కమిషనర్‌గా హరినారాయణన్ బాధ్యతల స్వీకరణ
కమిషనర్‌గా హరినారాయణన్ బాధ్యతల స్వీకరణ
Published Thu, Jul 28 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
∙ద్వారకానగర్: నగర ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జీవీఎంసీ నూతన కమిషనర్ ఎం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించి టీం వర్క్‌తో స్మార్ట్‌సిటీ లక్ష్యాలను కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అవసరాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా విశాఖ అభివృద్ధికి కషి చేయనున్నట్టు వివరించారు. అంకితభావంతో పారదర్శకంగా పరిపాలన సాగిస్తానని స్పష్టం చేశారు. నగరం అభివద్ధి పథంలో నడుస్తోందని.. మరింత వేగంగా పరుగులు తీయిద్దామన్నారు. ఏడీసీ (జనరల్) జి.వి.వి.ఎస్.మూర్తి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు యూనియన్ల నాయకులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
Advertisement
Advertisement