
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతుల విషయంలో లోకల్ కేడర్ నిబంధనల ను తప్పకుండా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సర్వీసెస్) వికాస్‌రాజ్ శుక్రవారం అన్ని శాఖలకు సర్క్యులర్ పంపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు అమల్లో ఉన్నందున ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.