Mony Mints World’s Smallest 4G Smartphone: Check World’s Smallest 4G Smartphone Price & Features - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి చిన్న 4జీ స్మార్ట్‌ఫోన్‌..! ధర ఏంతంటే..?

Published Sun, Aug 8 2021 8:19 PM | Last Updated on Mon, Aug 9 2021 10:56 AM

World Smallest 4G Smartphone Is Currently Available - Sakshi

Mony Mint World Smallest 4G Smartphone: ప్రపంచంలోనే అతి చిన్న 4జీ సపోర్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన మోనీ మింట్‌ రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏటీఎమ్‌ కార్డు సైజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  మోనీ మింట్‌ స్మార్ట్‌ఫోన్‌ మూడు అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ నెలలో  అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మోనీ మింట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు 150 డాలర్లు(సుమారు రూ. 11,131) గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తోందనే విషయం కంపెనీ తెలపలేదు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెరికా, యూరోపియన్‌ నెట్‌వర్క్‌ బ్యాండ్‌లను సపోర్ట్‌ చేస్తుందని తెలుస్తోంది.  

మోనీ మింట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

  • ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 1,250mAh పాలిమర్ బ్యాటరీ
  • 5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
  • 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 854*450 రిసల్యూషన్‌ డిస్‌ప్లే
  • 1.5గిగా హెర్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
  • 3జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, ఎక్సపాండబుల్‌ అప్‌టూ 128 జీబీ
  • డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement