
పశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియలో మొత్తం 5718 ఖాళీలు పూరించనుంది. అప్రెంటీస్ చట్టం1961 ప్రకారం ఏడాదికాలం శిక్షణకోసం వీరిని ఎంపిక చేయనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 2019 జనవరి 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్పి ఉంటుంది. https://www.rrc-wr.com/ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ నెం.ఆర్ఆర్‌సి / డబ్ల్యుఆర్ / 04/2018 (ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్)క్లిక్ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి లేదా ఇంటర్ పాసై వుండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది వుండాలి.
వయసు: 15-24సంవత్సరాల వయస్సు. ఆయా కేటగిరీల వారీగా వయసులో మినహాయింపు
ఎంపిక: పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
ఫీజు : 100 రూపాయలు. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనవరి 15న మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 21 జనవరి నుంచి ప్రారంభం. 2019 ఏప్రిల్ 1తేదీనుంచి ట్రైనింగ్ మొదలు