సాక్షి, హైదరాబాద్: ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ అధికారుల (రిలీజియస్ టీచర్) నియామకాల కోసం ఈ నెల 10 వరకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జిల్లాలకు చెందిన అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను హైదరాబాద్ జిల్లా యువజన సంక్షేమాధికారి కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం దగ్గర, పీఓ మనోవికాస్‌నగర్‌లో గల సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
అర్హులైన అభ్యర్థులకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం వద్ద ఈ నెల 28న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ నెల 4 నాటికి 27 నుంచి 34 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఆర్మీ సోల్జర్స్‌కు 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదేని డిగ్రీతో పాటు అదనంగా రిలీజియస్‌లో అర్హత కలిగి ఉండాలన్నారు.
ఆర్మీ డ్రైవ్‌కు దరఖాస్తులు
Published Fri, Feb 5 2016 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement