
నేవీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో తొక్కిసలాట
ముంబైః నేవీ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. భారీ తొక్కిసలాటకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ముంబైలోని మలాద్ లో జరిగే రిక్రూట్ మెంట్ డ్రైవ్ కు పెద్ద ఎత్తున బయల్దేరిన యువకులు మైదానంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అందరూ మైదానంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ అభ్యర్థులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.
పరీక్షకు సుమారు 4000 మంది హాజరవుతారని ఊహించారు. అయితే అంతకు మించి భారీగా 6000 మంది వరకూ హాజరు కావడం.. వారంతా ఒకేసారి గేటునుంచీ లోపలకు తోసుకు రావడంతో తొక్కిసలాట సంభవించినట్లు తెలుస్తోంది. అనుకోని ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తొక్సిసలాటలో ఇద్దరు అభ్యర్థులకు గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన నేవీ అధికారులు... తాము వాలంటీర్లనుంచీ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.