
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్‌ఎన్‌ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 198 పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌లో గేట్ స్కోర్ కార్డు ఆధారంగా రిక్రూట్‌మెంట్ జరుగుతుందని ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి గేట్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చని పేర్కొంది.
అభ్యర్ధులు బీఈ\బీటెక్ (సివిల్, ఎలక్ర్టికల్) గ్రాడ్యుయేట్లు కావడంతో పాటు 2019 గేట్ స్కోర్‌లో అర్హమైన మార్కులు సాధించాలి. 2019 గేట్ పరీక్షకు అభ్యర్ధులు హాజరై గేట్ పేపర్ కోడ్స్‌లోని ఈఈ, సీఈల్లో ఒక పేపర్‌ను ఎంచుకోవాలి. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా జూనియర్ టెలికాం ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment