‌పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ | TDP comments on Mla shankar Nayak | Sakshi
Sakshi News home page

నాయక్‌పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ

Published Sat, Jul 15 2017 3:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

నాయక్‌పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ - Sakshi

నాయక్‌పై నిర్భయ కేసు పెట్టాలి: టీడీపీ

సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనా ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ ప్రతినిధి బృందం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, స్వేచ్ఛగా విధులను నిర్వహించలేకపోతున్నానని ప్రీతి మీనా ఆరు నెలల క్రితమే సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన వారిని కాపాడటం కోసం డ్రగ్స్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, అదే జరిగితే తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా నాశనం అవుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement