Recruitment Drive
-
లోకల్ కేడర్ నిబంధనలు తప్పకుండా పాటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతుల విషయంలో లోకల్ కేడర్ నిబంధనల ను తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సర్వీసెస్) వికాస్‌రాజ్ శుక్రవారం అన్ని శాఖలకు సర్క్యులర్ పంపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు అమల్లో ఉన్నందున ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. -
‘ఫేస్బుక్’లో కొత్తగా నియామకాలు
సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్బుక్’ ఇంగ్లండ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. గత ఏడాది అక్కడి కార్యాలయంలో 1290 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇటీవల వారి సంఖ్యను 1965కు పెంచింది. వారిలో ఒక్కొక్కరికి సగటున 117,170 (దాదాపు కోటీ ఐదు లక్షల రూపాయలు) పౌండ్ల చొప్పున మొత్తంగా 233.2 మిలియన్ (దాదాపు 2069 కోట్ల రూపాయలు) పౌండ్లను వేతనాల కింద చెల్లిస్తోంది. బ్రిటీష్ మాజీ డిప్యూటి ప్రధాన మంత్రి నిక్ క్లెగ్‌ను గత ఏడాది ప్రధాన లాబీయిస్ట్‌గా తీసుకున్న ఫేస్బుక్ యాజమాన్యం ఇంగ్లండ్‌లో ఉద్యోగుల నియామకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇంగ్లండ్ కార్యాలయంలో ఫేస్బుక్ ఉద్యోగులకు ఉచిత భోజనంతోపాటు కాసేపు కునుకు తీసేందుకు నిద్రపోయే ప్యాడ్స్‌ను కూడా ఉచితంగా అందజేస్తోంది. ఇతర రాయితీలను కూడా కొనసాగిస్తోంది. 2018లో ఫేస్బుక్ రెవెన్యూ 1.3 బిలియన్ పౌండ్ల నుంచి 1.7 పాండ్లకు పెరగడంతో కార్యకలాపాల విస్తరణను చేపట్టింది. అంతకుముందు 15.8 మిలియన్ పౌండ్ల పన్నులను చెల్లించిన కంపెనీ ఆ తర్వాత ఏడాది లాభాలు పెరిగినా 1.9 మిలియన్ పౌండ్లను తగ్గించి చెల్లింపులు జరపడం ఏమిటని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. కంపెనీ విస్తరణ కార్యక్రమాల వల్ల పన్నుల్లో రాయతీలు లభిస్తాయని అందుకని పన్ను భారం తగ్గిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. 2020 నాటికి ఉద్యోగుల సంఖ్య మూడు వేలకు చేరుకుంటుందని ఉత్తర యూరప్ కంపెనీ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ హాచ్ తెలిపారు. ఏదీ ఏమైనా కంపెనీ లాభాలు పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా అదనపు పన్ను చెల్లించాల్సిందేనని పన్నులకు సంబంధించిన పార్లమెంట్ గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మార్గరెట్ హోడ్జ్ కంపెనీకి ట్వీట్ చేశారు. -
‘రైల్వే నియామకాల పేరుతో మరో టోకరా’
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల్లో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం పెదవివిరిచారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వ మరో మోసపు ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులపై రైల్వే మంత్రిత్వ శాఖ హఠాత్తుగా మేలుకొందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రైల్వేల్లో 2,82,976 పోస్టులు ఖాళీ ఉంటే కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని మరో మోసంతో ముందుకొస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఇదే పరిస్ధితి ఉందని, ఓవైపు ఖాళీ పోస్టులుంటే, మరోవైపు నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 2021 నాటికి రైల్వేలు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. రానున్న రెండేళ్లలో 2.3 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలు
పశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియలో మొత్తం 5718 ఖాళీలు పూరించనుంది. అప్రెంటీస్ చట్టం1961 ప్రకారం ఏడాదికాలం శిక్షణకోసం వీరిని ఎంపిక చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 2019 జనవరి 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్పి ఉంటుంది. https://www.rrc-wr.com/ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ నెం.ఆర్ఆర్సి / డబ్ల్యుఆర్ / 04/2018 (ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్)క్లిక్ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి లేదా ఇంటర్ పాసై వుండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది వుండాలి. వయసు: 15-24సంవత్సరాల వయస్సు. ఆయా కేటగిరీల వారీగా వయసులో మినహాయింపు ఎంపిక: పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఫీజు : 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనవరి 15న మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 21 జనవరి నుంచి ప్రారంభం. 2019 ఏప్రిల్ 1తేదీనుంచి ట్రైనింగ్ మొదలు -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 198 పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లో గేట్ స్కోర్ కార్డు ఆధారంగా రిక్రూట్మెంట్ జరుగుతుందని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి గేట్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయవచ్చని పేర్కొంది. అభ్యర్ధులు బీఈ\బీటెక్ (సివిల్, ఎలక్ర్టికల్) గ్రాడ్యుయేట్లు కావడంతో పాటు 2019 గేట్ స్కోర్‌లో అర్హమైన మార్కులు సాధించాలి. 2019 గేట్ పరీక్షకు అభ్యర్ధులు హాజరై గేట్ పేపర్ కోడ్స్‌లోని ఈఈ, సీఈల్లో ఒక పేపర్‌ను ఎంచుకోవాలి. అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా జూనియర్ టెలికాం ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. -
పేటీఎం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్, వారికి శుభవార్త!
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం మాల్, గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది. అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పేటీఎం మాల్ పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇది క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్‌లో సెకండ్ ఎడిషన్. ఈ ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. వీటిలో టాప్ పర్‌ఫార్మెర్స్ జాబితాను అక్టోబర్ 10న పేటీఎం మాల్ ప్రకటించనుంది. వీరికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్లో ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్రొగ్రామ్‌ను తొలుత 2017లో లాంచ్ చేశారు. ఆ సమయంలో 2,200 మంది విద్యార్థులను నియమించుకుంది.‘మా క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్ ప్రారంభ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వందల కొద్ది గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నాం. దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్ ఐకాన్’ అని పేటీఎం మాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్‌సిన్హా తెలిపారు. ఈ ప్రొగ్రామ్‌తో తర్వాతి తరం యువ ప్రొఫిషినల్స్‌కు మంచి అనుభవం కల్గిస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదో అపూర్వ అవకాశమని అన్నారు. కస్టమర్ల రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ఆఫ్‌లైన్ మర్చెంట్ల వ్యాపారా వృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. భారీఎత్తున ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. దాదాపు లక్షమంది ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. సీ, డీ గ్రూపుల ఉద్యోగులకోసం నిర్వహించనున్న ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో డీ గ్రూపునకు గాను 63వేలమందికి అవకాశం కల్పించనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్లు, స్విచ్మెన్, ట్రాక్‌మెన్, పోర్టర్లు లాంటి ఇతర పోస్టుల నియామకం కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 62,907 డి గ్రూపు పోస్టుల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించినట్టు బుధవారం ట్విటర్లో వెల్లడించారు. పదవ తరగతి పాస్ లేదా ఐటీఐ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ కలిగిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 18 వేలు. అభ్యర్థుల వయస్సు 18-31 సంవత్సరాలు ఉండాలి. వీటితో పాటు గ్రూప్ సి కింద 26,502 (టెక్నీషియన్లు, అసిస్టెంట్ లోకో పైలట్ల) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీతోపాటు ఈ ఏడాది 30,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. చాలా నియామకాలు భద్రతా వర్గానికి చెందినవని రైల్వే సీనియర్ అధికారి వెల్లడించారని మింట్ నివేదించింది. తద్వారా సంవత్సరానికి రూ. 3-4వేల కోట్లు రైల్వే ఖజానా ఖర్చు చేస్తుందనీ, 2018బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారని పేర్కొంది. (ట్విటర్ ఫోటో) అయితే వివిధకారణాలతో లక్షల కొద్దీ ఖాళీగా ఉన్న ఉద్యోగుల స్థానాలు ఈ భారీ నియామకాలతో కూడా పరిపూర్ణం కావని మరో ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు. వార్షికంగా 3.3శాతంమంది రిటైర్ అవుతూ వుండటంతో దీర్ఘకాలంగా ఆ స్థానాలు భర్తీ కాకుండా ఉన్నాయని మాజీ రైల్వై బోర్డు ఛైర్మన్ అరుణేంద్ర కుమార్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. వినియోగదారుల భద్రతే ప్రధాన కర్తవ్యమైన రైల్వే శాఖలో ఉద్యోగుల నియామకాలు క్రమంగా జరగాలన్నారు. रेलवे में युवाओं के लिये अवसरः ग्रुप-डी के 62,907 पदों के लिये रेलवे ने हाई स्कूल तथा ITI पास युवाओं के लिये भर्ती प्रक्रिया शुरु की है, योग्य अभ्यर्थी इन पदों के लिये आवेदन कर सकते हैं, आवेदन की अंतिम तिथि 12 मार्च, 2018 है। pic.twitter.com/zdNOduOn50 — Piyush Goyal (@PiyushGoyal) February 14, 2018 -
నేవీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో తొక్కిసలాట
ముంబైః నేవీ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. భారీ తొక్కిసలాటకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ముంబైలోని మలాద్ లో జరిగే రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు పెద్ద ఎత్తున బయల్దేరిన యువకులు మైదానంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అందరూ మైదానంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ అభ్యర్థులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పరీక్షకు సుమారు 4000 మంది హాజరవుతారని ఊహించారు. అయితే అంతకు మించి భారీగా 6000 మంది వరకూ హాజరు కావడం.. వారంతా ఒకేసారి గేటునుంచీ లోపలకు తోసుకు రావడంతో తొక్కిసలాట సంభవించినట్లు తెలుస్తోంది. అనుకోని ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తొక్సిసలాటలో ఇద్దరు అభ్యర్థులకు గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన నేవీ అధికారులు... తాము వాలంటీర్లనుంచీ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్మీ డ్రైవ్‌కు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ అధికారుల (రిలీజియస్ టీచర్) నియామకాల కోసం ఈ నెల 10 వరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జిల్లాలకు చెందిన అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను హైదరాబాద్ జిల్లా యువజన సంక్షేమాధికారి కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం దగ్గర, పీఓ మనోవికాస్‌నగర్‌లో గల సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం వద్ద ఈ నెల 28న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ నెల 4 నాటికి 27 నుంచి 34 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఆర్మీ సోల్జర్స్‌కు 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదేని డిగ్రీతో పాటు అదనంగా రిలీజియస్లో అర్హత కలిగి ఉండాలన్నారు. -
21మంది జ్యోతిష్మతీ విద్యార్థులకు ఉద్యోగాలు
తిమ్మాపూర్, న్యూస్‌లైన్: మండలంలోని జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో హైదరాబాద్‌కు చెందిన ఏజిల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కంపెనీ వారు శుక్రవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 20 మంది ఎంపికైనట్లు చైర్మన్ జె.సాగర్‌రావు తెలిపారు. కళాశాలలోని అన్ని గ్రూప్‌లకు చెందిన 140 మంది హాజరు కాగా రెండు రౌండ్లలో 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు. వీరికి కంపెనీ ప్రతినిధి సృజన నియామక పత్రాలు అందించారు. విద్యార్థులు ఐటీ రిక్రూటర్స్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తారని ప్రతినిధి తెలిపారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఇది 16వ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని, వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వి.పూర్ణచంద్రరావు, డెరైక్టర్ వెంకట్రావు కోరారు. నేడు మరో రిక్రూట్మెంట్ డ్రైవ్ జ్యోతిష్మతీ విద్యాసంస్థల్లో శనివారం రైజ్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో సీఎస్ఈ, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఎంటెక్ కంప్యూటర్స్ విద్యార్థులు అర్హులని చెప్పారు.