ఫైల్ ఫోటో
సాక్షి,న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. భారీఎత్తున ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. దాదాపు లక్షమంది ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. సీ, డీ గ్రూపుల ఉద్యోగులకోసం నిర్వహించనున్న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో డీ గ్రూపునకు గాను 63వేలమందికి అవకాశం కల్పించనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్లు, స్విచ్‌మెన్, ట్రాక్‌మెన్, పోర్టర్లు లాంటి ఇతర పోస్టుల నియామకం కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 62,907 డి గ్రూపు పోస్టుల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు బుధవారం ట్విటర్‌లో వెల్లడించారు.
పదవ తరగతి పాస్ లేదా ఐటీఐ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ కలిగిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 18 వేలు. అభ్యర్థుల వయస్సు 18-31 సంవత్సరాలు ఉండాలి. వీటితో పాటు గ్రూప్ సి కింద 26,502 (టెక్నీషియన్లు, అసిస్టెంట్ లోకో పైలట్ల) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీతోపాటు ఈ ఏడాది 30,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
చాలా నియామకాలు భద్రతా వర్గానికి చెందినవని రైల్వే సీనియర్ అధికారి వెల్లడించారని మింట్ నివేదించింది. తద్వారా సంవత్సరానికి రూ. 3-4వేల కోట్లు రైల్వే ఖజానా ఖర్చు చేస్తుందనీ, 2018బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారని పేర్కొంది.
(ట్విటర్ ఫోటో)
అయితే వివిధకారణాలతో లక్షల కొద్దీ ఖాళీగా ఉన్న ఉద్యోగుల స్థానాలు ఈ భారీ నియామకాలతో కూడా పరిపూర్ణం కావని మరో ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు. వార్షికంగా 3.3శాతంమంది రిటైర్ అవుతూ వుండటంతో దీర్ఘకాలంగా ఆ స్థానాలు భర్తీ కాకుండా ఉన్నాయని మాజీ రైల్వై బోర్డు ఛైర్మన్ అరుణేంద్ర కుమార్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. వినియోగదారుల భద్రతే ప్రధాన కర్తవ్యమైన రైల్వే శాఖలో ఉద్యోగుల నియామకాలు క్రమంగా జరగాలన్నారు.
रेलवे में युवाओं के लिये अवसरः ग्रुप-डी के 62,907 पदों के लिये रेलवे ने हाई स्कूल तथा ITI पास युवाओं के लिये भर्ती प्रक्रिया शुरु की है, योग्य अभ्यर्थी इन पदों के लिये आवेदन कर सकते हैं, आवेदन की अंतिम तिथि 12 मार्च, 2018 है। pic.twitter.com/zdNOduOn50
— Piyush Goyal (@PiyushGoyal) February 14, 2018
Comments
Please login to add a commentAdd a comment