న్యూఢిల్లీ: రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ), టెక్నీషియన్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న 26,502 ఖాళీలను 60 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై రైల్వేశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే తాజా పెంపు చేపట్టినట్లు తెలిపారు. ఏఎల్‌పీ, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ నెల 9న తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. ఆగస్టు 9న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయన్నారు. పరీక్ష రాసేందుకు జనరల్ అభ్యర్థులకు గంట, దివ్యాంగులకు మరో 20 నిమిషాలు అదనంగా కేటాయిస్తామన్నారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ట్రావెల్ అథారిటీ కూడా తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment